Fauji Shoot: వరుస పాన్ ఇండియా సినిమాలతో బాక్సాఫీస్ షేక్ చేయడానికి రెడీ అవుతున్నారు ప్రభాస్.ఈ క్రమంలో హనురాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న హిస్టారికల్ యాక్షన్ సినిమా ఫౌజీ షూటింగ్ జోరుగా షూటింగ్ జరుపుకుంటుంది కూడా.1940 కాలం నాటి వార్ బ్యాక్ డ్రాప్ లో మైత్రి మూవీ మేకర్ ప్రెస్టేజ్ గా నిర్మిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు ఆకాశంలో ఉన్నాయి .
రామోజీ ఫిలిం సిటీలో ఏర్పాటుచేసిన భారీ సెట్లో
ఈ మూవీ చిత్రీకరణ హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో వేగంగా జరుగుతుంది. అయితే ఈ సినిమాలో కీ రోల్ పోషిస్తున్న బాలీవుడ్ నటుడు రాజేష్ శర్మను విషపురుగు కాటేసినట్లు, దీంతో ఆయన తీవ్ర అస్వస్థతకు గురైనట్లు టాక్ వినిపించింది. షూటింగ్ ముగిసిన తర్వాత సెట్ లో అక్కడి టెక్నీషియన్లతో మాట్లాడుతుండగా.. ఆయన కాలికి విషపు పురుగు కాటేసిందని వార్తలు వచ్చాయి. మొదటగా అది సాధారణ పురుగే అనుకొని నిర్లక్ష్యం చేశారని.. కానీ ఆరు గంటల తర్వాత తీవ్రమైన నొప్పి, జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది రావడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారని ప్రచారం జరుగుతుంది. .
క్లారిటీ ఇచ్చిన పీఏ సుభాశిష్ పాండా
అయితే దీనిపై వస్తున్న రూమర్స్ ని కొట్టేస్తూ క్లారిటీ ఇచ్చాడు పీఏ సుభాశిష్ పాండా . రాజేశ్ శర్మ గురించి నడుస్తున్న ప్రచారం పై ఆయన రియాక్ట్ అయ్యాడు. ఫౌజీ షూటింగులో నటుడుకు కాటేసిందనే ప్రచారాన్ని ఖండిస్తూ వీడియోను రిలీజ్ చేశారు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలన్నీ అవాస్తవమని.. రాజేశ్ శర్మ కేవలం డయాబెటిస్ కారణంగానే ఆసుపత్రిలో చేరారని.. ఇప్పుడు ఆయన ఆరోగ్యంగా ఉన్నారని. గురువారం డిశ్చార్జ్ అవుతారని తెలిపారు. షూటింగ్ సెట్ లో విషపుపురుగు కాటేసిందని వస్తున్న ప్రచారం నిజం కాదని అన్నారు.
https://twitter.com/Itsaprank132511/status/2074904505909657904
also read:టాలీవుడ్‌లో మరో డైరెక్టర్-హీరోయిన్ లవ్ ట్రాక్.. సైలెంట్‌గా పెళ్లి పీటల వైపు అడుగులు!
ఇక రాజేష్ శర్మ సినిమాల విషయానికొస్తే ది డర్టీ పిక్చర్’, ‘ఎంఎస్ ధోని: ది అన్‌టోల్డ్ స్టోరీ’, ‘తాను వెడ్స్ మాను రిటర్న్స్’ ఎన్నో సూపర్ హిట్ సినిమాలతో బాలీవుడ్ లో సత్తా చాటిన సంగతి తెల్సిందే.