E-Paper
Advertisement

‘ధురంధర్’లో చూపించిందంతా అక్షరాలా నిజం!.. పాకిస్తానీ జర్నలిస్ట్ సంచలన వ్యాఖ్యలు

‘ధురంధర్’లో చూపించిందంతా అక్షరాలా నిజం!.. పాకిస్తానీ జర్నలిస్ట్ సంచలన వ్యాఖ్యలు
Advertisement

Dhurandhar Controversy: బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ నటించిన ‘ధురంధర్’ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్‌లో దూసుకుపోయిందో మనందరికీ తెలిసిందే. అయితే, ఈ సినిమాలో పాకిస్తాన్‌లోని కరాచీ నగరానికి చెందిన ‘ల్యారీ’ ప్రాంతాన్ని, అక్కడ నడిచే నేర ముఠాలను చూపించిన విధానంపై ఇరు దేశాల్లో తీవ్ర చర్చ నడుస్తోంది. కొందరు దీనిని కేవలం సినిమా కోసం కల్పించిన కథ అని కొట్టిపారేస్తుంటే.. ఆ ప్రాంతంలోనే పుట్టి పెరిగి, అక్కడ మేయర్‌గా పనిచేసిన ఒక పాకిస్తానీ జర్నలిస్ట్ మాత్రం ఈ సినిమాకు గట్టిగా మద్దతు పలికారు. సినిమాలో చూపించిన ప్రతి ఒక్కటి ‘అక్షరాలా నిజం’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.

Read also-ప్రెగ్నెన్సీ రూమర్లపై మాధురీ దీక్షిత్ స్ట్రాంగ్ రిప్లే.. ఇదిగో ప్రూఫ్.. మీరే లెక్కలేసుకోండి

అంతా నిజమే!..

Advertisement

కరాచీకి చెందిన ప్రముఖ జర్నలిస్ట్, ల్యారీ ప్రాంత మాజీ మేయర్ ఆరిఫ్ ఆజాకియా ‘టాక్ జర్నలిజం’ సదస్సులో సీనియర్ జర్నలిస్ట్ సౌరభ్ ద్వివేదితో మాట్లాడుతూ ఈ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ‘ధురంధర్’ సినిమాలో ఏ కాలంలో జరిగిన కథనైతే చూపించారో.. సరిగ్గా అదే సమయంలో నేను కరాచీలోని ఆ టౌన్‌కు ఎన్నికైన మేయర్‌గా ఉన్నాను. నేను ల్యారీలోనే పుట్టి పెరిగాను. కాబట్టి అక్కడ ఏం జరుగుతుందో నాకు పూర్తిగా తెలుసు. సినిమాలో చూపించిన ప్రతి అంశం వందకు వంద శాతం నిజం,” అని ఆరిఫ్ ఆజాకియా స్పష్టం చేశారు.

నా మూలాలు

ఈ సందర్భంగా ఆరిఫ్ ఆజాకియా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయాన్ని కూడా బయటపెట్టారు. తాను కరాచీలో పుట్టినప్పటికీ, తన తల్లిదండ్రులు గుజరాత్‌లోని జునాగఢ్‌లో జన్మించారని.. అందుకే తాను నన్ను ఒక పాకిస్తానీగా కాకుండా, ‘భారతీయ సంతతి’ వ్యక్తిగానే భావిస్తానని చెప్పుకొచ్చారు.

Advertisement

Read also-సూపర్‌స్టార్ కృష్ణ జయంతి.. ‘ఎప్పటికీ నువ్వే నా హీరో’ అంటూ మహేష్ ఎమోషనల్..

విమర్శలకు గట్టి సమాధానం..

ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నప్పటికీ, కొందరు విశ్లేషకులు మాత్రం దీనిపై విమర్శలు గుప్పించారు. సినిమా వాస్తవాలను పక్కన పెట్టి, కేవలం ఒక నిర్దిష్ట ఎజెండాతోనే నిర్మించారని వారు వాదించారు. అయితే, నేరుగా ల్యారీ ప్రాంతంలోనే పుట్టి, అక్కడి పరిపాలనను దగ్గరుండి చూసిన మాజీ మేయర్ ఆరిఫ్ ఆజాకియా స్వయంగా రంగంలోకి దిగి సినిమాలోని అంశాలు నిజమేనని తేల్చి చెప్పడంతో విమర్శకుల నోళ్లు మూతపడినట్లయింది.

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×