E-Paper
Advertisement

Pawan Kalyan: నేను నెం 1 కాదు… టాలీవుడ్‌లో తన స్థానంపై పవన్ కళ్యాణ్ కీలక కామెంట్స్

Pawan Kalyan: నేను నెం 1 కాదు… టాలీవుడ్‌లో తన స్థానంపై పవన్ కళ్యాణ్ కీలక కామెంట్స్
Advertisement

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే.. మరొకవైపు సినిమాలలో నటిస్తూ అభిమానులను ఖుషీ చేస్తున్నారు. అలాగే జనసేన పార్టీని మరింత బలోపేతం చేయడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు పవన్ కళ్యాణ్. తాజాగా కాకినాడ జిల్లా పిఠాపురంలో సంక్రాంతి సంబరాలలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు అభిమానులను ఆశ్చర్యానికి గురయ్యేలా చేస్తున్నాయి. ఒక స్టార్ హీరో అయ్యుండి కూడా అలా మాట్లాడడంతో అభిమానులు సైతం పవన్ కళ్యాణ్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

నెంబర్ వన్ కాకపోయినా.. నేను పెద్ద యాక్టర్ నే..

తన సొంత నియోజకవర్గమైన పిఠాపురంలో మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. పిఠాపురంలో ఎలాంటి చిన్న విషయం జరిగిన సరే పిఠాపురంలో చాలా దారుణం జరుగుతోంది అంటూ మాట్లాడుతున్నారు. గత ఐదు సంవత్సరాల కాలంలో పిఠాపురంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు ఇప్పుడు ఏం జరిగిందో చూడండి. డబ్బు సంపాదన కోసమే నేను రాజకీయాలలోకి రాలేదు. నేను ఒక పెద్ద యాక్టర్ ని , నెంబర్ వన్ యాక్టర్ ని కాకపోయినప్పటికీ కూడా నా స్థాయిలో నేను బాగా డబ్బులు సంపాదించగలిగే యాక్టర్ ని” అంటూ పవన్ కళ్యాణ్ మాట్లాడారు.

అందుకే రాజకీయాల్లోకి వచ్చాను – పవన్ కళ్యాణ్

Advertisement

సినిమా ఫ్లాప్ అయినా కూడా ఆ సినిమాలు కూడా కలెక్షన్స్ సాధించే స్థాయి నా సినిమాలకి ఉందంటూ పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ఇదంతా కూడా అభిమానుల ప్రేమ వల్లే జరుగుతోంది. అలాంటి నేను ఎందుకు రాజకీయాలలోకి రావాల్సి వచ్చింది అంటే.. ప్రజలు పడుతున్న బాధలు కష్టాలను చూసి నేను రాజకీయాలలోకి వచ్చాను అంటూ తెలియజేశారు. మొత్తానికైతే తాను నెంబర్ వన్ హీరోని కాకపోయినా పెద్ద యాక్టర్ ని అని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు ప్రస్తుతం ఈయన చేసిన కామెంట్లు సోషల్ మీడియా వైరల్ గా మారుతున్నాయి.

పవన్ కళ్యాణ్ సినిమాలు..

సినీ ఇండస్ట్రీలోకి తన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి సహాయంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. మొదటి సినిమాతోనే తన నటనతో అందరి దృష్టిని ఆకట్టుకున్న పవన్ కళ్యాణ్.. ఒక్కో మెట్టు ఎదుగుతూ నేడు స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్నారు. ముఖ్యంగా మిగతా భాషలలో సినిమాలు చేయకపోయినా.. తన చిత్రాలతో పాన్ ఇండియా హీరోగా చలామణి అవుతున్నారు. గత ఏడాది చివరిగా హరిహర వీరమల్లు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈయన ఇప్పుడు ప్రముఖ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇందులో శ్రీ లీల హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమా తర్వాత హరిహర వీరమల్లు 2లో కూడా నటించబోతున్నారు పవన్ కళ్యాణ్..

Advertisement

ALSO READ:Film industry: లవర్‌కి బ్రేకప్ చెప్పిన టాక్సిక్ నటి… సడన్‌గా ఈ నిర్ణయం ఎందుకంటే?

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×