E-Paper
Advertisement

మే 20న బాక్సాఫీస్ షేక్ అవ్వాల్సిందే.. ఎన్టీఆర్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా!

మే 20న బాక్సాఫీస్ షేక్ అవ్వాల్సిందే.. ఎన్టీఆర్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా!
Advertisement

NTR Neel : తారక్ ..నీల్ ..ఈ కాంబోలో సినిమా మొదలవుతుంది అనగానే మురిసిపోయింది టాలీవుడ్.ముఖ్యంగా ‘కేజీఎఫ్’ సిరీస్, ‘సలార్’ వంటి చిత్రాలతో ఇండియన్ సినిమాను ఊపేసిన ఈ  సెన్సేషనల్ డైరెక్టర్ ఎన్టీఆర్‌ను ఏ రేంజ్‌లో వెండితెరపై ఎలా చూపిస్తాడా అన్న క్యూరియాసిటీ అందరిలో కనిపిస్తుంది.ఈ క్రమంలో తాజాగా ఈ సినిమా నుంచి ఒక సాలిడ్ అప్‌డేట్ బయటకు వచ్చి నెట్టింటిని  షేక్ చేస్తోంది.అదే సముద్ర తీరాన ఎన్టీఆర్ మరియు ప్రశాంత్ నీల్ నిలబడి ఉన్న ఒక పవర్‌ఫుల్ పోస్టర్‌.

నీకు విజన్ తెలుసు.. నాకు తుఫాను తెలుసు

Advertisement

అయితే ఈ పోస్టర్‌లో అందరి దృష్టిని ఆకర్షించింది మాత్రం అందులోని మార్చిన ట్యాగ్‌లైన్. గతంలో “You know the business and I know the chemistry” అని ఉన్న లైన్ ని  మార్చి, ఇప్పుడు “You know the vision.. and I know the storm” (నీకు విజన్ తెలుసు.. నాకు తుఫాను తెలుసు) అని  రాసుకొచ్చారు.ఈ ఒక్క లైనే  సినిమాలోని ఇంటెన్సిటీని, ప్రశాంత్ నీల్ మార్క్ ఎలివేషన్లను స్పష్టం చేస్తోంది. దీంతోతుఫాను వచ్చే ముందు సైలెన్స్ లా ఈ సినిమా ఉండబోతుందని,సిల్వర్ స్క్రీన్ పై తారక్ విశ్వరూపాన్ని చూడబోతున్నామని ఫిక్స్ అయిపోయారు ఫ్యాన్స్

also read :రేయ్.. బెంగళూరు వచ్చేయ్! రజనీ వార్నింగ్‌కు మోహన్ బాబు అదిరిపోయే కౌంటర్..

Advertisement

నీల్ సినిమా కూడా సముద్ర నేపథ్యంలో?

ఇక ఈ చిత్రంపై అంచనాలు పెరగడానికి మరో ప్రధాన కారణం ప్రశాంత్ నీల్ హిస్టరీ. ‘కేజీఎఫ్’తో రాకీ భాయ్‌ను, ‘సలార్’తో ప్రభాస్‌ను ఊహించని మాస్ యాంగిల్‌లో చూపించిన నీల్, మరి ఎన్టీఆర్‌ను ఎలా చూపిస్తారో అన్న క్యూరియాసిటీ తారక్ ఫ్యాన్స్‌లో పీక్స్ లో ఉంది.అయితే  ఎన్టీఆర్ గత చిత్రం ‘దేవర’ సముద్రం బ్యాక్ డ్రాప్ లో నడిచిన సంగతి తెల్సిందే.ఇక వచ్చిన  పోస్టర్ చూస్తుంటే నీల్ సినిమా కూడా సముద్ర నేపథ్యంలో సాగుతుందా అన్న డౌట్స్ రైజ్ అవుతున్నాయ్.

ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని అప్‌డేట్స్

మరోవైపు, ఎన్టీఆర్ పుట్టినరోజు సందడి మే 20న స్టార్ట్ అవబోతుంది.. ఆ రోజున ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని  అప్‌డేట్స్ రాబోతున్నాయి. సమాచారం ప్రకారం, సినిమా టైటిల్‌తో పాటు ఒక సాలిడ్ ఫస్ట్ గ్లింప్స్‌ను విడుదల చేయడానికి చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది. ఈ ప్రాజెక్టులో కన్నడ సెన్సేషన్ రుక్మిణి వాసంత్ హీరోయిన్‌గా నటిస్తుండగా, ప్రశాంత్ నీల్ ఆస్థాన సంగీత దర్శకుడు రవి బస్రూర్ మ్యూజిక్ అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ పాన్ ఇండియా చిత్రం జూన్ 11, 2027న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. మొత్తానికి “తుఫాను” మొదలైపోయింది, ఇక థియేటర్లలో బాక్సాఫీస్ ఏ మేరకి బద్దలవుతుందో చూడాలి !

also read :హీరోగా ఓకే.. మరి నిర్మాతగా? రెంటల్ సిస్టమ్ వివాదంలో కిరణ్ అబ్బవరం షాకింగ్ ఆన్సర్

 

Tags

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×