// // OG Movie - 'ఓజీ' ఫ్యాన్స్‌కి బ్యాడ్‌ న్యూస్‌.. డీవీవీ ట్వీట్‌తో డిసప్పాయింట్‌ అవుతున్న అభిమానులు -->
E-Paper
Advertisement

OG Movie: ‘ఓజీ’ ఫ్యాన్స్‌కి బ్యాడ్‌ న్యూస్‌.. డీవీవీ ట్వీట్‌తో డిసప్పాయింట్‌ అవుతున్న అభిమానులు

OG Movie: ‘ఓజీ’ ఫ్యాన్స్‌కి బ్యాడ్‌ న్యూస్‌.. డీవీవీ ట్వీట్‌తో డిసప్పాయింట్‌ అవుతున్న అభిమానులు
Advertisement

OG Makers Clarifies on Rumours: పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్ నటిస్తున్న చిత్రం ‘ఓజీ‘. మొన్నటి వరకు హరి హర వీరమల్లు హవా కనిపించింది. ఇప్పుడు ఓజీ వంత వచ్చింది. ఇటీవల విడుదలైన ఫైర్‌ స్ట్రోమ్‌తో మూవీపై విపరీతమైన బజ్‌ నెలకొంది. ఈ చిత్రం నుంచి అప్‌డేట్స్‌ రావడంతో ఫ్యాన్స్‌ అంత పండగ చేసుకుంటున్నారు. ఇక మరో రెండు రోజుల్లో ఇండిపెండెన్స్‌ డే ఉండటంతో ఓజీ నుంచి స్పెషల్‌ అప్‌డేట్‌ రాబోతోందంటూ సోషల్‌ మీడియాలో తెగ ప్రచారం జరుగుతుంది.

Advertisement

సోషల్ మీడియాలో ఓజీపై ఆ ప్రచారం

ఈసారి మూవీ టీం ఎలాంటి సర్‌ప్రైజ్‌ చేయబోతోందా? అని నెటిజన్స్‌, ఫ్యాన్స్‌ అంత ట్విటర్‌ వేదికగా చర్చిస్తున్నారు. ఇది కాస్తా మూవీ టీం కంట పడింది. ఫ్యాన్స్‌ ట్వీట్స్‌పై ఏకంగా మూవీ టీం స్పందించింది. ఈ మేరకు ట్విటర్‌లో జరిగిన సంబాషణలో హాట్‌ టాపిక్‌గా మారింది. కాగా ఓ ట్విటర్‌ యూజర్‌ ఈ స్వాతంత్ర్యదినోత్సవం సందర్భంగా ఓజీ నుంచి క్రేజీ అప్‌డేట్‌ రాబోతుంది. యాక్షన్‌ సీన్స్‌కి సంబంధించిన గ్లింప్స్‌ రెడీ అవుతుదంటూ ట్వీట్‌ చేశాడు.

Advertisement

నిర్మాణ సంస్థ డీవీవీ క్లారిటీ

ఇది చూసిన నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌.. ఆ ట్వీట్‌పై స్పందించింది. అని ‘అని ఎవడు చెప్పాడ్రా.. ఏమైన ఉంటే నేనే చెప్తాను‘ అంటూ ఫన్నీ మీమ్‌తో సమాధానం ఇచ్చారు. మరి నెక్ట్స్‌ అప్‌డేట్‌ ఎప్పుడు అని మరో ట్విటర్‌ యూజర్ అడగ్గా.. మరికొన్ని రోజులు ఆగాల్సిందే.. తెలుసుగా మనం మొదలుపెడితే ఎలా ఉంటదో‘ అంటూ రిప్లై ఇచ్చాడు. ఫ్యాన్స్‌, నిర్మాత మధ్య జరిగిన ఈ సంభాషణ హాట్‌ టాపిక్‌గా నిలిచింది. ఇక డీవీవీ ట్వీట్‌తో అభిమానులంత నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఈ ఇండిపెండెన్స్‌ డే ఏమైనా స్పెషల్‌ ప్రొమో ఉంటుందని ఎక్స్‌పెక్ట్‌ చేశాం.. కానీ, మమ్మల్ని డిసప్పాయింట్‌ చేశారు అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.

కాగా సాహో ఫేం, యంగ్‌ డైరెక్టర్‌ సుజీత్‌ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో ప్రియాంక మోహన్‌ ఆరుళ్‌ హీరోయిన్‌గా నటిస్తుండగా.. బాలీవుడ్‌ నటుడు ఇమ్రాన్‌ హష్మి ప్రతికథానాయకుడిగా కనిపించబోతున్నాడు. అర్జున్‌ దాస్‌, శ్రియా రెడ్డి, ప్రకాశ్‌ రాజ్‌లు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకున్ని పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుపుతున్నారు. సెప్టెంబర్‌ 25న ఈ చిత్రం వరల్డ్‌ వైడ్‌గా విడుదల కానుంది. డీవీవీ ఎంటర్టైన్‌మెంట్స్ పతాకంపై డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ముంబైకి చెందిన గ్యాంగ్ స్టర్‌ నేపథ్యంలో ఈ చిత్రం సాగనుంది. ఇందులో పవన్ క్రూరమైన గ్యాంగ్ స్టర్ కనిపిస్తారడట. కాగా పదేళ్ల తర్వాత ముంబైకి తిరిగి వచ్చిన అతడు మరో విలన్ గ్యాంగ్ స్టర్ ఎలా ఎదుర్కొన్నాడు, అతడిని ఎలా అంతం చేశాడన్నదే ఓజీ కథ. 

Also Read: OTT Movie: అక్క అంటూనే.. టీనేజ్‌లో అలాంటి పని చేసే అబ్బాయి, ఆ కథతోనే సినిమా.. ఫుల్ కామెడీ భయ్యా!

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×