E-Paper
Advertisement

పెద్ది ఈవెంట్ ..స్టేజ్ పైనే క్షమాపణలు కోరిన బుచ్చిబాబు… ఆశీర్వదించండి అంటూ!

పెద్ది ఈవెంట్ ..స్టేజ్ పైనే క్షమాపణలు కోరిన బుచ్చిబాబు… ఆశీర్వదించండి అంటూ!
Advertisement

Bucchi Babu: బుచ్చిబాబు ఉప్పెన సినిమా ద్వారా ఇండస్ట్రీకి దర్శకుడిగా పరిచయమైన మొదటి సినిమాతోనే ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుని తన రెండో సినిమానే మెగా హీరో రామ్ చరణ్ (Ramcharan)తో చేసే అవకాశాన్ని అందుకున్నారు. ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా పెద్ది సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది. ఈ సినిమా షూటింగ్ పనులన్నీ కూడా పూర్తి అయ్యాయి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఇకపోతే తాజాగా చిత్ర బృందం పెద్ది రిలీజ్ డేట్ ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ సినిమా విడుదల తేదీని అధికారకంగా ప్రకటించిన సంగతి తెలిసిందే.

జూన్ 4న రాబోతున్న పెద్ది..

నిజానికి పెద్ది సినిమా మార్చి 27వ తేదీ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల కావాల్సి ఉండగా షూటింగ్ పూర్తికాని నేపథ్యంలో వాయిదా పడుతోంది. మార్చ్ 27 నుంచి ఏప్రిల్ 30 తేదీ ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది. అయితే ఏప్రిల్ 30 తేదీ నాటికి కూడా షూటింగ్ పూర్తికాని నేపథ్యంలో మరోసారి వాయిదా వేయడం వల్ల అభిమానులు ఎంతో నిరుత్సాహం వ్యక్తం చేశారు. ఇక తాజాగా చిత్ర బృందం జూన్ 4వ తేదీ పెద్ది విడుదల కాబోతుందని తెలియజేస్తూ ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ కార్యక్రమంలో భాగంగా చిత్ర బృందంతో పాటు డైరెక్టర్ సుకుమార్(Sukumar)కూడా హాజరయ్యారు.

ఏప్రిల్ 30న విడుదల కానందుకు క్షమించండి..

Advertisement

ఈ ప్రెస్ మీట్ కార్యక్రమంలో భాగంగా దర్శకుడు బుచ్చిబాబు వేదికపై మాట్లాడుతూ అభిమానులకు ప్రేక్షకులకు క్షమాపణలు కోరారు. పెద్ది సినిమా ఏప్రిల్ 30వ తేదీ విడుదలవుతుందని అందరూ భావించారు కానీ ఏప్రిల్ 30న వాయిదా పడినందుకు క్షమించండి అలాగే జూన్ 4వ తేదీ విడుదల కాబోతున్నందుకు ఆశీర్వదించండి అంటూ వేదిక పైనుంచి క్షమాపణలు కోరారు. ఇక పెద్ది సినిమా గురించి మాట్లాడుతూ ఈ సినిమా చాలా కమర్షియల్ ఎమోషనల్ సినిమా. పెద్దిగాడు మీ అందరి హృదయాలకు చాలా దగ్గరగా ఉంటారు.

పెద్దిగాన్ని తీసేయడం అంత ఈజీ కాదు..

Advertisement

ఈ సినిమా చూసిన తర్వాత పెద్దిగాన్ని మీ హృదయం నుంచి తీసేయడం అంత ఈజీ కాదు. జూన్ 4వ తేదీన నా ప్రేమ అంత చరణ్ సార్ గారిలో చూస్తారు. నాకు ఇలాంటి గొప్ప అవకాశం ఇచ్చిన చరణ్ సార్ కి చాలా థాంక్స్ అంటూ ఈ సందర్భంగా బుచ్చిబాబు పెద్ది సినిమా గురించి మాట్లాడుతూ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ సినిమా పట్ల మంచి అంచనాలను పెంచేశాయి. కచ్చితంగా చరణ్ ఈ సినిమాతో ఇండస్ట్రీ హిట్ అందుకోబోతున్నారని అభిమానులు కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి జూన్ 4 న రాబోతున్న పెద్ది ఎలాంటి ప్రభంజనాన్ని సృష్టించబోతున్నారనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ జోడిగా జాన్వి కపూర్ హీరోయిన్గా నటించగా ఇందులో శివరాజ్ కుమార్, జగపతిబాబు వంటి తదితరులు కీలకపాత్రలలో నటిస్తున్నారు స్పెషల్ సాంగ్ లో శృతిహాసన్ నటించిన సంగతి తెలిసిందే.

Also Read: రామ్ చరణ్ కు జీవితాంతం రుణపడి ఉంటా.. ఎమోషనల్ అయిన పెద్ది ప్రొడ్యూసర్!

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×