// // OG Movie Ticket - రూ. కోటి పెట్టి ఓజీ టికెట్స్ కొన్న హైదరాబాద్ ఫ్యాన్ -->
E-Paper
Advertisement

OG Ticket Price: రూ. కోటి పెట్టి ఓజీ టికెట్స్ కొన్న హైదరాబాద్ అభిమాని.. అది పవన్‌ స్టార్ క్రేజ్‌ అంటే..

OG Ticket Price: రూ. కోటి పెట్టి ఓజీ టికెట్స్ కొన్న హైదరాబాద్ అభిమాని.. అది పవన్‌ స్టార్ క్రేజ్‌ అంటే..
Advertisement

OG Movie Ticker Price: పవన్‌ కళ్యాణ్‌ ఓజీ (OG Movie) మానియా మామూలుగా లేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసిన ఓజీ క్రేజ్‌ కనిపిస్తోంది. ముఖ్యంగా ఫ్యాన్స్‌ హంగామా మామూలుగా లేదు. టికెట్లను ఎగబడి కొంటున్నారు. ఈ క్రమంలో ధరలను సైతం లెక్క చేయడం లేదు. ఒక మూవీ టికెట్‌ వేలం వేయడం తొలిసారి ఓజీకే చూస్తున్నాం. టాలీవుడ్ మెగాస్టార్‌ చిరంజీవి సినిమాలకు సైతం ఈ రేంజ్‌లో క్రేజ్‌ కనిపించలేదు. కానీ, పవన్‌ కళ్యాణ్‌ సినిమా ఓ రేంజ్ బజ్‌ చూపిస్తోంది. ముఖ్యంగా ప్రీమియర్‌ షోల టికెట్‌ రేట్స్‌ షాకిస్తున్నాయి. కోట్లలో ధరలు పలుకుతున్నాయి. పైగా సెలబ్రిటీలు కాదు.. సామాన్యులే టికెట్స్‌ని కోట్లు పెట్టి కొంటున్నారు.

ఓవర్సిస్ రూ. 5 లక్షలు

Advertisement

ఓవర్సిస్‌లో ప్రీమియర్‌ షో తొలి టికెట్‌ని అక్కడి పవన్‌ అభిమాన సంఘం రూ. 5 లక్షలకు కొనుగోలు చేసింది. ఇది మొన్నటి వరకు ఉన్న రికార్డు. అక్కడ తొలి టికెట్‌ని వేలంగా వేయ్యగా… ఫైనల్‌గా రూ. 5 లక్షలు పలికింది. ఇక ఇండియాలోనూ అదే రిపీట్‌ అవుతుంది. ఏపీలో పలు చోట్ల ఓజీ ప్రీమియర్స్‌కి సంబంధించి తొలి టికెట్స్‌ని వేలం వేయగా.. ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఓ చిత్తూరుకి చెందిన ఓ అభిమాని లక్ష రూపాయలకు ఓజీ ప్రీమియర్‌ షో టికెట్‌ని సొంతం చేసుకున్నాడు. అలాగే తెలంగాణ యాదాద్రి జిల్లా చౌటుప్పల్‌కు చెందిన పవన్‌ అభిమాని ఆముదాల పరమేష్‌ ఓజీ టికెట్‌ రూ.1,29,999 పెట్టి కొన్నాడు. వేలంలో రూ.1,29,999లకు పాట పాడి టికెట్‌ని సొంతం చేసుకున్నాడు.

Also Read: Pawan Kalyan: ఇప్పటి వరకు ఆ రికార్డు లేని ఒకే ఒక్క హీరో పవన్‌.. OGతో సాధ్యమయ్యేనా?

Advertisement

కట్టలు తెచ్చుకుంటున్న అభిమానం

ఇక మరో అభిమాని అయితే ఏకంగా ఓజీ టికెట్స్‌ కోటి పెట్టి కొన్నాడు. హైదరాబాద్‌ కు చెందిన పవన్ వీరాభిమాని ప్రీమియర్‌ షోల కోసం ఏకంగా కోటీ రూపాయలు వెచ్చించాడు. 11 షోలకు ఒక్కొ టికెట్‌కి లక్ష చొప్పున కోటి పదకొండు లక్షల రూపాయలకు కొన్నాడు. ఇలా పవన్‌ కళ్యాణ్‌ పట్ల ఫ్యాన్స్‌ చూపిస్తున్న ఈ అభిమానానికి ప్రతి ఒక్కరు షాక్‌ అవుతున్నారు. ఇదేం పిచ్చిరా బాబూ.. అభిమానం మరి ఇలా కట్టలు తెచ్చుకుపోతుందంటున్నారు మూవీ క్రిటిక్స్‌. ఈ రేంజ్‌లో ఫ్యానీజం ఇప్పటి వరకు చూడలేదని, చిరంజీవిలాంటి హీరో సినిమాకి కూడా ఈ స్థాయిలో వైబ్‌ లేదంటున్నారు. ఓజీ మూవీ ప్రీమియర్స్‌ షోలకు ఈ రేంజ్‌ వస్తున్న రెస్పాన్స్‌ సామాన్య ఆడియన్స్‌ కి పిచ్చెక్కిస్తుంటే.. ఫ్యాన్స్‌ మాత్రం అది మా పవర్‌ స్టార్ రేంజ్‌ అంటూ కాలర్‌ ఎగిరేస్తున్నారు.

ఓజీ టికెట్స్ కి రూ. కోటి

విడుదలకు ముందే ఇన్ని రికార్డ్స్‌ చేస్తున్న ఓజీ మూవీ రిలీజ్‌ తర్వాత ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో అని సినీ విశ్లేషకలు అంచనాలు వేస్తున్నారు. మొత్తానికి ఓజీ మూవీకి మాత్రం ఫ్యాన్స్‌ ఇస్తున్న హైప్‌, బజ్‌ ఎవరూ ఊహించని విధంగా ఉంది. మరి విడుదల తర్వాత కూడా ఓజీ ఇదే వైబ్‌ ఇస్తుందా? లేదా చూడాలి. కాగా సాహో ఫేం సుజిత్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో గ్యాంగ్‌లీడర్‌ బ్యూటీ ప్రియాంక మోహన్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే బాలీవుడ్‌ నటుడు ఇమ్రాన్‌ హష్మీ విలన్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో ప్రకాశ్ రాజ్‌, శ్రియా రెడ్డి, అర్జున్‌ దాస్, జగపతి బాబు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై డీవీవీ దానయ్య నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్‌ 25 వరల్డ్‌ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక ఈ రోజు హైదరాబాద్‌ ఎల్బీ స్టేడియంలో జరిగే ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో మూవీ ట్రైలర్‌ విడుదల కానుంది.

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×