E-Paper
Advertisement

Pooja Hegde: క్యారవాన్ లోకి వచ్చి టచ్ చేసిన స్టార్ హీరో.. చెంప చెల్లుమనిపించిన బుట్టబొమ్మ

Pooja Hegde: క్యారవాన్ లోకి వచ్చి టచ్ చేసిన స్టార్ హీరో.. చెంప చెల్లుమనిపించిన బుట్టబొమ్మ
Advertisement

Pooja Hegde: సినిమా ఇండస్ట్రీలో సెలబ్రిటీలు ఎప్పటినుంచో ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా క్యారెక్టర్ ఆర్టిస్టులను మొదలుకొని హీరోయిన్స్ వరకు ఆడవారు ఎన్నో లైంగిక వేధింపులు కూడా అనుభవిస్తున్నారు. అయితే ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా పుణ్యమా అని ఒక్కొక్కరు తాము ఎదుర్కొన్న ఇబ్బందులను ధైర్యంగా బయటకు చెప్పుకుంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే హీరోయిన్స్ పట్ల కొంతమంది దురుసుగా ప్రవర్తించడాన్ని ఖండిస్తూ ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. ఇప్పుడు ఆ జాబితాలోకి బుట్ట బొమ్మ పూజా హెగ్డే కూడా చేరిపోయింది. తాజాగా గతంలో తనకు ఎదురైన ఒక షాకింగ్ సంఘటన గురించి చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది.

పూజా హెగ్డే కి చేదు అనుభవం..

ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న పూజా హెగ్డే మాట్లాడుతూ.. నేను నా కెరియర్ కొత్తలో ఒక భారీ పాన్ ఇండియా సినిమాలో నటించాను. ఆ సినిమా షూటింగ్ సమయంలో ఒక స్టార్ నటుడు కనీస అనుమతి లేకుండా నా క్యారవాన్ లోకి వచ్చాడు. ఆ క్షణంలో నేను ఎంతో ఇబ్బంది పడ్డాను. నటుడిగా ప్రతి ఒక్కరికి హద్దులు ఉంటాయి. కానీ అతడు నాతో హద్దులు దాటినట్లు అనిపించింది. క్యారవాన్ లోకి వచ్చి నాపై చేయి వేయబోయాడు.ఇక ఏం చేయాలో అర్థం కాక.. మౌనంగా ఉండలేక వెంటనే అతడి చెంప చెల్లుమనిపించాను. దాంతో అతడు వ్యాన్ దిగి వెళ్ళిపోయాడు.

Advertisement

ALSO READ:Tollywood: మిగిలింది ఆ ఇద్దరు హీరోలే.. ఈ ఏడాదైనా ఆ బెంచ్ మార్క్ అందుకుంటారా?

అతడితో మళ్ళీ నటించలేదు..

ఇక ఆ ఘటన తర్వాత నేను మళ్ళీ అతడితో కలిసి పనిచేయలేదు. ఇకపోతే ఆ పాన్ ఇండియా సినిమాలో అతడితో నేను కొన్ని సీన్స్ లో చేయాల్సి ఉండగా.. డూప్ ని పెట్టి తీసేసారు అంటూ తెలిపింది పూజా హెగ్డే. మొత్తానికైతే పూజా హెగ్డే ఆ వ్యక్తి ఎవరు అనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. ఏది ఏమైనా పూజా హెగ్డే తాజాగా చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అతడు ఎవరో చెప్పాలి అని కొంతమంది నెటిజన్లు, ఆమె అభిమానులు సోషల్ మీడియా ద్వారా ట్వీట్ చేస్తున్నారు.

పూజా హెగ్డే సినిమాలు..

Advertisement

గత కొంతకాలంగా సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న ఈ ముద్దుగుమ్మ.. గత ఏడాది సూపర్ స్టార్ రజినీకాంత్ (rajinikanth)హీరోగా నటించిన కూలీ సినిమాలో స్పెషల్ సాంగ్ లో నటించి భారీ పాపులారిటీ అందుకుంది. ఇప్పుడు విజయ్ జననాయగన్ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. నిజానికి ఈ సినిమా ఈ ఏడాది జనవరిలో సంక్రాంతి సందర్భంగా విడుదల కావాల్సి ఉండగా.. సెన్సార్ జాప్యం వల్ల వాయిదా పడింది. మరి ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందో తెలియదు కానీ పూజా హెగ్డే మాత్రం పూర్తిగా దీనిపైన తన ఆశలు పెట్టుకుంది. మరి ఈ సినిమా విడుదలయ్యాక ఈమెకు ఎలాంటి సక్సెస్ ను అందిస్తుందో చూడాలి.

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×