E-Paper
Advertisement

పెద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముహూర్తం ఫిక్స్.. వేదిక, ముఖ్య అతిథులు వీరే!

పెద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముహూర్తం ఫిక్స్.. వేదిక, ముఖ్య అతిథులు వీరే!
Advertisement

Peddi Movie:ఉప్పెన సినిమాతో ఓవర్ నైట్ లోనే డైరెక్టర్ గా సత్తా చాటిన యువ దర్శకుడు బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న చిత్రం పెద్ది. గ్రామీణ స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. సుకుమార్ రైటింగ్స్, వృద్ధి సినిమాస్, మైత్రి మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం మొదట జూన్ 25వ తేదీన విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించినప్పటికీ.. జూన్ 4వ తేదీకి ప్రీ పోన్ చేస్తూ ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.

పెద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముహూర్తం ఫిక్స్..

ఈ మేరకు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఎప్పుడు నిర్వహిస్తారు?ఎక్కడ నిర్వహిస్తారు? ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎవరు రాబోతున్నారు ?ఇలా పలు విషయాలు సోషల్ మీడియాలో చర్చకు దారితీసాయి. ఇకపోతే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. పెద్ది సినిమా విలేజ్ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతుండడంతో అదే థీమ్ కి తగ్గట్టుగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Advertisement

ముఖ్యంగా గ్రామీణ క్రీడల ఎలిమెంట్స్ ను స్టేజ్ డిజైన్ లో ప్రతిబింబించేలా అభిమానులకు ఒక ప్రత్యేకమైన అనుభూతిని కలిగించేలా ఈ ఈవెంట్ ను నిర్వహిస్తారని సమాచారం. ఇకపోతే జూన్ 2వ తేదీన హైదరాబాదులోని ఎల్బీ స్టేడియం వేదికగా ఈ భారీ ఈవెంట్ ను నిర్వహించడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ముఖ్యంగా రామ్ చరణ్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి భారీ సంఖ్యలో అభిమానులు హాజరవుతారన్న అంచనాల నేపథ్యంలోనే ఎల్బీ స్టేడియం అయితే పర్ఫెక్ట్ గా సెట్ అవుతుందని ఈ వేదికను ఫిక్స్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇక త్వరలోనే దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇవ్వనున్నట్లు సమాచారం.

ముఖ్య అతిథులు వీరే..

ఇదిలా ఉండగా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవితో పాటు ఆంధ్రప్రదేశ్ డీసీఎం పవన్ కళ్యాణ్ కూడా ముఖ్య అతిథులుగా రాబోతున్నట్లు తెలుస్తోంది . ఒకవేళ ఇదే నిజమైతే ఎల్బీ స్టేడియం మెగా అభిమానుల సంబరాలతో అంబరాన్ని అంటనుంది అని చెప్పవచ్చు.

Advertisement

also read:‘పెద్ది’ ప్రాంతాలవారీగా డిస్ట్రిబ్యూటర్స్ లిస్ట్.. ఎక్కడ ఎవరి చేతుల్లోకంటే?

రామ్ చరణ్ సినిమాలు..

ఇక రామ్ చరణ్ సినిమాల విషయానికొస్తే.. పెద్ది సినిమా పూర్తి అయిన వెంటనే సుకుమార్ దర్శకత్వంలో తన తదుపరి సినిమా షూటింగ్ ప్రారంభించనున్నారు. ఏదేమైనా రామ్ చరణ్ ఇప్పుడు ఆచితూచి అడుగులు వేస్తూ అద్భుతమైన కథలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తోంది . ఇక పెద్దితో గనుక ఆయన రికార్డులు సృష్టించారు అంటే మళ్ళీ రామ్ చరణ్ గట్టి కం బ్యాక్ ఇచ్చినట్లే అని చెప్పవచ్చు.

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×