E-Paper
Advertisement

Prabhas Fitness: ప్రభాస్ ఫిట్ నెస్ సీక్రెట్ ఎంటో చెప్పిన జిమ్ ట్రైనర్.. అందుకే నేమో..

Prabhas Fitness: ప్రభాస్ ఫిట్ నెస్ సీక్రెట్ ఎంటో చెప్పిన జిమ్ ట్రైనర్.. అందుకే నేమో..
Advertisement

Prabhas Fitness: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వెండితెరపై కనిపించే తీరు, ఆయన కటౌట్ వెనుక ఎంతో క్రమశిక్షణ, కఠిన శ్రమ దాగి ఉన్నాయి. ఇటీవల ప్రముఖ ఫిట్‌నెస్ ట్రైనర్ గావిన్ ఒక ఇంటర్వ్యూలో ప్రభాస్ ఆరోగ్య రహస్యాలను, ఆయన బాడీ ట్రాన్స్‌ఫార్మేషన్ విశేషాలను పంచుకున్నారు. ఛత్రపతి సినిమా సమయం నుండి ప్రభాస్‌కు వ్యక్తిగత శిక్షకుడిగా ఉన్న గావిన్, ‘బాహుబలి’ వంటి భారీ చిత్రాల కోసం ప్రభాస్ పడ్డ కష్టాన్ని వివరించారు.

Read also-యవ్వనంలో ఆమె చేసిన పనులు చెప్తుంటే.. ఏం థ్రిల్ ఉంది మామా..

అసలైన రహస్యం

Advertisement

ప్రభాస్ తన కెరీర్‌లో ఒకానొక సమయంలో దాదాపు 30 కిలోల బరువు తగ్గాల్సి వచ్చింది. దీని కోసం ఆయన ఎంతో నిబద్ధతతో పనిచేశారు. కేవలం జిమ్‌లో బరువులు ఎత్తడమే కాకుండా, బాక్సింగ్, బాస్కెట్‌బాల్, హ్యాండ్‌బాల్ వంటి క్రీడల ద్వారా శరీరాన్ని ఫ్లెక్సిబుల్ (Flexible)గా మార్చుకున్నారు. కొన్ని సందర్భాల్లో అత్యంత కఠినమైన ‘స్టీమ్ రూమ్ వర్కౌట్స్’ కూడా చేసేవారని గావిన్ వెల్లడించారు. ప్రభాస్ ఒక పనిని మొదలుపెడితే దానికి 100% న్యాయం చేస్తారని, అది ఆయన ఆహారపు అలవాట్లలో కూడా కనిపిస్తుందని తెలిపారు.

ఆహారం

ఫిట్‌నెస్‌లో వ్యాయామం పాత్ర కేవలం 40% అయితే, మిగిలిన 60% మనం తీసుకునే ఆహారం (Diet) పైనే ఆధారపడి ఉంటుంది. ప్రభాస్ ఫిట్‌నెస్ ప్రయాణంలో గావిన్ సూచించిన కొన్ని ముఖ్యమైన సూత్రాలు ఇవే.. స్వీట్లు, చక్కెర కూల్ డ్రింక్స్‌ను పూర్తిగా పక్కన పెట్టడం. శరీర బరువుకు అనుగుణంగా తగినంత ప్రోటీన్ తీసుకోవడం. మాంసాహారులకు చేపలు (Fish) ఉత్తమమని, ఇది చర్మానికి కూడా మంచిదని ఆయన పేర్కొన్నారు. శరీరం తిరిగి శక్తిని పుంజుకోవడానికి తగినంత విశ్రాంతి తప్పనిసరి. లేట్ నైట్ పార్టీలు, నిద్రలేమి ఆరోగ్యానికి శత్రువులని హెచ్చరించారు.

Advertisement

Read also-సోష‌ల్ మీడియాలో ఈ లేడీ గురించే ఒక‌టే గోల‌..శ్రేయాస్ అయ్య‌ర్ కు ఉన్న రిలేష‌న్ ఏంటి

ఫిట్‌నెస్ చిట్కాలు

ప్రతి ఒక్కరూ ప్రభాస్ లాంటి బాడీ కావాలని కోరుకుంటారు, కానీ దానికి క్రమశిక్షణ అవసరమని గావిన్ సూచించారు. ఆయన పంచుకున్న కొన్ని సామాన్య చిట్కాలు. ఇతరులకు చూపించుకోవడానికి శక్తికి మించిన బరువులు ఎత్తకూడదు. దీనివల్ల గాయాలయ్యే ప్రమాదం ఉంది. మొదట శరీరాన్ని సాగదీయడం (Stretching), తర్వాత వెయిట్ ట్రైనింగ్, చివరగా కార్డియో (బ్రిస్క్ వాకింగ్) చేయడం వల్ల ఫలితం బాగుంటుంది. అన్నం తింటే లావవుతారనేది తప్పు. ఒక వంతు అన్నం తింటే, రెండు వంతుల కూరగాయలు తినడం వల్ల బ్యాలెన్స్ అవుతుంది. చివరగా, శరీరాన్ని ఒక దేవాలయంలా గౌరవించాలని, నేడు మనం ఆరోగ్యం కోసం కేటాయించే సమయం భవిష్యత్తులో డాక్టర్ల బిల్లులను తగ్గిస్తుందని గావిన్ ఈ ఇంటర్వ్యూ ద్వారా సందేశాన్ని ఇచ్చారు. సినిమా స్టార్లు అయినా, సామాన్యులైనా ఆరోగ్యానికి మించిన ఆస్తి లేదని ఈ వీడియో ద్వారా స్పష్టమవుతోంది.

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×