E-Paper
Advertisement

Peddi Song : చికిరి రేంజ్ దాటిపోయింది, ఫస్ట్ బాలే సిక్స్ కొట్టిన చరణ్

Peddi Song : చికిరి రేంజ్ దాటిపోయింది, ఫస్ట్ బాలే సిక్స్ కొట్టిన చరణ్
Advertisement

Peddi Song : బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తున్న సినిమా పెద్ది. ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో రామ్ చరణ్ మొదటి సారి ఉత్తరాంధ్ర యాసలో మాట్లాడనున్నాడు. ఇదివరకే సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ షాట్ వీడియో విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన జాన్వి కపూర్ హీరోయిన్ నటిస్తోంది.

ఈ సినిమాను మార్చి 27వ తారీఖున విడుదల చేయబోతున్నట్లు అప్పట్లో అధికారికంగా ప్రకటించారు. కానీ చెప్పిన డేట్ కంటే ముందుగా ఒక రోజే ఈ సినిమాను ప్రేక్షకులు ముందుకు తీసుకొస్తున్నారు. మార్చ్ 27వ తారీఖున రామ్ చరణ్ పుట్టినరోజు అని ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. బుచ్చిబాబు ఈ సినిమాని చాలా పగడ్బందీగా ప్లాన్ చేస్తున్నారు.

చికిరి రేంజ్ దాటిపోయింది 

Advertisement

ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని చాలామంది ఎదురు చేశారు. మొత్తానికి చికరి అనే ఫస్ట్ సాంగ్ ఈ సినిమా నుంచి విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పాటను విడుదల చేయడానికి అంటే ముందు బుచ్చిబాబు ఏఆర్ రెహమాన్ కి చెప్పే వీడియో కూడా బాగా పాపులర్ అయింది.

మొత్తానికి చికిరి పాట చాలామందిని విపరీతంగా ఆకట్టుకుంది. ఈ పాటను జానీ మాస్టర్ కంపోజ్ చేశారు. ఈ పాటకి సంబంధించి స్టెప్స్ కూడా బాగా వైరల్ అయ్యాయి. అతనికి ఈ పాట 90 మిలియన్ వ్యూస్ పైగా సాధించుకుంది. అలానే వన్ మిలియన్ లైక్స్ కూడా ఈ పాటకు వచ్చాయి. దీనిని బట్టి పాట ఎంత హిట్ అయింది అని ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. మొదటి పాటకి ఈ రేంజ్ రెస్పాన్స్ వచ్చింది అంటే ముందు ముందు పాటలు ఎలా ఉండబోతున్నాయో కూడా అర్థమవుతుంది.

Advertisement

సినిమాపై అంచనాలు

ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి. మరోవైపు పాట కూడా పాపులర్ అవడంతో అంచనాలు ఇంకా పెరుగుతున్నాయి. బుచ్చిబాబు కాంప్రమైజ్ లేకుండా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. చూడటానికి సైలెంట్ గా కనిపించినా కూడా తన అనుకున్న కథను చాలా పకడ్బందీగా ప్లాన్ చేస్తూ ఉంటాడు.

కథ విషయంలో అసలు రాజీపడడు. సొంత గురువు సుకుమార్ చెప్పినా కూడా కథను మార్చడు. ఈ విషయాన్ని స్వయంగా బుచ్చిబాబు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఇక ఈ సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుందో అనే క్యూరియాసిటీ చాలామందికి ఉంది. అతనికి ఫస్ట్ సాంగ్ సిక్స్.

Also Read: Andhra King Taluka: నాపైన ఆ అభిమాని పుస్తకం రాశాడు, పదేళ్లు నాతో మాట్లాడలేదు

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×