E-Paper
Advertisement

Prabhas: ‘కపుల్ ఫ్రెండ్లీ’కి ప్రభాస్ సపోర్ట్.. ఎస్‌కెఎన్ రియాక్షన్ చూశారా?

Prabhas: ‘కపుల్ ఫ్రెండ్లీ’కి ప్రభాస్ సపోర్ట్.. ఎస్‌కెఎన్ రియాక్షన్ చూశారా?
Advertisement

Prabhas: టాలీవుడ్ బాహుబలి, రెబల్ స్టార్ ప్రభాస్ (Rebel Star Prabhas) రేంజ్ ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పాన్ ఇండియా స్థాయిలో వేల కోట్ల బిజినెస్ చేసే సినిమాలతో ఆయన బిజీగా ఉన్నప్పటికీ, తన ప్రాణ స్నేహితుల కోసం, తనను నమ్ముకున్న వారి కోసం సమయం కేటాయించడంలో ప్రభాస్ ఎప్పుడూ ముందుంటారని ప్రభాస్ మరోసారి నిరూపించారు. తాజాగా యంగ్ హీరో సంతోష్ శోభన్ (Santosh Sobhan) నటించిన ‘కపుల్ ఫ్రెండ్లీ’ (Couple Friendly) సినిమా విషయంలో ప్రభాస్ చూపిన చొరవ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సంతోష్ శోభన్ కెరీర్ ఆరంభం నుండి ప్రభాస్, యూవీ క్రియేషన్స్ సంస్థ అతనికి అండగా నిలుస్తూనే ఉన్నారు. ఆయన తాజా చిత్రం ‘కపుల్ ఫ్రెండ్లీ’ ప్రమోషన్స్‌లో భాగంగా ప్రభాస్ ప్రత్యేకంగా ఈ చిత్ర బృందంతో ముచ్చటించారు.

Also Read- Rajinikanth -Kamal Hassan: రజిని కమల్ మూవీ నుంచి బిగ్ అప్డేట్.. ప్రోమో ముహూర్తం పిక్స్!

కొండంత బలం

Advertisement

కేవలం సినిమా గురించి మాట్లాడటమే కాకుండా, సంతోష్ శోభన్‌ను దగ్గరకు తీసుకుని ఆప్యాయంగా హగ్ చేసుకున్న విజువల్స్ అభిమానుల మనసు గెలుచుకుంటున్నాయి. తన బిజీ షెడ్యూల్‌లో కూడా ఒక చిన్న సినిమా కోసం ఆయన సమయం కేటాయించడం, ఆ చిత్ర యూనిట్‌కు కొండంత బలాన్ని ఇస్తోంది. ప్రభాస్ చూపించిన ఈ చొరవపై నిర్మాత ఎస్‌కెఎన్ (Producer SKN) రియాక్ట్ అవుతూ చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. చిన్న సినిమాకు, సంతోష్‌కు ప్రభాస్ అందించిన సపోర్ట్‌పై ఎస్‌కెఎన్ ట్విట్టర్ ఎక్స్ వేదికగా ప్రశంసలు కురిపించారు.

Also Read- Nawab Cafe Movie Review: ‘నవాబ్ కేఫ్‌’లో టీ గ్లాస్ పగిలింది.. చూసేటోళ్ల గుండె పగిలింది!

డార్లింగ్ సపోర్ట్‌కి ఎస్‌కెఎన్ ఫిదా

Advertisement

‘‘డార్లింగ్ ప్రభాస్ కొత్త లుక్ అదిరిపోయింది. యువ ప్రతిభను ప్రోత్సహించడంలో మన రెబల్ స్టార్ ఎప్పుడూ ముందుంటారు. ఎంత బిజీగా ఉన్నా తన వారు అనుకున్న వారి కోసం సమయం కేటాయించడం ఆయన గొప్పతనం. సంతోష్ శోభన్.. నువ్వు నిజంగా చాలా లక్కీ!’’ అంటూ ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా, ఈ చిత్ర నిర్మాత ధీరజ్ మొగిలినేని, హీరోయిన్ మానస వారణాసి ఇతర సాంకేతిక నిపుణులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. యూవీ కాన్సెప్ట్స్, యూవీ క్రియేషన్స్ సమర్పణలో వచ్చిన ఈ సినిమాకు ప్రభాస్ మద్దతు లభించడంతో సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెరిగాయి. ఒక స్టార్ హీరో చిన్న సినిమా కోసం దాదాపు రెండు మాటలు కేటాయించడం మాములు విషయం కాదు. ప్రభాస్ వంటి అంతర్జాతీయ స్థాయి నటుడు ఒక ఇంటర్వ్యూ ఇచ్చి, స్వయంగా ప్రమోట్ చేయడం అంటే అది ఆ సినిమాకు లభించే అతిపెద్ద గౌరవమనే చెప్పుకోవాలి. మరి ప్రభాస్ సపోర్ట్‌తో ఈ సినిమా కలెక్షన్స్ ఏ రేంజ్‌లో పెరుగుతాయో చూద్దాం..

Also Read- Prabhas: ప్రభాస్ ఆల్ టైం ఫేవరెట్ మూవీ ఏంటో తెలుసా.. ఆ సినిమా అంటే అంత ఇష్టమా?

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×