E-Paper
Advertisement

రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమా టికెట్ రేట్లు పెంపునకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్..

రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమా టికెట్ రేట్లు పెంపునకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్..
Advertisement

Peddi Ticket Prices: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులకు సినీ ప్రియులకు అదిరిపోయే అప్‌డేట్ వచ్చేసింది. సుకుమార్ రైటింగ్స్ భాగస్వామ్యంతో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన భారీ బడ్జెట్ చిత్రం ‘పెద్ది’ (PEDDI). జూన్ 4న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతున్న నేపథ్యంలో, చిత్ర యూనిట్‌కు తెలంగాణ ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది. సినిమా టికెట్ ధరల పెంపుతో పాటు, స్పెషల్ షోలు వేసుకోవడానికి ప్రభుత్వం అధికారికంగా అనుమతులు మంజూరు చేస్తూ జీవో జారీ చేసింది. మైత్రి మూవీ మేకర్స్ పెట్టుకున్న దరఖాస్తును పరిశీలించిన హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శిఖా గోయల్ ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చారు.

Read also-Brahmamudi Serial Today Episode June 3rd ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రేఖకు షాక్ ఇచ్చిన రాజు  

జూన్ 3నే స్పెషల్ షో..

Advertisement

ఈ ఉత్తర్వుల ప్రకారం, సినిమా విడుదల కంటే ఒక రోజు ముందే, అంటే జూన్ 3 (బుధవారం) రాత్రి 8:00 గంటలకు తెలంగాణ వ్యాప్తంగా ప్రత్యేక ప్రదర్శన వేసుకోవడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ రాత్రి స్పెషల్ షోకు సంబంధించిన టికెట్ ధరను GSTతో కలిపి రూ. 600/- గా నిర్ణయించారు.

10 రోజుల పాటు పెరిగిన టికెట్ రేట్లు

ఇక జూన్ 4న సినిమా విడుదలైనప్పటి నుండి మొదటి 10 రోజుల పాటు (జూన్ 13 వరకు) ప్రతిరోజూ గరిష్టంగా 5 షోలు ప్రదర్శించుకునేందుకు అనుమతి లభించింది. ఈ 10 రోజుల్లో టికెట్ ధరల పెంపు ఇలా ఉండనుంది:

Advertisement

సింగిల్ స్క్రీన్స్: సాధారణ ధర కంటే అదనంగా రూ. 100/- పెంచుకోవచ్చు (GSTతో కలిపి).

మల్టీప్లెక్స్‌లు: సాధారణ ధర కంటే అదనంగా రూ. 125/- పెంచుకోవచ్చు (GSTతో కలిపి).

సినీ కార్మికుల సంక్షేమానికి 20% విరాళం

ఈ జీవోలో ప్రభుత్వం ఒక కీలకమైన నిబంధనను పెట్టింది. టికెట్ రేట్ల పెంపు ద్వారా వచ్చే అదనపు ఆదాయంలో 20 శాతం మొత్తాన్ని తప్పనిసరిగా “తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ వెల్ఫేర్ అసోసియేషన్” ఖాతాకు బదిలీ చేయాలని ఆదేశించింది. చలనచిత్ర పరిశ్రమలోని కార్మికులను ఆదుకునేందుకు, వారి సంక్షేమం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. దీని పర్యవేక్షణ బాధ్యతలను ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (FDC) చూసుకోనుంది.

Read also-Illu illaalu Pillalu Sukanya : ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు ‘ సుకన్య జీవితంలో కష్టాలు.. కన్నీళ్లు పెట్టించే స్టోరీ..

థియేటర్లలో సామాజిక అవగాహన ప్రకటనలు

దీంతో పాటు, సమాజంలో పెరుగుతున్న డ్రగ్స్, నార్కోటిక్స్ వినియోగం మరియు సైబర్ నేరాల పట్ల ప్రజల్లో అవగాహన పెంచేందుకు, థియేటర్ల యాజమాన్యాలు సినిమా ప్రదర్శనకు ముందు వీటికి సంబంధించిన హెచ్చరిక ప్రకటనలను తప్పనిసరిగా స్క్రీన్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ నిబంధనలన్నీ థియేటర్లు కచ్చితంగా పాటిస్తున్నాయో లేదో పర్యవేక్షించాల్సిందిగా జిల్లా కలెక్టర్లను, పోలీస్ కమీషనర్లను ప్రభుత్వం ఆదేశించింది. ప్రభుత్వం ఇచ్చిన ఈ బూస్ట్‌తో తెలంగాణలో ‘పెద్ది’ జాతర ఒక రోజు ముందే ప్రారంభం కానుంది. అడ్వాన్స్ బుకింగ్స్‌లో ఈ సినిమా సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×