E-Paper
Advertisement

Prabhas:పాన్ ఇండియా కోసం ప్రభాస్ నేర్చుకున్న 5 ప్రత్యేక నైపుణ్యాలు ఏమిటో తెలుసా..!

Prabhas:పాన్ ఇండియా కోసం ప్రభాస్ నేర్చుకున్న 5 ప్రత్యేక నైపుణ్యాలు ఏమిటో తెలుసా..!
Advertisement

Prabhas: పాన్‌ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి చెప్పాలంటే ఆయన నటనతో పాటు సినిమాల కోసం ప్రభాస్ పడిన కష్టం గురించి కూడా మాట్లాడుకోవాలి. తెలుగు సినిమా స్థాయిని దేశవ్యాప్తంగా తీసుకెళ్లిన హీరోగా ప్రభాస్ ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. ఆయన నటించిన ప్రతి భారీ సినిమా వెనుక ఎన్నో సంవత్సరాల కష్టం..అంకితభావం ఉంది. ముఖ్యంగా ఆయన కొన్ని సినిమాల కోసం ఎన్నో నైపుణ్యాలు నేర్చుకున్నారు. ఇంతకీ అవి ఏమిటి అంటే..

విలువిద్య సైతం..!

బాహుబలి సినిమా కోసం ప్రభాస్ జీవితాన్నే మార్చుకున్నారని చెప్పొచ్చు. ఈ పాత్ర కోసం ఆయన దాదాపు ఐదేళ్ల పాటు విలువిద్య (బాణసంచా విద్య)లో శిక్షణ పొందారు. బాణం వదిలే ప్రతి సన్నివేశం సహజంగా కనిపించాలనే ఉద్దేశంతో రోజూ గంటల తరబడి సాధన చేశారు. ఈ విలువిద్య నైపుణ్యాన్ని తర్వాత ఆదిపురుష్ సినిమాలో రాముడి పాత్రకు కూడా ఉపయోగించారు.

గుర్రపు స్వారి..!

Advertisement

బాహుబలి సినిమా కోసం ప్రభాస్ గుర్రపు స్వారీని పూర్తిగా కొత్తగా నేర్చుకున్నారు. ఆయుధాలతో గుర్రంపై వేగంగా ప్రయాణించడం అంత సులువు కాదు. అయినా ప్రొఫెషనల్ గుర్రపు శిక్షకుల సహాయంతో ప్రతిరోజూ ఉదయాన్నే సాధన చేసి ఈ నైపుణ్యాన్ని సంపాదించారు. అలాగే కత్తి యుద్ధం, ఫైటింగ్ పద్ధతుల్లో కూడా నిపుణుల నుంచి శిక్షణ తీసుకున్నారు.

ఏకంగా స్కూబా డ్రైవింగ్..!

సాహో సినిమా కోసం ప్రభాస్ ప్రత్యేకంగా స్కూబా డైవింగ్ నేర్చుకున్నారు. నీటిలో జరిగే యాక్షన్ సన్నివేశాల్లో శ్వాస ఆపుకుని స్టంట్స్ చేయడం చాలా కష్టం. అయినా సీన్లు నిజంగా కనిపించాలనే ఉద్దేశంతో ఈ శిక్షణ తీసుకున్నారు. అంతేకాదు, ఈ సినిమా కోసం హాలీవుడ్ ట్రైనర్ల దగ్గర పార్కూర్, ప్లయోమెట్రిక్స్ వంటి కఠినమైన వ్యాయామాలు కూడా చేశారు.

Advertisement

ఇటీవల వచ్చిన కల్కి 2898 ఏడీ వంటి భారీ సినిమాల కోసం కూడా ప్రభాస్ కొత్త నైపుణ్యాలు నేర్చుకుంటూనే ఉన్నారు. శారీరక బలం పెంచుకోవడం, యాక్షన్ సన్నివేశాల్లో చురుకుదనం చూపించడం కోసం యోగా, కార్డియో, ఫిట్‌నెస్ శిక్షణను రోజువారీ అలవాటుగా మార్చుకున్నారు.

అందుకే ప్రభాస్ సినిమాల్లో యాక్షన్ సన్నివేశాలు చాలా సహజంగా కనిపిస్తాయి. స్టార్ హీరో అయినా కూడా కష్టపడటాన్ని ఎప్పుడూ వదలని వ్యక్తిత్వం ఆయనది. పాన్‌ ఇండియా స్థాయిలో ప్రభాస్ నిలబడటానికి కారణం ఆయన అంకితభావం, శ్రమనే అని చెప్పవచ్చు.

ALSO READ: The Kerala Story 2 Telugu Trailer: ది కేరళ స్టోరీ 2 తెలుగు ట్రైలర్ విడుదల.. మొదటి భాగం కన్నా సంచలనంగా..!

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×