E-Paper
Advertisement

Pawan Kalyan Movie : పవన్‌తో కొరటాల మీటింగ్… హమ్మయ్య.. ఫ్యాన్స్ సేఫ్

Pawan Kalyan Movie : పవన్‌తో కొరటాల మీటింగ్… హమ్మయ్య.. ఫ్యాన్స్ సేఫ్
Advertisement

Pawan Kalyan Movie : గత కొన్ని రోజుల నుంచి ఇండస్ట్రీలో ఓ వార్త తెగ వైరల్ అవుతుంది. అదేంటంటే… కొరటాల శివ డైరెక్షన్‌లో పవన్ కళ్యాణ్ సినిమా. కొన్ని వేదికలపై ఇప్పటికే డైరెక్టర్ కొరటాల శివ దీని గురించి మాట్లాడారు. అలాగే పవన్‌తో కొరటాల స్టోరీ సిట్టింగ్స్ కూడా అయ్యాయనే వార్త ఇండస్ట్రీలో వైరల్ అవుతుంది. ఇప్పుడు కొరటాలతో పవన్ సినిమా చేస్తే పరిస్థితి ఏంటి అంటూ టెన్షన్ పడిపోయారు. అయితే… ఇప్పుడు వస్తున్న సమాచారం ప్రకారం… ఫ్యాన్స్ సేఫ్ అని తెలుస్తుంది.

కొరటాల శివ అంటే మొన్నటి వరకు సక్సెస్ ఫుల్ డైరెక్టరే. చేసిన సినిమాలన్నీ కూడా హిట్ అయ్యాయి. కానీ, ఇప్పుడు ఆయన కెరీర్‌లో ఓ బిగ్ డిజాస్టర్ పడింది. అదే ఆచార్య. ఈ డిజాస్టర్‌తో ఒక్క సారిగా ఆయన పరిస్థితి మారిపోయింది. ఆచార్య తర్వాత దేవరతో కాస్త పర్లేదు అని అనిపించుకున్నా… ప్రస్తుతం ఆయనను ఏ హీరో నమ్మే పరిస్థితిలో లేరు.

పవన్‌కు స్టోరీ చెప్పాడు?

Advertisement

గత కొన్ని రోజులుగా వినిపిస్తున్నట్టే.. పవన్ కళ్యాణ్ కోసం కొరటాల శివ కథను రెడీ చేసుకున్నాడంట. ఈ స్టోరీని వినిపించడానికి పవన్ కళ్యాణ్‌ను కొరటాల శివ కలవడం కూడా జరిగిందంట. అయితే, కొరటాల శివ చెప్పిన కథ పవన్‌కు పెద్దగా నచ్చలేదంట. ఈ టైంలో అలాంటి కథను చేయడం సరికాదు అని కొరటాలతో చెప్పినట్టు తెలుస్తుంది.

పవన్ ఫ్యాన్స్ సేఫ్..?

కొరటాల శివ చెప్పిన కథను పవన్ కళ్యాణ్ రిజక్ట్ చేసినట్టు వార్తలు బయటికి రావడంతో… మేం సేఫ్ అని కామెంట్స్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ అభిమానులు. కొరటాల శివ వల్ల ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్‌కు ఆచార్య లాంటి బిగ్ డిజాస్టర్ మూవీ వచ్చింది. ఇప్పుడు అలాంటిదే… పవన్ కళ్యాణ్‌కు కూడా వస్తే.. ఆ పరిస్థితిని తాము ఊహించలేం అంటూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

కొరటాలను నమ్మెది ఎవరు?

Advertisement

ఇప్పటికే కొరటాలను ఇండస్ట్రీలో నమ్మెలా ఎవరూ లేరు. దేవర లాంటి మూవీ వచ్చిన తర్వాత కూడా కొరటాల శివను ఎన్టీఆర్ పక్కన పెట్టాడు అనే వార్తలు వినిపిస్తున్నాయి. దేవర 2 దాదాపు రద్దు అయినట్టే అని తెలుస్తుంది. దీంతో కొరటాల మరో హీరో కోసం సెర్చ్ చేస్తున్నాడు. పనవ్ కళ్యాణ్ దాదాపు కన్ఫర్మ్ అనుకున్న టైంలో.. పవన్ కళ్యాణ్ కూడా కొరటాలను రిజక్ట్ చేయడంతో.. ఇప్పుడు కొరటాలను నమ్మెది ఎవరు అనే టాక్ ఇండస్ట్రీలో నడుస్తుంది. చూడాలి మరి.. ఇన్ని రిజక్షన్స్ తర్వాత కొరటాల శివ ఏ హీరోతో సినిమా చేస్తాడో…

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×