E-Paper
Advertisement

Samantha: దాన్ని అనుభవించే హక్కు మీకుంది.. మరోసారి మహిళా హక్కులపై సమంత పోరాటం!

Samantha: దాన్ని అనుభవించే హక్కు మీకుంది.. మరోసారి మహిళా హక్కులపై సమంత పోరాటం!
Advertisement

Samantha:ఏ మాయ చేసావే సినిమాతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను దోచుకున్న సమంత (Samantha ) నేడు పాన్ ఇండియా హీరోయిన్గా చలామణి అవుతోంది. ఒకవైపు హీరోయిన్ గా నటించడమే కాకుండా ఇండస్ట్రీలో అమ్మాయిల స్థితి గతులు, వారి కెరియర్ ఎదుగుదలపై ప్రభావం చూపుతున్న అంశాల గురించి ప్రస్తావిస్తూ ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తోంది. అందులో భాగంగానే గతంలో పురుషులతో సమానంగా మహిళలకు రెమ్యూనరేషన్ ఇవ్వాలి అని వార్తల్లో నిలిచిన సమంత.. తన సొంత నిర్మాణ సంస్థ ద్వారా నటీనటులు ఇద్దరికీ సమానంగా పారితోషకం ఇచ్చి ఆడ మగ తేడా లేదు.. ఇద్దరూ సమానమే అని నిరూపించింది.

మహిళల పట్ల ఆలోచన ధోరణి మారాలి..

అయితే ఇప్పుడు మరొకసారి ఇండస్ట్రీలో ఆడవారి కంటే మగవారికే ఎక్కువ గౌరవ మర్యాదలు లభిస్తున్నాయని.. ఈ ఆలోచన ధోరణి మారాలి అని, మహిళల హక్కుల కోసం తాను పోరాటం చేస్తానని మరోసారి గలం విప్పింది సమంత.

హక్కుల కోసం పోరాడాల్సిన పనిలేదు..

Advertisement

ఒకవైపు “ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్” అనే నిర్మాణ సంస్థ ద్వారా పలు చిత్రాలు చేస్తూ నిర్మాతగా బిజీగా మారిన ఈమె.. మరొకవైపు ‘మా ఇంటి బంగారం’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. కెరియర్ పరంగా బిజీగా మారిన సమంత.. తాజాగా ఒక ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొని సినిమా రంగంలో మహిళలు ఎదుర్కొంటున్న సవాళ్లను ఎంతో ధైర్యంగా ఎత్తిచూపి అందరినీ ఆలోచింపజేసింది. సినిమా పరిశ్రమలో మహిళలు ప్రతి చిన్న గుర్తింపు కోసం పురుషుల కంటే ఎక్కువ పోరాడాల్సి వస్తోంది అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. దీనిపై సమంత మాట్లాడుతూ..” మనం ఇతరుల సౌకర్యం కోసం మన షెడ్యూల్స్ ని , మన అభిప్రాయాలను, ఆఖరికి మన ఆశయాలను కూడా నిరంతరం మార్చుకుంటున్నాము. ఇది ఒక త్యాగం అని కూడా గుర్తించలేనంతగా మనం దీనికి అలవాటు పడిపోయాము. ఒకే పరిస్థితిలో పురుషుల కంటే మహిళలు 10రెట్లు ఎక్కువగా క్షమాపణలు చెబుతారని మీకు తెలుసా ?

ఇకనైనా మీ హక్కులను అనుభవించండి..

అందుకే ఇక చాలు ఆపండి.. మీరు కష్టపడి సంపాదించుకున్న గౌరవాన్ని అనుభవించే హక్కు పూర్తిగా మీకు ఉంది.. లక్ష్యం అనేది క్యారెక్టర్ లో లోపం కాదు.. అది మీ బలం.. కనీసం ఇప్పటికైనా హక్కుల కోసం పోరాడడం మానేసి.. ఆ హక్కులను అనుభవించగలిగే స్టేజ్ కి రండి” అంటూ మహిళలకు పిలుపునిచ్చింది సమంత.. మొత్తానికైతే సినిమా ఇండస్ట్రీలో మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను.. వారు కోల్పోతున్న స్వేచ్ఛను, హక్కులను తిరిగి పొందేలా చేయాలి అని తన అభిప్రాయంగా చెప్పుకొచ్చింది.

Advertisement

ALSO READ:Tejaswi Madivada: బిగ్ బాస్ వల్ల నా కెరీర్ నాశనం అయ్యింది. అసలు కారణం చెప్పిన తేజస్వి!

భవిష్యత్తులో సినిమాను చూసే ధోరణి మారాలి..

అలాగే భవిష్యత్తులో సినిమా ప్రపంచం ఎలా ఉండాలో కూడా తన ఆలోచనలను పంచుకుంది. లేడీ ఓరియంటెడ్ సినిమాలను ఒక రిస్క్ లాగా లేదా ఒక ప్రత్యేక కేటగిరి లాగానే చూడడం ఆపి.. వాటిని కేవలం కథలు అని పిలిచే రోజు రావాలి.. తెరపై మహిళలు కేవలం హీరోకి భార్యగానో .. హీరోకి ధైర్యం చెప్పడానికో పరిమితం కాకుండా నిజజీవితంలో ఉండే మహిళల లాగానే క్లిష్టమైన మనస్తత్వంతో ఉండాలని సమంత తెలిపింది.

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×