// // Ustaad Bhagat OTT: ఉస్తాద్ భగత్ ఓటీటీ డీల్ క్లోజ్ - Staging.BigTvLive -->
E-Paper
Advertisement

Ustaad Bhagat OTT: భారీ ధరలకు ఉస్తాద్ భగత్ ఓటీటీ డీల్ క్లోజ్ …నెట్ ఫ్లిక్స్ చేతికి స్ట్రీమింగ్ రైట్స్!

Ustaad Bhagat OTT: భారీ ధరలకు ఉస్తాద్ భగత్ ఓటీటీ డీల్ క్లోజ్ …నెట్ ఫ్లిక్స్ చేతికి స్ట్రీమింగ్ రైట్స్!
Advertisement

Ustaad Bhagat OTT: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ (Harish Shankar)డైరెక్షన్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న తాజా చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్(Ustaad Bhagat Singh). ఈ సినిమా మార్చ్ 26వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు .ఇందులో భాగంగానే ఇటీవల ఈ సినిమా నుంచి ఆరా అంటూ సాగిపోయే పాటను విడుదల చేశారు. ఈ పాటకు ఎంతో మంచి ఆదరణ లభిస్తుంది. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా జరుపుకుంటుంది. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ సినిమా పట్ల మంచి అంచనాలను పెంచే నేపథ్యంలోనే బిజినెస్ కూడా భారీ స్థాయిలో జరుగుతుంది.

నెట్ ఫ్లిక్స్ చేతికి స్ట్రీమింగ్ రైట్స్..

తాజాగా ఈ సినిమా డిజిటల్ హక్కులకు సంబంధించి ఒక వార్త వైరల్ అవుతుంది. ఈ సినిమా డిజిటల్ రైట్స్ ప్రముఖ ఓటీటీ సమస్థ నెట్ ఫ్లిక్స్ భారీ ధరలకు కైవసం చేసుకున్నట్టు సమాచారం. ఇప్పటికే ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగా జరగడంతో డిజిటల్ బిజినెస్ కూడా అదే రేంజ్ లో జరిగిందని తెలుస్తోంది. ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్న నేపథ్యంలోనే నెట్ ఫ్లిక్స్ ఏకంగా 80 కోట్ల రూపాయలకు ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను కైవసం చేసుకున్నట్టు తెలుస్తుంది.

రూ. 80 కోట్లకు ఉస్తాద్ భగత్ సింగ్ డిజిటల్ రైట్స్..

Advertisement

ఇలా 80 కోట్ల రూపాయలకు ఈ సినిమా హక్కులను నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకోవడం అంటే మామూలు విషయం కాదు పవన్ కళ్యాణ్ కెరియర్ లోనే హైయెస్ట్ డీల్ అనే చెప్పాలి. ఈసినిమా విడుదల కాకముందే థియేటర్ హక్కులు, డిజిటల్ హక్కులు అన్నీ కలిపి దాదాపు రూ.140 కోట్ల వరకు బిజినెస్ జరిగిందని తెలుస్తోంది. ఇటీవల పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఓజి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద 300 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టిన నేపథ్యంలోనే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాపై భారీగా అంచనాలు ఉన్నాయి.

పోలీస్ ఆఫీసర్ గా పవన్..

Advertisement

మార్చి 26వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా పవన్ కళ్యాణ్ అభిమానులకు ఎలాంటి ట్రీట్ ఇస్తుందో తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే.హరీష్ శంకర్ డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఇప్పుడు ఉస్తాద్ విషయంలో కూడా అదే మ్యాజిక్ రిపీట్ అవుతుందని అభిమానులు కూడా ఆశాబావం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాలో శ్రీ లీల హీరోయిన్ గా నటించగా, మరొక హీరోయిన్ రాశి ఖన్నా కూడా కీలక పాత్రలో కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాకు రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా మైత్రి మూవీ మేకర్ నిర్మాణంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Also Read: Puri jagannadh: మరో కోలీవుడ్ హీరోను లైన్ లో పెట్టిన పూరి.. తెలుగు హీరోలను పక్కన పెట్టినట్టేనా?

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×