E-Paper
Advertisement

Pawan Kalyan – Sujeeth: సుజీత్ కు పవన్ కళ్యాణ్ కారు ఇవ్వడానికి ఇదే కారణం, సినిమా కోసం సుజీత్ అంతకు తెగించాడా?

Pawan Kalyan – Sujeeth: సుజీత్ కు పవన్ కళ్యాణ్ కారు ఇవ్వడానికి ఇదే కారణం, సినిమా కోసం సుజీత్ అంతకు తెగించాడా?
Advertisement

Pawan Kalyan – Sujeeth: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో వచ్చిన సినిమా ఓ జి. పవన్ కళ్యాణ్ కి సుజిత్ ఎంత పెద్ద అభిమాని అని కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. తన సినిమాతోనే అతనే ప్రూవ్ చేశాడు. పవన్ కళ్యాణ్ అభిమానులందరికీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద ఓజీ సినిమా మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. పవన్ కళ్యాణ్ బాడీ లాంగ్వేజ్ కి సరిపడా కథను సుజిత్ సిద్ధం చేసి ఆడియన్స్ ను సప్రైజ్ చేశాడు.

సొంత కారు అమ్మేసిన సుజీత్ 

ఇక రీసెంట్ గా పవన్ కళ్యాణ్ సుజీత్ కు కొత్త కారు ఇచ్చిన సంగతి తెలిసిందే. దాని గురించి ఒక ఆసక్తికరమైన విషయం ఇప్పుడు బయటకు వచ్చింది. ‘ఓజీ’ సినిమా ఘన విజయం సాధించినందుకే డిఫెండర్‌ను బహుమతిగా ఇచ్చారని చాలామంది భావించారు. అయితే, అసలు కారణం సినిమా షూటింగ్ చివరి షెడ్యూల్ సంబంధించినది. ఆ టైం లో, ఒక కీలకమైన షెడ్యూల్‌ను జపాన్‌లో చిత్రీకరించాల్సి వచ్చింది. బడ్జెట్ పరిమితుల కారణంగా, నిర్మాణ సంస్థ ఈ విదేశీ షెడ్యూల్‌కు అప్రూవల్ ఇవ్వలేదు.

Advertisement

ఆ సన్నివేశాలను చిత్రీకరిస్తేనే సినిమాకు కంప్లీట్ అవుతుంది అని సుజీత్ బలంగా నమ్మారు. దానిని ఎలాగైనా పూర్తి చేయాలనే పట్టుదలతో, ఆయన ఒక అడుగు ముందుకు వేశారు జపాన్ షెడ్యూల్ కోసం డబ్బులు అడ్జస్ట్ చేయడానికి సుజీత్ తన సొంత ల్యాండ్ రోవర్ డిఫెండర్‌ను అమ్మేశారు. ఆ డబ్బుతో ఆయన జపాన్‌కు వెళ్లి, అవసరమని భావించిన సన్నివేశాలను చిత్రీకరించారు.

అందుకే కార్ గిఫ్ట్

ఈ విషయం డబ్బింగ్ సమయంలో పవన్ కళ్యాణ్ దృష్టికి వచ్చింది. సినిమా పట్ల సుజీత్ అంకితభావం, అభిరుచి మరియు బాధ్యతా స్ఫూర్తికి ఆయన పవన్ కళ్యాణ్ విపరీతంగా ఇంప్రెస్ అయిపోయారు. సినిమా కోసం దర్శకుడు తన సొంత వాహనాన్ని అమ్ముకున్నాడనే విషయం తెలుసుకుని చలించిపోయిన పవన్ కళ్యాణ్, ఆయనకు అదే మోడల్ కారును – ల్యాండ్ రోవర్ డిఫెండర్‌ను – తిరిగి బహుమతిగా ఇవ్వాలని నిర్ణయించుకున్నారు.

Advertisement

అందుకే సుజీత్‌కు ల్యాండ్ రోవర్ డిఫెండర్‌ను బహుమతిగా ఇచ్చారు. ఈ వాహనానికి సంబంధించిన ఈఎంఐలను కూడా పవన్ కళ్యాణే చెల్లించనున్నారు. అయితే ఓ జి సినిమా సక్సెస్ అయినప్పుడు కొంతమందికి సీల్డ్లు అందించిన సంగతి తెలిసిందే. అప్పట్లో సుజిత్ కి పవన్ కళ్యాణ్ సీల్డ్ అందించాలి అన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఆ సీల్డ్ రిజెక్ట్ చేశారు. సుజిత్ కి ఇవ్వాల్సిన అసలైన గిఫ్ట్ అప్పుడే పవన్ కళ్యాణ్ మైండ్ లో ఉండి ఉండొచ్చు బహుశా.

Also Read: Champion Movie : గోల్డెన్ బాయ్ విజయ్ దేవరకొండ, ఆ పాత్ర లేకపోతే విజయ్ లేడా?

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×