// // OG Collections - OG అరుదైన రికార్డు.. 11 రోజుల్లోనే.. -->
E-Paper
Advertisement

OG Collections: OG అరుదైన రికార్డు.. 11 రోజుల్లో ఎన్ని కోట్లు వసూళ్లు చేసిందంటే!

OG Collections: OG అరుదైన రికార్డు.. 11 రోజుల్లో ఎన్ని కోట్లు వసూళ్లు చేసిందంటే!
Advertisement

OG Movie Collections: పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్, దర్శకుడు సుజీత్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘ఓజీ‘ బాక్సాఫీసు వద్ద సంచలనం సృష్టిస్తోంది. ఎన్నో అంచనాల మధ్య సెప్టెంబర్‌ 25న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద వసూళ్లు ఊచకోత చూపిస్తోంది. రిలీజ్‌కు ముందు విపరీతమైన బజ్‌ క్రియేట్‌ చేసిన ఈ చిత్రం విడుదల తర్వాత అంచనాలను మించి రెస్పాన్స్‌ అందుకుంది. ప్రీమియర్స్‌తో ఓజీ రికార్డు బ్రేక్‌ చేసింది. తొలి రోజు రూ. 154 కోట్ల గ్రాస్‌ కలెక్షన్స్‌తో భారీ ఓపెనింగ్‌ ఇచ్చిన ఈ చిత్రం ఇప్పటికీ బాక్సాఫీసు వద్ద అదే జోరు చూపిస్తోంది. రోజురోజుకు ఓజీ కలెక్షన్స్‌ సర్‌ప్రైజ్‌ చేస్తోంది.

వెంకీమామ మూవీ రికార్డు బ్రేక్..

Advertisement

తొలి రోజు రూ. 154 కోట్లు వసూళ్లు చేసిన ఓజీ మూడు రోజుల్లోనే రూ. 200 కోట్ల క్లబ్‌లో చేరింది. నాలుగో రోజు వీకెండ్‌లో ఓజీ రూ. 252 కోట్లు చేసినట్టు మూవీ మేకర్స్‌ ప్రకటించారు. ఆ తర్వాత ఓజీ క్రేజ్ గురించి వరుస పోస్ట్స్‌ చేస్తున్న నిర్మాణ సంస్థ.. ఇప్పటి వరకు కలెక్షన్లను ప్రకటించలేదు. తాజాగా ఓజీ అరుదైన రికార్డు నెలకొల్పింది అంటూ మేకర్స్ ప్రకటన ఇచ్చారు. పదకొండు రోజుల్లో వరల్డ్ వైడ్ గా రూ. 308 కోట్ల గ్రాస్‌ చేసినట్టు అధికారికంగా ప్రకటించారు. దీంతో 2025లో హాయ్యేస్ట్‌ గ్రాస్‌ సాధించిన తొలి తెలుగు చిత్రంగా ఓజీ నిలిచింది అంటూ మూవీ టీం ప్రకటించింది. ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన అనిల్ రావిపూడి, వెంకటేష్ ల ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ రూ. 303 కోట్ల గ్రాస్‌ వసూళ్లు చేసింది.

దీనికి ఓజీ 11 రోజుల్లోనే అధిగమించింది. ఇప్పటికీ ఈ చిత్రం థియేటర్లలో సక్సెస్‌ ఫుల్‌గా రన్‌ అవుతుంది. విడుదలకు ముందు ఓజీ మూవీకి ఉన్న హైప్‌కి భిన్నంగా వసూళ్లు వచ్చాయి. టాక్‌కి, మేకర్స్‌ ప్రకటిస్తున్న కలెక్షన్స్‌ సంబంధం లేనట్టు ఉన్నాయని ట్రేడ్‌ పండితులు అభిప్రాయపడుతున్నారు. ఏదేమైన ఓజీ చిత్రంలో పవన్‌ కెరీర్‌లో ఇప్పటి వరకు లేని మైలుస్టోరీ వచ్చి చేరింది. ఆయన సీని కెరీర్‌లో పవన్‌ కళ్యాణ్‌ కెరీర్‌ ఇప్పటి వరకు వంద కోట్ల సినిమా లేదు. ఆ లోటు ఓజీతో నెరవేరింది. అంతేకాదు పవన్‌ కెరీర్‌లోనే ఓజీ మైలు రాయిగా నిలిచింది. దీంతో మూవీ సక్సెస్‌ విషయంలో పవన్‌ కళ్యాణ్‌, ఇటూ పవర్‌ స్టార్‌ ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుష్‌లో ఉన్నారు.

ఓజీ సక్సెస్ సెలబ్రేషన్స్

Advertisement

ప్రస్తుతం ఓజీ టీం మూవీ సక్సెస్‌ సెలబ్రేషన్స్‌తో బిజీగా ఉంది. ఇదిలా ఉంటే గ్యాంగ్‌స్టర్‌ నేపథ్యంలో పీయారిడికల్‌ యాక్షన్‌ డ్రామా తెరకెక్కిన ఈ చిత్రంలో పవన్‌ లుక్‌కి ఆడియన్స్‌, ఫ్యాన్స్‌ ఫిదా అవుతున్నారు. ఇందులో వింటేజ్‌ పవన్‌ని చూశామంటూ అభిమానులంత మురిసిపోతున్నారు. కోలీవుడ్ బ్యూటీ ప్రియాంక మోహన్‌ ఆరుళ్‌ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో బాలీవుడ్‌ నటుడు ఇమ్రాన్‌ హష్మీ విలన్‌గా నటించాడు. ఈ సినిమాతోనే అతడు టాలీవుడ్‌ ఎంట్రీ ఇవ్వడం విశేషం. ప్రకాశ్ రాజ్‌, శ్రియా రెడ్డి, అర్జున్‌ దాస్‌ వంటి పలువురు నటీనటులు కీలక పాత్రలు పోషించారు.

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×