E-Paper
Advertisement

Peddi: పెద్ది సెకండ్ సింగిల్ అప్డేట్.. ఆ స్పెషల్ రోజే విడుదల!

Peddi: పెద్ది సెకండ్ సింగిల్ అప్డేట్.. ఆ స్పెషల్ రోజే విడుదల!
Advertisement

Peddi: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) ప్రస్తుతం ‘ఉప్పెన’ సినిమాతో సక్సెస్ అందుకున్న డైరెక్టర్ బుచ్చిబాబు సనా(Bucchibabu Sana) దర్శకత్వంలో రూరల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన ‘చికిరి చికిరి’ సాంగ్ ఇప్పటికీ యూట్యూబ్ లో వందల మిలియన్ల వ్యూస్ తో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. అటు ఆస్కార్ గ్రహీత ఏఆర్ రెహమాన్ అందించిన మ్యూజిక్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకోవడంతో.. ప్రస్తుతం అందరి దృష్టి రెండవ సింగిల్ పై పడింది. నిజానికి గత ఏడాది డిసెంబర్ ఆఖరున ఈ పాటను రిలీజ్ చేయాలనుకున్నారు కానీ పెద్ద హీరోల చిత్రాలు ఉండడంతో ఆగిపోయారు. దీనికి తోడు సంక్రాంతికైనా ఈ పాటను రిలీజ్ చేస్తారని అనుకున్నారు. కానీ కొన్ని కారణాలవల్ల అదీ జరగలేదు. అయితే ఇప్పుడు ఏకంగా లవర్స్ డే సందర్భంగా ఈ పాటను రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం.

పెద్ది నుండి సెకండ్ సింగిల్ డేట్ లాక్..

ఇక్కడ మరో విశేషం ఏమిటంటే.. ప్రేమికుల రోజు అలాగే డైరెక్టర్ బుచ్చిబాబు సనా పుట్టినరోజు కూడా ఆ రోజే కావడంతో ఈ పాటను ఫిబ్రవరి 14న రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. పైగా ఇది ఒక పవర్ఫుల్ మాస్ నెంబర్ అని , రామ్ చరణ్ ఇంట్రడక్షన్ సాంగ్ గా ఉండబోతుందని సమాచారం. ప్రేమికుల రోజున పక్కాగా ఇది లవ్ సాంగ్ కాకుండా మాస్ సాంగ్ ను రిలీజ్ చేయబోతున్నారు. ఇకపోతే ఆస్కార్ విజేత ఏ.ఆర్. రెహమాన్ (AR Rahman).ఈ చిత్రానికి సంగీతం అందిస్తూ ఉండగా.. బుచ్చిబాబు చేస్తున్న సినిమా కావడంతో అటు పాటల విషయంలో కూడా మేకర్స్ ఎక్కడా కాంప్రమైజ్ కావడం లేదనే వార్తలు వ్యక్తమవుతున్నాయి. ఇక జానీ మాస్టర్ కొరియోగ్రఫీలో రామ్ చరణ్ వేసే స్టెప్పులు ఈ పాటలో మరింత ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నాయట.ఇక బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఇందులో హీరోయిన్గా నటిస్తున్న విషయం తెలిసిందే. కన్నడ స్టార్ శివ రాజ్ కుమార్ తో పాటు జగపతిబాబు కీలకపాత్రలు పోషిస్తున్నారు.

అందుకే విడుదల తేదీ వాయిదా..

Advertisement

ఇక ఈ సినిమా విడుదల తేదీ విషయానికొస్తే.. మొదట రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా మార్చి 27న రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన టికెట్ రేట్ ఆదేశాల మేరకు ఏప్రిల్ 30వ తేదీకి వాయిదా వేశారు. అలా 2026 ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఇక విడుదలకు ఇంకా రెండు నెలలకు పైగా సమయం ఉన్న నేపథ్యంలో ఇలా సినిమా నుండి వరుస అప్డేట్లు వదులుతూ సినిమాపై అంచనాలు పెంచి, భారీ బ్లాక్ బస్టర్ అందుకోవాలని చూస్తున్నారు నిర్మాతలు. రామ్ చరణ్ కూడా ఈ సినిమాతో మంచి సక్సెస్ అందుకోవాలని గట్టి ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే.

ALSO READ:Vijay -Rashmika: హైదరాబాదులోనే విజయ్ – రష్మిక రిసెప్షన్.. డేట్ కూడా ఫిక్స్!

రెండు భాగాలుగా రామ్ చరణ్ – సుకుమార్ మూవీ?

Advertisement

రామ్ చరణ్ తదుపరి సినిమాల విషయానికొస్తే.. గతంలో సుకుమార్ తో ‘ రంగస్థలం’ సినిమా చేసి మంచి విజయాన్ని అందుకున్న రామ్ చరణ్.. ఇప్పుడు మళ్లీ అదే డైరెక్టర్ తో సినిమా చేస్తున్నారు. పైగా ఈ సినిమాను రెండు భాగాలుగా తీసుకురావాలని సుకుమార్ ప్లాన్ చేస్తున్నారట. అంతేకాదు గతంలో రంగస్థలం సినిమా నుండీ అనుపమను తప్పించడంతో ఇప్పుడు మళ్లీ ఆమెను తీసుకోబోతున్నట్లు సమాచారం. ఇక దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది.

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×