E-Paper
Advertisement

ప్రశాంత్ నీల్ సెట్స్ నుండి క్రేజీ లీక్… ‘డ్రాగన్’ యాక్షన్ విజువల్స్ వైరల్!

ప్రశాంత్ నీల్ సెట్స్ నుండి క్రేజీ లీక్… ‘డ్రాగన్’ యాక్షన్ విజువల్స్ వైరల్!
Advertisement

Dragon Movie : నీల్ – తారక్ కాంబోలో వస్తున్న బిగ్గెస్ట్ యాక్షన్ ఎపిక్ డ్రాగన్ (అభిమానులు పిలుచుకుంటున్న పేరు)పై అంచనాలు ఏ రేంజ్‌లో ఉన్నాయో స్పెషల్‌గా చెప్పక్కర్లేదు. ఇక తారక్ కెరీర్‌లో 31వ సినిమాగా వస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ నుంచి లేటెస్ట్‌గా వచ్చిన రెండు సెన్సేషన్ అప్‌డేట్స్ ఇప్పుడు మీడియాలో హైలెట్ అవుతున్నాయి. వీటిలో ఒకటి మేకర్స్ ఇచ్చిన అఫీషియల్ అప్‌డేట్ అయితే, రెండోది సెట్స్ నుంచి లీక్ అయిన షాకింగ్ విజువల్స్!

 జూన్ 11న బాక్సాఫీస్ ఊచకోత!

Advertisement

తారక్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది జూన్ 11న వరల్డ్ వైడ్‌గా రిలీజ్ అవుతుందని తారక్ స్వయంగా ట్విట్టర్‌లో షాడో లుక్ పోస్టర్ పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇదే కాకుండా తారక్ బర్త్‌డే రోజు మూవీ నుంచి సాలిడ్ గ్లింప్స్ ఉంటుందని మేకర్స్ అఫీషియల్‌గా అనౌన్స్ చేయడంతో మురిసిపోయారు తారక్ ఫ్యాన్స్.

సెట్స్ నుంచి విజువల్స్ లీక్.. 

Advertisement

ఇక ఒకవైపు మూవీ నుంచి ఇలా అప్‌డేట్స్ వస్తుండగానే మరోవైపు ఈ సినిమా సెట్స్ నుంచి లీకైన ఒక క్రేజీ పిక్ నెట్టింట తెగ వైరల్ అయిపోయింది. యస్.. శాంటో అనే విదేశీ బాడీబిల్డర్ మరియు యాక్షన్ ఆర్టిస్ట్ సెట్స్ నుంచి వదిలిన ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఇక వీరితో పాటు ఇందులో డైరెక్టర్ నీల్ కూడా ఉండటం విశేషం.

ముఖ్యంగా ఇందులో వాళ్ల చేతుల్లో గన్స్‌తో పాటు సిక్స్‌ప్యాక్ బాడీతో కనిపించడం చూస్తే, నీల్ బాడీబిల్డర్స్‌తో తారక్ కోసం ఒక సాలిడ్ ‘యాక్షన్ ఫీస్ట్’ నే సిద్ధం చేసినట్టు కనిపిస్తోంది. ఇక ఇప్పటికే తారక్ స్లీక్ జిమ్ బాడీతో నెట్టింటిని షేక్ చేసేశాడు కూడా.

ఇంటర్నేషనల్ స్టాండర్డ్ యాక్షన్ డ్రామా

పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ కలిసి నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ‘కేజీఎఫ్’, ‘సలార్’ చిత్రాలకు సాలిడ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇచ్చిన రవి బస్రూర్ ఈ సినిమాకు కూడా సంగీతం అందిస్తుండటం, హీరోయిన్‌గా కన్నడ క్రష్ రుక్మిణి వసంత్ నటిస్తుండటం ఈ ప్రాజెక్ట్‌ను మరో లెవల్‌లో నిలబెట్టేవే.

ఏది ఏమైనా సెట్స్ నుంచి లీక్ అయిన ఫోటోలలో భారీ సెట్టింగ్స్, మోడ్రన్ వెపన్స్ కనిపించడం చూస్తుంటే ఇది కేవలం మాస్ సినిమా మాత్రమే కాదు, ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ యాక్షన్ డ్రామా అని క్లారిటీ వచ్చేస్తుంది.

చూడాలి మరి వచ్చే ఏడాది జూన్ 11న థియేటర్లలోకి రానున్న ఈ సినిమా నుంచి  తారక్ బర్త్ డే రోజున (మే  20) ఎలాంటి క్రేజీ గ్లింప్స్ రివీల్ కానుందో!

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×