E-Paper
Advertisement

Jagapathi Babu: పెద్ది సినిమాలో మరో స్టార్.. అప్పల సూరిగా జగ్గు భాయ్

Jagapathi Babu: పెద్ది సినిమాలో మరో స్టార్.. అప్పల సూరిగా జగ్గు భాయ్
Advertisement

Jagapathi Babu: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ramcharan)హీరోగా బుచ్చిబాబు సాన దర్శకత్వంలో నటిస్తున్న తాజా చిత్రం పెద్ది(Peddi). పాన్ ఇండియా స్థాయిలో అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ప్రస్తుతం షూటింగ్ పనులను శర వేగంగా జరుపుకుంటున్నారు. ఇటీవలే ఢిల్లీ షెడ్యూల్ చిత్రీకరణ పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాని 2026 మార్చి 27వ తేదీ విడుదల చేయటానికి చిత్ర బృందం ఏర్పాట్లు చేస్తున్నారు అందుకు అనుకూలంగానే షూటింగ్ పనులను కూడా వేగవంతం చేస్తున్నారు.

అప్పలసూరిగా జగపతిబాబు..

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ సినిమా పట్ల మంచి అంచనాలను పెంచేసాయి. తాజాగా చిత్ర బృందం ఈ సినిమాలో మరొక పాత్రను పరిచయం చేస్తూ విడుదల చేసిన అప్డేట్ సినిమా పట్ల మంచి అంచనాలను పెంచేసింది. ఈ సినిమాలో అప్పల సూరి అనే పాత్రలో సీనియర్ నటుడు జగపతిబాబు సందడి చేయబోతున్నారు. తాజాగా ఈయన పాత్రను పరిచయం చేస్తూ చిత్రబృందం అధికారకంగా పోస్టర్ విడుదల చేశారు అయితే ఈ పోస్టర్ లో జగపతిబాబు గుర్తుపట్టలేని విధంగా ఉన్నారని చెప్పాలి. పెద్ది సినిమాలో అప్పల సూరి పాత్రలో జగపతిబాబు విభిన్నంగా కనిపించబోతున్నారని స్పష్టమవుతుంది.

గ్రామీణ క్రీడా నేపథ్యంలో..

Advertisement

ప్రస్తుతం జగపతిబాబుకు సంబంధించిన ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో సినిమా పట్ల మరిన్ని అంచనాలు పెరిగిపోయాయి. ఇదివరకు రామ్ చరణ్ జగపతిబాబు కాంబినేషన్లో వచ్చిన సినిమాలన్నీ కూడా మంచి సక్సెస్ అందుకున్న నేపథ్యంలో పెద్ది సినిమా విషయంలో కూడా అభిమానులు సంతోషంగా ఉన్నారు. ఇక ఈ సినిమాలో ఒక్కొక్కరి పాత్రను పరిచయం చేస్తూ బుచ్చిబాబు సినిమా పట్ల మంచి అంచనాలను పెంచేశారు. ఈ సినిమా గ్రామీణ క్రీడ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే.

Advertisement

ఈ సినిమా కథ మొత్తం క్రికెట్ నేపథ్యంలోనే ఉండబోతుంది. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ కు జోడిగా జాన్వీ కపూర్(Janhvi Kapoor) హీరోయిన్ గా నటించబోతున్న సంగతి తెలిసిందే. ఈమె క్రికెట్ కామెంటేటర్ గా కనిపించబోతున్నారు. ఇదివరకే జాన్వీకి సంబంధించిన ఫస్ట్ లుక్ కూడా విడుదల చేయగా పల్లెటూరి అమ్మాయి పాత్రలో జాన్వి లుక్ కూడా అందరిని ఆకట్టుకుంది. ఇక ఈ సినిమా నుంచి ఇదివరకు “చికిరి చికిరి” అనే పాటను విడుదల చేయగా ఈ పాట ఎంతో మంచి అంచనాలను సొంతం చేసుకుంది. ఇక త్వరలోనే ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్ విడుదల చేయబోతున్నారు. ఈ సినిమా విడుదల విషయంలో ఎలాంటి మార్పులు లేకుండా అనుకున్న విధంగానే మార్చి 27వ తేదీ విడుదల కాబోతున్నట్లు ఇటీవల చిత్ర బృందం తెలియజేశారు.

Also Read: The Raja Saab 2.o Trailer: మన టైం స్టార్ట్ అయింది.. మరో ట్రైలర్ రిలీజ్ చేసిన రాజా సాబ్!

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×