// // OG Success Meet- థమన్ బాం*చ*త్ అన్నాడు.. ఓజీ నిర్మాత -->
E-Paper
Advertisement

OG Success Meet : థమన్ బాం*చ*త్ అన్నాడు… సక్సెస్‌మీట్‌లో నిర్మాత కామెంట్

OG Success Meet : థమన్ బాం*చ*త్ అన్నాడు… సక్సెస్‌మీట్‌లో నిర్మాత కామెంట్
Advertisement

DVV Danayya About Thaman: జీ మూవీ టీం ప్రస్తుతం సక్సెస్‌ జోష్‌లో ఉంది. ప్రీమియర్స్‌తో పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకున్న ఈ చిత్రం.. ఫస్ట్‌ డే ఫస్ట్‌ షోతో హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. అంతేకాదు వసూళ్లు కూడా భారీగా తెచ్చిపెట్టింది. కేవలం ప్రీమియర్స్‌తోనే ఈ సినిమా వందకోట్ల క్లబ్‌లో చేరింది. దీంతో ఓజీ డిస్ట్రక్షన్‌ అంటూ మూవీ హిట్‌ని ప్రకటించింది మూవీ టీం. ఇక నేడు మధ్యాహ్నం మూవీ టీం సక్సెస్‌ మీట్‌ నిర్వహించింది. ఈ సందర్భంగా ప్రెస్‌ నిర్వహించి ఓజీ సక్సెస్‌ వేడుక చేసుకున్నారు. ఈ సందర్భంగా నిర్మాత డీవీవీ దానయ్య ప్రెస్‌ మీట్‌ లో మాట్లాడుతూ మూవీకి సంబంధించిన ఆసక్తికర విశేషాలను పంచుకున్నారు.

ఈ క్రిడిట్ త్రివిక్రమ్ దే

Advertisement

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అసలేం మాట్లాడాలో అర్థం కావడం లేదు. మొదట ఈ క్రెడిట్‌ అంత త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ ఇవ్వాలని. ఆయన లేకుండ ఈ సినిమా లేదు. పవన్‌తో సినిమా చేయాలని అనగానే.. సుజీత్‌ని తీసుకురండి అన్నారు. సుజీత్‌ కూడా పవన్‌కి వీరాభిమాని. దీంతో పవన్‌ కోసం స్క్రిప్ట్‌ రెడీ చేసి వినిపించారు. అలా ఓజీ మూవీ పుట్టింది. మూవీపై నమ్మకం ఉన్నా.. ఎక్కడో నాకు భయం వేసేది. ఈ సినిమా కనుగ హిట్‌ అవ్వకపోతే.. అభిమానుల నుంచి వచ్చే ప్రెషర్‌ని ఎలా తట్టుకోవాలని భయమేసింది. ఆ భయంతో ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను. అందుకే తరచూ మా తమ్ముడు తమన్‌తో అంటుండేవాడిని. తమ్ముడు నువ్వే చూసుకో.. ఎలాగైన బ్లాక్‌బస్టర్‌ కొట్లాలి తమ్ముడు అనేవాడిని.

బాం*చ*త్‌ అన్నాడు

ఆయన అన్న నువ్వు గుండెల మీద చేయి వేసుకో.. బ్లాక్‌బస్టర్‌ కొడుతున్నామని ధైర్యం చెప్పేవాడు. అయినా నాకు నిద్ర పట్టేది కాదు. రిలీజ్‌కి ముందు కూడా బాం*చ*త్‌ హిట్‌ కొడుతున్నాం. కాలర్‌ ఎగిరేసుకో అన్నా అన్నాడు. తమ్ముడు చెప్పినట్టుగానే ఓజీ సూపర్‌ హిట్‌ కొట్టాం. థియేటర్లలో ఫ్యాన్స్‌ కేరింతలు, అరుపులు చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఓజీ మూవీ ఫలితం ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. ప్రతిఒక్కరికి ధన్యవాదాలు అంటూ చెప్పుకొచ్చాడు నిర్మాత దానయ్య. నిజానికి ప్రకటనతోనే ఓజీ మూవీపై భారీ హైప్‌ పెరిగింది. సుజీత్‌ దర్శకత్వంలో సినిమా అనగానే.. మూవీ అంచనాలు నెలకొన్నాయి. ఇక మూవీ నుంచి వచ్చి ప్రచార పోస్టర్స్‌, టీజర్‌, ట్రైలర్‌ మంచి బజ్‌ క్రియేట్‌ చేశాయి.

Advertisement

Also Read: OG Movie: హైకోర్టులో ఓజీ టీంకి స్వల్ప ఊరట

అదే బజ్‌.. థియేటర్‌లోనూ వినిపించింది. సెప్టెంబర్ 25న విడుదల ఉండగా.. ముందు రోజను రాత్రి 10 గంటలకు ప్రీమియర్‌ షోలు పడ్డాయి. ఓజీ ప్రీమియర్స్‌ సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో పండగ వాతావరణం నెలకొంది. ఇక థియేటర్లన్ని హౌజ్ ఫుల్‌తో కళకళ లాడాయి. తెలుగు సినీ చరిత్రలో ఎన్నడు లేని విధంగా అత్యధిక ప్రీమియర్స్‌ షోలతో ఓజీ ఆల్‌ టైం రికార్డు కొట్టింది. ఒక్క నిజాంలోనే ఈ మూవీ సుమారు 366కుపైగా థియేటర్లలో ప్రీమియర్‌ షోలు ప్రదర్శించడం విశేషం. అలా భారీ స్థాయిలో రెండు తెలుగు రాష్ట్రాలు, ఓవర్సిస్‌లో ఓజీ ప్రీమియర్స్‌ షోలను ప్రదర్శించారు. ఒక్క నార్త్‌ అమెరికాలోనే ఓజీ ప్రీమియర్స్‌ తో మూవీ 3 మిలియన్ల డాలర్లు రాబట్టింది. అంటే ఇండియన్‌ కరెన్సీలో సుమారు రూ. 26 కోట్లు. ఈ మేరకు వరల్డ్ వైడ్‌ చూస్తే ఓజీ కలెక్షన్స్‌ రూ. 160 కోట్లకు పైగా కలెక్షన్స్‌ చేసే అవకాశం ఉందని ట్రేడ్‌ పండితులు అంచన వేస్తున్నారు.

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×