// // OG Movie - కొంప ముంచేశారు కదరా... ప్రీమియర్స్ క్యాన్సిల్ -->
E-Paper
Advertisement

OG Movie : కొంప ముంచేశారు కదరా… ప్రీమియర్స్ క్యాన్సిల్

OG Movie : కొంప ముంచేశారు కదరా… ప్రీమియర్స్ క్యాన్సిల్
Advertisement

OG Premieres Cancelled: ఓజీ మూవీ రిలీజ్‌ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌కి బిగ్‌ షాక్‌ తగిలింది. మూవీ ప్రీమియర్స్‌ క్యాన్సిల్‌ అంటూ తరచూ అప్డేట్స్ వస్తున్నాయి, ప్రస్తుతం ఓవర్సిస్ ఓజీ ప్రీమియర్స్ పడటమే కష్టమే అన్నట్టు ఉంది పరిస్థితులు. దీనికి కారణం కంటెంట్ ఆలస్యం. అగ్ర హీరో సినిమా రిలీజ్ అంటే.. ప్రీమియర్స్‌ తప్పనిసరి. రిలీజ్‌కి ముందు రోజే ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో ప్రీమియర్స్‌ షోలు పడాల్సిందే. లేదంటే అభిమానుల చేసే రచ్చ అంత ఇంత కాదు. ఇక ఈ మధ్య కాలంలో ఓవర్సిస్‌లోనూ తెలుగు సినిమా క్రేజ్ విపరీతంగా పెరిగింది. ముఖ్యంగా స్టార్‌ హీరో సినిమాల రిలీజ్‌ సందడి నెల రోజుల ముందు నుంచే కనిపిస్తోంది. సినిమా ప్రీమియర్స్ అంటే ఫ్యాన్స్‌కి పండగే. కానీ, ఓజీ మూవీ ప్రీమియర్స్ క్యాన్సిల్ అవుతుండటంతో మూవీ టీంపై విపరీతమైన నెగిటివిటీ వస్తుంది.

దీనికి కారణం మూవీ టీం, మేకర్సే. సినిమా ప్రమోషన్స్‌ మీద ఉన్న శ్రద్ద.. అవుట్‌ పుట్‌ ఇవ్వడంలో పెట్టడం లేదా అనిపిస్తోంది. ఎందుకంటే సినిమాకు ఇంకా రెండు రోజులు రిలీజ్‌ అనగా.. ఓవర్సిస్‌లో ఓజీ ప్రీమియర్స్‌ క్యాన్సిల్‌ అయిన సంగతి తెలిసిందే. సాహో ఫేం సుజిత్‌ దర్శకత్వంలో పాన్‌ ఇండియా స్థాయిలో ఓజీ మూవీ తెరకెక్కింది. సినిమా కూడా తెలుగుతో పాటు హిందీ, తెలుగు, తమిళ్‌, కన్నడ, మలయాళ భాషల్లో వరల్డ్‌ వైడ్‌గా విడుదల చేస్తున్నారు. అన్ని భాషల్లో మూవీ ప్రీమియర్స్‌కి కూడా అనుమతులు వచ్చాయి. రిలీజ్‌ ముందు రోజు రాత్రి భారీ స్థాయిలో ఓజీ ప్రీమియర్స్‌ పడనున్నాయి. ఇక ప్రీమియర్స్‌లో రచ్చ రచ్చ చేసేందుకు ఫ్యాన్స్ అంత ఉత్సాహంగా ఎదురుచూస్తున్న తరుణంలో ఓజీ ప్రిమియర్స్‌ క్యాన్సిల్‌ అంటూ ఓవర్సిస్‌ డిస్ట్రిబ్యూషన్‌ సంస్థ సీజన్స్‌ క్రియేషన్స్‌ ప్రకటించి షాకిచ్చింది. నార్త్‌ అమెరికాలో తమిళ్‌ వెర్షన్స్‌కి సంబంధించిన ఓజీ ప్రిమియర్స్‌ రద్దు చేశారు.

కంటెంట్‌ ఆలస్యమే..

Advertisement

దీనికి కారణం కంటెంట్‌ ఆలస్యమే అని సదరు డిస్ట్రిబ్యూషన్‌ సంస్థ వెల్లడించింది. దీంతో మూవీ టీం సోషల్‌ మీడియాలో నెగిటివిటీ వస్తోంది. అదేంటి.. మూవీ రిలీజ్‌ కి ఇంకా కొన్ని గంటలే ఉంది.. ఇంకా కంటెంట్‌ రాకపోవడమేంటని షాక్‌ అవుతున్నారు. ఇదంత మూవీ నిర్మాతల అలసత్వమే కారణమని ఓజీ నిర్మాతలు, దర్శకుడిపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. మొదటి నుంచి ఓజీ విషయంలో వాయిదాలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. షూటింగ్‌ నుంచి మూవీ అప్‌డేట్స్‌ వరకు తరచూ వాయిదా వేస్తూ వస్తున్నాయి. నిన్నటి నిన్నటి నిన్న.. ఓజీ ట్రైలర్‌ విషయంలో ఆలస్యమే చేశారు. సెప్టెంబర్‌ 21న ఉదయం.. పదకొండల లోపు ఓజీ ట్రైలర్‌ రిలీజ్‌ చేస్తామన్నారు. కానీ, అది జరగలేదు. కనీసం ఆ రోజను జరిగే ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో అయిన విడుదల చేస్తారని ఫ్యాన్స్‌ ఆశగా ఎదురుచూశారు.

Also Read: Mirai Movie: మిరాయ్‌కి వైబ్‌ వచ్చేసింది.. ఈ రోజు నుంచి సినిమాల్లో ఈ పాట కూడా..

Advertisement

నిన్న ట్రైలర్‌, ఇప్పుడు ప్రీమియర్స్..

కానీ, చేయలేదు. ఈవెంట్‌లో ట్రైలర్‌ని ప్రదర్శించిన మమ అనిపించారు. కనీసం ట్రైలర్‌ పోస్ట్‌పోన్‌ అనే అప్‌డేట్‌ కూడా ఇవ్వకుండ నిర్లక్ష్యంగా వ్యవహరించారు. చెప్పపెట్టుకుండ నెక్ట్స్‌ డే(సెప్టెంబర్‌ 22) మధ్యాహన్నం ట్రైలర్‌ని సైలెంట్‌గా విడుదల చేశారు. ఇప్పటికే ఈ విషయమై ఆడియన్స్‌, ఫ్యాన్స్‌ మూవీ టీంపై తీవ్ర అసహనంతో ఉన్నారు. ఇప్పుడు కంటెంట్‌ ఆలస్యంగా నార్త్‌ అమెరికాలో తమిళ వెర్షన్‌ ప్రీమియర్స్‌ ఆలస్యం అయ్యాయి. దీంతో నార్త్‌ అమెరికా ప్రేక్షకులు ఓజీ టీంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. సినిమా ప్రమోషన్స్‌ మీద ఉన్న ఆసక్తి.. మూవీ అవుట్‌పుట్‌ లేదా? మిమ్మల్ని నమ్ముకున్న డిస్ట్రిబ్యూటర్స్‌పై కనీస బాధ్యత లేదా? అంటున్నారు. నమ్ముకున్న వారిని ఇలా సగంలోనే ముంచుతారా? ఈ విషయంలో ఓజీ టీం తీరు అసలు సహించరానిదంటున్నారు.

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×