E-Paper
Advertisement

Peddi Movie: పెద్ది వాయిదా రూమర్లకు చెక్…ఒక్క పోస్టర్ తో క్లారిటీ!

Peddi Movie: పెద్ది వాయిదా రూమర్లకు చెక్…ఒక్క పోస్టర్ తో క్లారిటీ!
Advertisement

Peddi Movie: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan)హీరోగా బుచ్చిబాబు(Bucchi Babu) డైరెక్షన్లో నటిస్తున్న చిత్రం పెద్ది(Peddi). ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ పనులను జరుపుకుంటుంది. గ్రామీణ క్రీడా నేపథ్యంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ సినిమా పట్ల మంచి అంచనాలను పెంచేసాయి. ఈ సినిమా ద్వారా చరణ్ పాన్ ఇండియా స్థాయిలో సక్సెస్ అందుకోబోతున్నారని అభిమానులు కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు.. ఇదిలా ఉండగా ఈ సినిమా విడుదల విషయంలో ఎన్నో రకాల వార్తలు బయటకు వస్తున్నాయి.

విఎఫ్ ఎక్స్ పనులు పెండింగ్ ?

ఈ సినిమాని మార్చి 27వ తేదీ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం పలు సందర్భాలలో వెల్లడించారు. అయితే ఈ సినిమా అనుకున్న సమయానికి విడుదల కాదని వాయిదా పడుతుంది అంటూ వార్తలు బయటకు వస్తున్నాయి. ఈ సినిమా మార్చి నుంచి వాయిదా పడుతూ 2026 డిసెంబర్లో విడుదలవుతుందని ఇటీవల వార్తలు చక్కర్లు కొట్టాయి. ఇంకా విఎఫ్ ఎక్స్ పనులు పూర్తికాని నేపథ్యంలో బుచ్చిబాబు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ గా మారడంతో అభిమానులు నిరాశ వ్యక్తం చేశారు.

మార్చి 27న పెద్ది రిలీజ్…

Advertisement

ఇలా ఈ సినిమా వాయిదా పడుతుందంటూ వార్తలు వచ్చినా, చిత్ర బృందం ఎక్కడ కూడా ఈ వార్తలను ఖండించలేదు. దీంతో ఈ వార్తలు నిజమేనని అందరూ భావించారు. తాజాగా పెద్ది టీం, ఒక పోస్టర్ ద్వారా ఈ రూమర్లకు పూర్తిగా చెక్ పెట్టేశారు. నేడు ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ పుట్టినరోజు కావడంతో ఈయనకు సంబంధించిన పోస్టర్ ను చిత్ర బృందం విడుదల చేస్తూ ఈయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే ఈ సినిమా 27 మార్చి 2026న విడుదల కాబోతుందని ఈ పోస్టర్ ద్వారా మరోసారి క్లారిటీ ఇచ్చారు. దీంతో ఈ సినిమా వాయిదా పడుతుందంటూ వస్తున్న వార్తలకు పూర్తిగా చెక్ పెట్టినట్టు అయింది.

Advertisement

ఇక మార్చి నెలలో పెద్ద ఎత్తున సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్ సినిమా కంటే ఒక్కరోజు ముందుగా మార్చి 26వ తేదీ నాని హీరోగా నటించిన ది ప్యారడైజ్ సినిమా విడుదల కాబోతోంది . ఇక ఈ నెలలోనే యష్ టాక్సిక్, అడివి శేష్ డెకాయిట్ వంటి సినిమాలు కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో బాక్సాఫీస్ వద్ద గట్టి పోటీ ఉండబోతుందని తెలుస్తుంది. ఇక రామ్ చరణ్ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా నుంచి ఇటీవల విడుదల చేసిన ఫస్ట్ సింగిల్ సూపర్ సక్సెస్ కావడంతో మేకర్స్ త్వరలోనే సెకండ్ సింగిల్ విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ కి జోడిగా జాన్వీ కపూర్ నటిస్తున్న సంగతి తెలిసిందే.

Also Read: MSVPG Film: మన శంకర వరప్రసాద్ గారు టికెట్ల రేట్లపై బిగ్ రిలీఫ్..

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×