E-Paper
Advertisement

Pawan Kalyan: ఉస్తాద్ భగత్ సింగ్ కోసం పవన్ భారీ రెమ్యూనరేషన్..ఎంతంటే?

Pawan Kalyan: ఉస్తాద్ భగత్ సింగ్ కోసం పవన్ భారీ రెమ్యూనరేషన్..ఎంతంటే?
Advertisement

Pawan Kalyan: సినీనటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా పనులలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా మార్చి 19వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో విడుదలకు అన్ని ఏర్పాట్లను సిద్ధం చేస్తున్నారు. ఇక తాజాగా పవన్ కళ్యాణ్ ఈ సినిమా డబ్బింగ్ పనులలో నిమగ్నమయ్యారు. ప్రస్తుతం డబ్బింగ్ పూర్తి చేసే పనిలో పవన్ కళ్యాణ్ ఉన్నారని తెలుస్తోంది. అతి త్వరలోనే ఈ సినిమా నుంచి టీజర్ విడుదల చేయడానికి కూడా చిత్ర బృందం ఏర్పాట్లు చేస్తున్నారు. నిజానికి ఈ సినిమా మార్చ్ 26వ తేదీ విడుదల కావాల్సి ఉండగా 19వ తేదీ విడుదల కాబోతున్న టాక్సిక్ సినిమా వాయిదా పడటంతో ఉగాది పండుగను పురస్కరించుకొని ఉస్తాద్ భగత్ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది..

ఉస్తాద్ కోసం పవన్ భారీ రెమ్యూనరేషన్..

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన రెండు పాటలు మంచి అంచనాలను పెంచేసాయి. ఇక ఈ సినిమా నుంచి త్వరలోనే టీజర్ విడుదల కాబోతుందని సమాచారం. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ తీసుకున్న రెమ్యూనరేషన్ కి సంబంధించి వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియా సమాచారం మేరకు ఈ సినిమా కోసం కొన్ని సంవత్సరాల క్రితం పవన్ 5 కోట్ల రూపాయల తీసుకున్నారట. ఈ సినిమా ఆలస్యం కావడంతో అప్పటినుంచి పవన్ ఎలాంటి రెమ్యూనరేషన్ డిమాండ్ చేయలేదని, అయితే ఈ సినిమా కోసం పవన్ రూ. 25 కోట్ల రూపాయలు రెమ్యూనరేషన్ తీసుకోవడం కోసం అగ్రిమెంట్ కుదుర్చుకున్నట్టు తెలుస్తుంది

సినిమా లాభాలలో వాటా..

Advertisement

ఈ రెమ్యూనరేషన్ తో పాటు ఈ సినిమా మంచి లాభాలను అందుకుంటే వాటా తీసుకోబోతున్నారని తెలుస్తుంది. మరి పవన్ కళ్యాణ్ రెమ్యూనరేషన్ గురించి వస్తున్న వార్తలలో ఎంత వరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది. పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ కాంబినేషన్లో ఇదివరకు గబ్బర్ సింగ్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా తర్వాత మరోసారి వీరి కాంబినేషన్లో రాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాపై కూడా అదే స్థాయిలో అంచనాలు ఉన్నాయి . ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ మరోసారి పోలీస్ యూనిఫామ్ ధరించిన సంగతి తెలిసిందే. మరి ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ ఎలాంటి సక్సెస్ అందుకుంటారో తెలియాల్సి ఉంది.

పవన్ జోడిగా శ్రీ లీల..

Advertisement

ఇక ఈ సినిమాలో పవన్ జోడిగా నటి శ్రీలీల నటిస్తున్న విషయం తెలిసిందే. ఈమెతో పాటు రాశి ఖన్నా కూడా ఈ సినిమాలో భాగమయ్యారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమాకు రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా ప్రస్తుతం ఈ సినిమా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కోసం తమన్ రంగంలోకి దిగారు. ఉగాది పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా అభిమానులకు ఎలాంటి ఫీస్ట్ ఇవ్వనుందో తెలియాల్సి ఉంది. ఇటీవల పవన్ నటించిన ఓజి సినిమా తర్వాత రాబోతున్న సినిమా కావడంతో ఈ చిత్రం పై భారీ అంచనాలు ఉన్నాయి.

Also Read: Allu Arjun: అల్లు శిరీష్ నైనికల వివాహం.. అల్లు అర్జున్ ఆసక్తికర పోస్ట్!

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×