// // Poonam Kaur: సామ్-రాజ్ పెళ్లి.. కాపురాలు కూల్చిందంటూ.. -->
E-Paper
Advertisement

Poonam Kaur: నీ కోసం పక్క వాళ్ల కాపురాలు కూల్చుతావా?.. సమంతకు పూనమ్‌ స్ట్రాంగ్‌ కౌంటర్

Poonam Kaur: నీ కోసం పక్క వాళ్ల కాపురాలు కూల్చుతావా?.. సమంతకు పూనమ్‌ స్ట్రాంగ్‌ కౌంటర్
Advertisement

Poonam Kaur Tweet After Samantha Marriage: సమంత–రాజ్‌ నిడిమోరు పెళ్లి ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్‌ టాపిక్‌గా మారింది. ఇద్దరికి ఇది రెండో పెళ్లనే విషయం తెలిసిందే. సమంత రెండో పెళ్లి చేసుకుని కొత్త జీవితం ప్రారంభించినందుకు ఆమె ఫ్యాన్స్‌ ఖుష్‌ అవుతున్నారు. మరోవైపు యాంటి ఫ్యాన్స్‌ నుంచి భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో నటి పూనమ్‌ కౌర్‌ ఓ ట్వీట్‌ చేసింది. ఆమె ట్వీట్‌ చూస్తుంటే ఇది సమంతని ఉద్దేశించేలా ఉందని నెటిజన్స్‌ అభిప్రాయపడుతున్నారు.

సొంత ఇంటి కోసం.. పక్కవాళ్ల జీవితాల్లో చిచ్చు

Advertisement

“మీ సొంత ఇంటిని సృష్టించడానికి ఒక ఇంటిని విచ్ఛిన్నం చేయడం విచారం ఉంది. పెయిడ్‌ పీఆర్‌ల చేత ప్రచారాలు చేసుకుంటు ప్రజల్లో కీర్తి, సానుభూతి పొందిన ఉమెన్‌ సాధికారిత కలిగిన చదువుకున్న అహంకారపు మహిళ . డబ్బుతో బలంతో బలహీనమైన నిరాశపూరిత పురుషుడిని కొనుగోలు చేసింది” అంటూ తన పోస్ట్‌లో రాసుకొచ్చింది. ఇది చూసి అంత ఇది సమంతను ఉద్దేశించే ఈ కామెంట్స్‌ చేసిందని నెటిజన్స్‌ అంత అభిప్రాయపడుతున్నారు.

సమంత కోసమే భార్యకు విడాకులు?

Advertisement

కాగా సమంత పరిచయం తర్వాత రాజ్‌ ఆయన భార్య శ్యామాలి డేకి విడాకులు ఇచ్చాడని ఇండస్ట్రీలో టాక్‌. అంతేకాదు వీరిద్దరి రిలేషన్‌పై వార్తలు వచ్చిన ప్రతిసారి శ్యామాలి డే తన ఇన్‌స్టాలో విమర్శలు చేస్తూ పోస్టు పెడుతుంది. పరోక్షంగా సమంతని శాపానార్థాలు పెడుతూ పోస్ట్స్‌ పెడుతుండేంది. ఈ రోజు పెళ్లి వార్తలు వస్తున్న నేపథ్యంలోనూ శ్యామాలి డే క్రిప్టిక్‌ పోస్ట్‌ షేర్‌ చేసింది. బరితెగించిన మనుషులు.. బరితెగించే పనులు చేస్తారు ఇన్‌స్టా స్టోరీలో పోస్ట్‌ పెట్టింది. ఇక సమంత పెళ్లి తర్వాత పూనమ్‌.. కాపురాలు కూల్చుతున్న మహిళ అంటూ ట్వీట్‌ చేయడం సంచలనంగా మారింది.

2021లో సమంత 2022లో రాజ్ నిడిమోరు

కాగా ది ఫ్యామిలీ మ్యాన్‌ 2 వెబ్‌ సిరీస్‌లోనే సమంత–రాజ్‌ నిడిమోరులకు పరిచయం అయ్యింది. అప్పటి నుంచి వారి మధ్య మంచి పరిచయం ఉంది. అయితే నాగ చైతన్యతో విడాకులు తర్వాత వీరిద్దరి మధ్య మరింత సాన్నిహిత్యం పెరిగింది. అది కాస్తా ప్రేమకు దారితీసిందని అంటున్నారు. సమంతతో రిలేషన్‌ కారణంగా రాజ్ నిడిమోను తన భార్య శ్యామాలికి విడాకులు ఇచ్చాడని సినీ సర్కిల్లో టాక్. సమంత విడాకులు తర్వాత రాజ్–శ్యామాలి విడాకులు ఇవ్వడం ఈ రూమర్స్‌కి మరింత ఆజ్యం పోస్తుంది. 2022లో రాజ్ నిడిమోరు–శ్యామాలి డే విడాకులు అయినట్టు తెలుస్తోంది.

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×