E-Paper
Advertisement

Jalsa4K : పవన్ కళ్యాణ్ అభిమానులకు డిసెంబర్ డబుల్ ట్రీట్, సంజయ్ సాహు వస్తున్నాడు

Jalsa4K : పవన్ కళ్యాణ్ అభిమానులకు డిసెంబర్ డబుల్ ట్రీట్, సంజయ్ సాహు వస్తున్నాడు
Advertisement

Jalsa4K : పవన్ కళ్యాణ్ నటించిన ఓ జి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన సక్సెస్ సాధించింది. పవన్ కెరియర్ లోనే హైయెస్ట్ కలెక్షన్స్ ఆ సినిమా సాధించుకుంది. ఆ సినిమాతో కొంతమేరకు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఖుషి అయిపోయారు. ఇప్పుడు వాళ్ళ కళ్లన్నీ కూడా హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మీద ఉన్నాయి. ఇటీవలే ఆ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ప్రోమో విడుదలైంది. ఫుల్ సాంగ్ డిసెంబర్ 13న విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే.

ప్రోమో వీడియో చూస్తేనే చాలామందికి ఫుల్ మీల్స్ లా అనిపించింది. అందుకే ఇంకా ఫుల్ సాంగ్ ఎలా ఉండబోతుందో అనే క్యూరియాసిటీ చాలామందికి మొదలైంది. ముఖ్యంగా చాలా రోజులు తర్వాత దేవిశ్రీప్రసాద్ పవన్ కళ్యాణ్ సాంగ్ మాత్రం ఇన్స్టెంట్ గా ఎక్కింది. ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ కి దేవిశ్రీప్రసాద్ చేసిన సినిమాలన్నీ కూడా బ్లాక్ బస్టర్ సాంగ్స్ ఇచ్చాడు. జల్సా సాంగ్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఇకపోతే జల్సా సినిమా కూడా మరోసారి విడుదల చేయడానికి సిద్ధం చేస్తున్నారు.

సంజయ్ సాహు వస్తున్నాడు 

Advertisement

పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా జల్సా సినిమాను సెప్టెంబర్ రెండున విడుదల చేయడానికి ప్లాన్ చేశారు. చాలామంది పవన్ కళ్యాణ్ అభిమానులు సెప్టెంబర్ రెండవ తారీఖున జల్సా సినిమా వస్తుంది ఆ తర్వాత 25న ఓజీ సినిమా వస్తుంది డబుల్ ట్రీట్ అని ఫీల్ అయ్యారు. ఆ తరుణంలో అల్లు అర్జున్ నాయనమ్మ చనిపోవడం వలన ఆ సినిమా పోస్ట్ పోన్ అయిపోయింది.

ఇక ప్రస్తుతం జల్సా సినిమాను డిసెంబర్ 31న విడుదల చేయబోతున్నట్లు తెలుస్తుంది. అయితే దీని గురించి అధికారక ప్రకటన కూడా త్వరలో ఇవ్వనున్నారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ చేస్తున్న సినిమా నుండి ఫుల్ సాంగ్ తో పాటు పవన్ కళ్యాణ్ జల్సా సినిమా కూడా వస్తుండటం అభిమానులకు డబుల్ ట్రీట్ అని చెప్పొచ్చు.

కల్ట్ బ్లాక్ బస్టర్ 

Advertisement

ఆ సినిమాకి అప్పట్లో ఊహించిన రేంజ్ రెస్పాన్స్ రాలేదు కానీ మంచి కలెక్షన్స్ మాత్రం వచ్చాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే ఇప్పటికీ చూస్తుంటే ఆ సినిమా చాలా అద్భుతంగా అనిపిస్తుంది పవన్ కళ్యాణ్ కోసం త్రివిక్రమ్ డిజైన్ చేసిన ఆ క్యారెక్టట్రైజేషన్ డిఫరెంట్ గా ఉంటుంది.

పవన్ కళ్యాణ్ తన కెరీర్ లో ఎన్ని పాత్రలు చేసినా కూడా సంజయ్ సాహు అనే పాత్ర కూడా ప్రత్యేకంగా మిగిలిపోతుంది. ముఖ్యంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆ సినిమాలో రాసిన డైలాగ్స్ అద్భుతంగా ఉంటాయి. దేవిశ్రీ మ్యూజిక్ ఆ సినిమా మీద విపరీతమైన హైప్ అప్పట్లోనే క్రియేట్ చేసింది. ఆల్బమ్ అంతా బ్లాక్ బస్టర్ సక్సెస్ అవడం అనేది ఈ సినిమాకి కూడా జరిగింది.

Also Read: Akhanda 2 : రూమర్లు నమ్మకండి తాండవం ఎంజాయ్ చేయండి, రంగంలోకి నిర్మాతలు

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×