E-Paper
Advertisement

ఆ డైరెక్టర్ నరకం చూపించాడు.. మళ్లీ ఆ మొహం చూడను – ప్రగతి షాకింగ్ కామెంట్స్

ఆ డైరెక్టర్ నరకం చూపించాడు.. మళ్లీ ఆ మొహం చూడను – ప్రగతి షాకింగ్ కామెంట్స్
Advertisement

Pragathi Actress : హీరోయిన్ గా కెరీర్ మొదలెట్టి అక్కగా, అమ్మగా, అత్తగా మెప్పించిన ప్రగతి ఈ మధ్య వర్కవుట్స్‌తో సోషల్ మీడియాని షేక్ చేస్తుంది కూడా. ముఖ్యంగా పవర్ లిఫ్టింగ్ లో పలు పతకాలు ఈవిడ సొంతం చేసుకోవడం విశేషం. ఇలా రెండు రంగాల్లో తనదైన ముద్ర వేసిన ప్రగతి తాజాగా ఇక ఇంటర్వ్యూలో తన సినిమా జీవితంలో ఎదురైన కొన్ని చేదు అనుభవాలని ఇలా పంచుకున్నారు.

ఆ సెట్ ఒక ‘నరకం’.. ఆ దర్శకుడితో ఇక అంతే!

Advertisement

మాములుగా సినీ ఇండస్ట్రీలో తమకి ఎదురైనా బ్యాడ్ ఇన్సిడెంట్స్ ని షేర్ చేసుకోవడానికి వెనుకడుగువేస్తారు. కానీ ప్రగతి మాత్రం తనకు ఎదురైన బ్యాడ్ ఇన్సిడెంట్‌ని బయటపెట్టేశారు. గతంలో ఒక డైరెక్టర్‌తో కలిసి పనిచేసినప్పుడు తనకి నరకం చూపించాడని, ఆ సినిమాలో తను నటిస్తున్నన్ని రోజులు తనకో పీడకలగా మారాయని, అందుకే ఫ్యూచర్లో ఇంకెప్పుడు కూడా అతనితో పని చేయకూడదని ఫిక్స్ అయ్యాయని తన మనసులోని మాటలని బయటపెట్టేసింది.

అంతేకాకుండా సినిమాల గురించి, పాత్రల గురించి మాట్లాడుతూ తనకి రెమ్యూనరేషన్ కన్నా మంచి పాత్ర దొరికితే సంతోషిస్తానని, అందుకోసం రెమ్యూనరేషన్ అయినా తగ్గించుకుంటానని, అదే నచ్చని పాత్ర ఆఫర్ చేస్తే ఎన్ని కోట్లు ఇచ్చినా ఆ పాత్రలో నటించను అంటూ పాత్రల పట్ల, మనీ పట్ల తనకున్న అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టేసింది.

Advertisement

ALSO READ :మృణాల్ ‘గ్లామర్’ డోస్.. తెలుగులో సీతమ్మ, హిందీలో మాత్రం రచ్చ రంబోలా!

ప్రగతి సినిమాల సంగతికొస్తే

మొదటగా తమిళంలో వీట్ల విశేషాంగ (1994) సినిమాతో తమిళ దర్శకుడు భాగ్యరాజా సరసన హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఇక ఆ తరువాత దాదాపు 7 తమిళ సినిమాలు, ఒక మలయాళ సినిమాలో హీరోయిన్‌గా కనిపించింది. అయితే పెళ్లి తో గ్యాప్ తీసుకున్న ప్రగతి మహేష్ బాబు బాబీ (2002)తో తెలుగులో రీ ఎంట్రీ ఇచ్చింది.

అలా నువ్వే నువ్వే (2002), దూకుడు, ఎఫ్2 & ఎఫ్3 (ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్), ఓ బేబీ, రేసుగుర్రం, మిస్టర్ పర్ఫెక్ట్, బాద్‌షా, రెడీ, చిరుత, లక్ష్యం, అత్తారింటికి దారేది అంటూ దాదాపు వంద సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించడం విశేషమైతే, ‘ఏమైంది ఈ వేళ’ సినిమాకు ఉత్తమ సహాయ నటిగా నంది అవార్డు అందుకోవడం మరో విశేషం.

50 ఏళ్ల వయసులో ఆమె చేస్తున్న పవర్ లిఫ్టింగ్

ఇక సినిమాల సంగతి పక్కన పెడితే ఈ మధ్య జిమ్‌లో ప్రగతి చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. ముఖ్యంగా 50 ఏళ్ల వయసులో ఆమె చేస్తున్న పవర్ లిఫ్టింగ్ విన్యాసాలు చూస్తే కుర్రాళ్లకి చెమటలు పట్టాల్సిందే. ఇక ఇదే ఊపులో ఇప్పటికే పవర్ లిఫ్టింగ్ పోటీల్లో పాల్గొని ఎన్నో మెడల్స్ పట్టేసింది కూడా.

ఏది ఏమైనా ఇండస్ట్రీలో తనకు ఎదురైన బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ని చెప్పిన ప్రగతి, ఆ నరకం ఎవరి వల్ల చూశానన్నది కూడా బయట పెట్టాల్సింది.

ALSO READ :తమన్నా కాళ్ళు పట్టుకుంటానంటున్న బాలీవుడ్ స్టార్ ..కామెంట్స్ వైరల్

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×