// // Pooja Hegde - 'బాహుబలి 3'లో ప్రభాస్‌ సరసన హీరోయిన్‌ నేనే.. పూజా షాకింగ్‌ కామెంట్స్‌ -->
E-Paper
Advertisement

Pooja Hegde: ‘బాహుబలి 3’లో ప్రభాస్‌ సరసన హీరోయిన్‌ నేనే.. పూజా షాకింగ్‌ కామెంట్స్‌

Pooja Hegde: ‘బాహుబలి 3’లో ప్రభాస్‌ సరసన హీరోయిన్‌ నేనే.. పూజా షాకింగ్‌ కామెంట్స్‌
Advertisement

Pooja Hegde in Baahubali 3: ఒకప్పుడు తెలుగులో మోస్ట్ వాంటెడ్‌ హీరోయిన్‌గా ఉన్న పూజా హెగ్డే.. ఈ మధ్య తెలుగులో అవకాశాలు కరువయ్యాయి. ఒకప్పుడు డేట్స్‌ లేక సినిమాలు వదులుకున్న ఈ భామ.. ఇప్పుడు ఏ ఆఫర్‌ వస్తుందా? ఏ డైరెక్టర్‌కి ఒకే చెబుతామని వేచి చూస్తోంది. అయినప్పటికీ తెలుగు దర్శకలుఉ ఈ బుట్టబొమ్మ పట్టించుకోవడం లేదు. మొన్నటి టాలీవుడ్ లక్కీ లెగ్‌ అంటూ ఆమెను ఆకాశానికి ఎత్తేశారు. కానీ, సినిమా ఛాన్స్‌ కావాలి అంటున్న కూడా.. పూజా వంకే చూడట్లేదు దర్శక–నిర్మాతలు. ఎందుకో తెలియదు.. కానీ, సడెన్‌గా తెలుగులో ఆమె కెరీర్‌ గాడి తప్పింది.

Advertisement

సర్కారు వారి పాట, విజయ్‌ జనగనమణ వంటి సినిమాల నుంచి ఆమెను తప్పించడం.. ఆ తర్వాత ఈ సినిమా ఆగిపోవడం.. దీంతో పూజా బాలీవుడ్‌కి మాకాం మార్చడం.. అన్ని సడెన్‌గా జరిగిపోయాయి. ఇక టాలీవుడ్‌లో అవకాశాల రాకపోవడం తమిళ్‌, హిందీ ఇండస్ట్రీపై ఫోకస్‌ పెట్టింది. బీస్ట్‌ మూవీతో తమిళ్‌ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. కానీ, ఈ సినిమా ప్లాప్‌ అయ్యింది. మరోవైపు హిందీలోనూ వరుస ప్లాప్స్‌ చూస్తోంది. లాంగ్‌ గ్యాప్‌ తర్వాత రేట్రో మూవీతో తమిళ్‌లో రీఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా తర్వాత ఆమె కూలీలో స్పెషల్‌ సాంగ్‌లో నటించింది. మరో రెండు రోజుల్లో కూలీ మూవీ రిలీజ్‌ అవుతున్న సందర్భంగా బుట్టబొమ్మ పూజ ఓ బాలీవుడ్‌ మీడియాతో ముచ్చటించింది.

బాహుబలి 3లో హీరోయిన్ గా చేస్తా

Advertisement

ఈ సందర్భంగా తన కెరీర్‌కి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకుంది. ఈ సందర్భంగా డైరెక్టర్‌ రాజమౌళి, ప్రభాస్‌ల బాహుబలి మూవీపై స్పందించింది. ప్రస్తుతం తెలుగులో చేయాలనుకునే సినిమా ఏంటి? ఏ హీరోతో చేస్తారని ప్రశ్నించగా.. ‘బాహుబలి అని సమాధానం ఇచ్చింది. ఒకవేళ ప్రభాస్‌ ఎప్పుడైన బాహుబలి 3 తీస్తే.. అందులో నన్ను తన హీరోయిన్‌గా తీసుకోమని అడుగుతాను‘ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం పూజ చేసిన ఈ కామెంట్స్‌ వైరల్‌ అవుతున్నాయి. పూజ హెగ్డే ఏంటీ? ప్రభాస్‌తో చేస్తానని అనడమేంటని ఆశ్చర్యపోతున్నారు. ఎంతోకాలంగా పూజా హెగ్డే, ప్రభాస్‌ మధ్య మనస్పర్థల ఉన్న సంగతి తెలిసిందే. రాధేశ్యామ్‌ మూవీ టైంలో వీరి మధ్య విభేదాలు మొదలయ్యాయని, అప్పటి గొడవలు ఇంకా అలాగే ఉన్నాయని ఇండస్ట్రీలో టాక్‌.

Also Read: Rashi Singh: హైదరాబాద్‌లో ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించిన హీరోయిన్ రాశీ సింగ్.. వీడియో వైరల్‌

ప్రభాస్ తో విభేదాలు..?

రాధేశ్యామ్‌ టైంలో పూజ హెగ్డే యాటిట్యూడ్‌, ఈగో వల్ల ప్రభాస్‌ హర్ట్‌ అయ్యాడని, అలా వీరిద్దరి మధ్య మనస్పర్థలు వచ్చినట్టు అప్పట్లో ప్రచారం జరిగింది. అలాంటిదేం లేదని వీరిద్దరు చెప్పిన.. ప్రభాస్‌, పూజలు మాత్రం ఎడమోహంపెడమోహంగానే ఉంటున్నారు. అప్పట్లో ఇది హాట్‌ టాపిక్‌గా మారింది. ఇలాంటి తరుణంలో పూజా ప్రభాస్‌తో సినిమా చేస్తాననడం, ఆ విషయాన్ని తనే నేరుగా డార్లింగ్‌ని అడుగుతానడం అందరి సర్‌ప్రైజ్‌ చేస్తోంది. పూజా తాజా కామెంట్స్‌ చూస్తుంటే వీరిమధ్య గొడవలు సద్దుమనిగినట్టు అనిపిస్తోంది. అలాగే తెలుగు డైరెక్టర్స్‌ మళ్లీ వర్క్‌ చేయడంపై స్పందిస్తూ ఆసకస్తికర కామెంట్స్‌ చేసింది. నేను డైరెక్టర్స్‌తో మాట్లాడి వారి సమయం అడుగుతాను. దీనికి ఎవరు స్పందిస్తే వారిని కలుస్తాను. ఏదోకరోజు పరిస్థితులు మారోచ్చు.. అప్పుడు ఏ దర్శకుడితో పని చేయాలనేది నేను ఎంపిక చేసుకుంటారు. అలాంటి రోజు త్వరలోనే రావాలని ఆశిస్తున్నా‘ అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం పూజ హెగ్డే కామెంట్స్‌ ఇండస్ట్రీలో హాట్‌ టాపిక్‌ గా మారాయి.

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×