E-Paper
Advertisement

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ నయా ప్రాజెక్ట్‌పై ఇండస్ట్రీ బజ్!.. దర్శకుడు ఎవరంటే?

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ నయా ప్రాజెక్ట్‌పై ఇండస్ట్రీ బజ్!.. దర్శకుడు ఎవరంటే?
Advertisement

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టాలెంటెడ్ డైరెక్టర్ మోహన్ రాజా కలయికలో సినిమా రాబోతుందన్న వార్త ఇప్పడు సోషల్ మీడియాలో హాట్ టాపిగ్ గా మారింది. ఈ సెన్సేషనల్ ప్రాజెక్ట్‌ను ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించనుండటంతో అంచనాలు రెట్టింపు అయ్యాయి. ఇప్పటికే ఈ సంస్థ పవన్ కళ్యాణ్‌తో ‘బ్రో’ (Bro) వంటి విభిన్నమైన చిత్రాన్ని నిర్మించి మెప్పించింది. ఇప్పుడు మరోసారి ఈ కాంబినేషన్ సెట్ కావడం విశేషం.

Read also-Ustaad Bhagat Singh: పాపం శ్రీలీల కష్టాలు మామూలుగా లేవే.. కనీసం ఇప్పటికైనా?

పవన్ కళ్యాణ్ క్రేజీ డీల్

Advertisement

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్ కు పవన్ కళ్యాణ్ అంటే ఎంతో గౌరవం. వీరిద్దరి మధ్య ఉన్న అనుబంధం కారణంగానే వరుస ప్రాజెక్టులు పట్టాలెక్కుతున్నాయి. ఇటీవలే భోగి పండుగ సందర్భంగా పవన్ కళ్యాణ్ మరియు టీజీ విశ్వప్రసాద్ భేటీ అయిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్‌తో కలిసి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ దాదాపు 15 సినిమాల వరకు నిర్మించే ప్రణాళికలో ఉందని సమాచారం. అందులో భాగంగానే మోహన్ రాజా దర్శకత్వంలో ఈ సినిమా రూపొందనుంది.

Read also-Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10 పై క్రేజీ అప్డేట్.. ఈ సీజన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే..?

సినిమా బజ్

Advertisement

మోహన్ రాజా గతంలో చిరంజీవితో ‘గాడ్ ఫాదర్’ వంటి పొలిటికల్ యాక్షన్ డ్రామాను తెరకెక్కించి సక్సెస్ అయ్యారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కోసం కూడా అదే స్థాయి ఇంటెన్స్ కలిగిన కథను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మేకింగ్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను ప్లాన్ చేస్తోంది. విజువల్ ఎఫెక్ట్స్ మేకింగ్ క్వాలిటీలో ఈ సంస్థకు ప్రత్యేక గుర్తింపు ఉంది, కాబట్టి ఈ మూవీ కూడా హై-ఎండ్ టెక్నికల్ వాల్యూస్‌తో ఉండబోతోంది. ‘ది రాజా సాబ్’ వంటి భారీ ప్రాజెక్టుల తర్వాత పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నుంచి పవన్ కళ్యాణ్‌తో సినిమా అనగానే ట్రేడ్ వర్గాల్లో భారీ బిజినెస్ జరిగే అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా ముగించుకుని సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చేసేందుకు రెడీ అవుతున్నారు. ఆ సినిమా తర్వాత మోహన్ రాజాతో సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభమయ్యేలా నిర్మాతలు ఏర్పాట్లు చేస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వేగం, మోహన్ రాజా స్క్రీన్ ప్లే, పవన్ కళ్యాణ్ స్వాగ్.. ఈ మూడు కలిస్తే బాక్సాఫీస్ వద్ద రికార్డుల వర్షం కురవడం ఖాయమని ఫ్యాన్ సంబరాలు చేసుకుంటున్నారు.

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×