E-Paper
Advertisement

Pan India No 1 Hero: ప్రభాస్‌ను మించిపోతున్న మరో పాన్ ఇండియా హీరో.. రాబోయే సినిమాల లైనప్ మామూలుగా లేదుగా..!

Pan India No 1 Hero: ప్రభాస్‌ను మించిపోతున్న మరో పాన్ ఇండియా హీరో.. రాబోయే సినిమాల లైనప్ మామూలుగా లేదుగా..!
Advertisement

Pan India No 1 Hero: పాన్ ఇండియా హీరోల గురించి మాట్లాడితే ముందుగా గుర్తుకు వచ్చే పేరు ప్రభాస్. బాహుబలి సినిమాలతో ఆయనకు వచ్చిన క్రేజ్ దేశం మొత్తం విస్తరించింది. ఆ తర్వాత సాహో.. ఆదిపురుష్, సలార్, ది రాజాసాబ్ లాంటి భారీ సినిమాలతో ప్రభాస్ తన స్థాయిని మరింత పెంచుకున్నారు. ప్రస్తుతం కూడా సలార్ పార్ట్ 2, కల్కి, ఫౌజీ, అలాగే సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కనున్న స్పిరిట్ సినిమాలతో ప్రభాస్ ఫుల్ బిజీలో ఉన్నారు. ముఖ్యంగా స్పిరిట్ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

ఇలాంటి సమయంలో ప్రభాస్ పాన్ ఇండియా నెంబర్ వన్ హీరోగా కొనసాగుతున్నారని అందరూ అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు ఆయనకు గట్టి పోటీ ఇస్తున్న మరో హీరో గురించి ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున అందరూ మాట్లాడుకుంటున్నారు. అతనే కేజిఎఫ్ సినిమా ద్వారా పాన్ ఇండియా హీరోగా మారిన యాష్.

Advertisement

కన్నడ సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన యష్, కేజీఎఫ్ సినిమాతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించారు. KGF: Chapter 1.. KGF: Chapter 2 సినిమాలు బాక్సాఫీస్‌ను షేక్ చేశాయి. ఈ సినిమాల తర్వాత యష్ పేరు పాన్ ఇండియా లెవెల్‌లో మార్మోగింది.

ఇప్పుడు యష్ రాబోయే సినిమాల లైనప్ చూస్తే అభిమానులు మాత్రమే కాదు..ట్రేడ్ వర్గాలు కూడా ఆశ్చర్యపోతున్నాయి. ముందుగా టీజర్ తోనే తెగ ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిన టాక్సిక్ సినిమా.. మార్చి 19న విడుదలకు సిద్ధమవుతోంది. ఇది యష్ కెరీర్‌లో పూర్తిగా కొత్త తరహా సినిమా అని ఈ చిత్ర ప్రమోషనల్ కంటెంట్ చూస్తేనే అర్థమవుతుంది.

Advertisement

అంతేకాదు, భారీ మిథలాజికల్ ప్రాజెక్ట్ అయిన రామాయణ పార్ట్ 1లో.. యష్ రావణుడి పాత్రలో కనిపించబోతున్నారు. దీపావళి కానుకగా ఈ సినిమా విడుదల కానుంది. అలాగే రామాయణ..పార్ట్ 2.. 2027 దీపావళికి ప్లాన్ చేస్తున్నారు.

ఇవే కాకుండా ఒక ప్రముఖ తమిళ దర్శకుడితో యష్ కొత్త సినిమా చేయనున్నారని సమాచారం. అది పూర్తిగా డిఫరెంట్ స్టోరీతో ఉంటుందట. ఇంకా అభిమానులను ఉత్సాహపరుస్తున్న విషయం ఏమిటంటే KGF: Chapter 3 కూడా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

దీంతో.. ప్రభాస్‌కు గట్టి పోటీ ఇచ్చే స్థాయిలో యష్ సినిమాల లైనప్ ఉందని చెప్పాలి. రాబోయే రోజుల్లో పాన్ ఇండియా రేస్ మరింత ఆసక్తికరంగా మారడం ఖాయం.

ALSO READ: Top 10 Heroes: ఇండియాలో టాప్ 10 హీరోలు.. 2026 జనవరి లిస్ట్‌లో ఎవరు ఏ స్థానంలో ఉన్నారంటే

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×