E-Paper
Advertisement

బాబాయ్ రికార్డులకు ఎసరు పెట్టిన అబ్బాయ్.. ప్రీమియర్ ‘షో’ చూపించేశాడు!

బాబాయ్ రికార్డులకు ఎసరు పెట్టిన అబ్బాయ్.. ప్రీమియర్ ‘షో’ చూపించేశాడు!
Advertisement

Peddi Premier Record: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వచ్చిన మోస్ట్ అవేటెడ్ మూవీ ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద మునుపెన్నడూ లేని విధంగా మాస్ విధ్వంసం సృష్టిస్తోంది. రిలీజ్‌కు ముందే భారీ అంచనాలు క్రియేట్ చేసిన ఈ చిత్రం, ఇప్పుడు ప్రీమియర్ షోల కలెక్షన్లతోనే టాలీవుడ్ సరికొత్త చరిత్ర లిఖించింది. కేవలం ప్రీమియర్ షోల ద్వారానే ఈ సినిమా ఏకంగా రూ. 21.87 కోట్ల గ్రాస్ వసూలు చేసి, ఆల్-టైమ్ హైయెస్ట్ ప్రీమియర్ గ్రాసర్‌గా రికార్డుల రారాజుగా నిలిచింది.

Read also-మెగాస్టార్‌ను మించిపోయిన రామ్ చరణ్.. అంతగా ‘పెద్ది’తో ఏం చేశాడంటే?

Advertisement

ఈ దెబ్బతో ఇప్పటివరకు టాలీవుడ్‌లో అత్యధిక ప్రీమియర్ షో కలెక్షన్లు సాధించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘OG’ (రూ. 20.79 కోట్లు) రికార్డును రామ్ చరణ్ బద్దలు కొట్టాడు. బాబాయ్ పేరిట ఉన్న ఆల్-టైమ్ రికార్డును అబ్బాయి క్లీన్ స్వీప్ చేయడంతో మెగా అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ప్రస్తుతం టాలీవుడ్ టాప్ ప్రీమియర్ గ్రాసర్స్ లిస్ట్‌లో ‘పెద్ది’ మొదటి స్థానంలో నిలవగా.. ఆ తర్వాత వరుసగా OG (రూ. 20.79 కోట్లు), పుష్ప 2 (రూ. 14.55 కోట్లు), హరిహర వీరమల్లు (రూ. 11.45 కోట్లు), ది రాజా సాబ్ (రూ. 10.78 కోట్లు) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

Read also-Podarillu Today Episode : అడ్డంగా బుక్కయిన ప్రతాప్.. మాధవ్ దెబ్బకు మైండ్ బ్లాక్.. అన్నదమ్ముల సీన్ హైలెట్..

Advertisement

ఈ చిత్రంలో రామ్ చరణ్ ఊరమాస్ పర్ఫార్మెన్స్, బుచ్చిబాబు ఎమోషనల్ టేకింగ్‌కు ఆడియన్స్ ఫిదా అయిపోతున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలతో పాటు ఓవర్సీస్‌లోనూ ‘పెద్ది’ సునామీ సృష్టిస్తుండటంతో, మొదటి రోజే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా వంద కోట్ల క్లబ్‌లో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత రామ్ చరణ్ బాక్సాఫీస్ స్టామినాను ఈ కలెక్షన్లు మరోసారి నిరూపించాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి పాజిటివ్ టాక్ రావడంతో బుకింగ్స్ జోరుగా సాగుతున్నాయి. రానున్న రోజుల్లో ఇంకెన్ని రికార్డులు బద్దలు గొడుతుందో చూడాలి మరి.

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×