E-Paper
Advertisement

ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ప్రశాంత్ నీళ్ డ్రాగన్ మూవీ రిలీజ్ డేట్ లాక్!

ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ప్రశాంత్ నీళ్ డ్రాగన్ మూవీ రిలీజ్ డేట్ లాక్!
Advertisement

NTR -Neel:రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో వచ్చిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో ఏకంగా పాన్ వరల్డ్ హీరోగా పేరు సొంతం చేసుకున్న ఎన్టీఆర్ (NTR) జపాన్ లో ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ అందుకున్నారు. ఆ తర్వాత చేసిన చిత్రం దేవర. కొరటాల శివ (Koratala Siva) దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మొదట మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ.. కాలక్రమేనా రూ. 500 కోట్ల క్లబ్లో చేరి మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ నుండి వస్తున్న చిత్రం డ్రాగన్.. ఇది కేవలం వర్కింగ్ టైటిల్ మాత్రమే. ఇప్పటివరకు ఈ సినిమా అసలు టైటిల్ ని మేకర్స్ రిలీజ్ చేయలేదు. ఈ చిత్రానికి కేజీఎఫ్ , సలార్ చిత్రాలతో సంచలనం సృష్టించిన ప్రముఖ డైరెక్టర్ ప్రశాంత్ నీళ్ (Prashanth Neel ) దర్శకత్వం వహిస్తున్నారు. మాస్ యాక్షన్ గా వస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగు శరవేగంతో జరుగుతోంది. అయితే ఇలాంటి సమయంలో ఈ సినిమా షూటింగ్ రద్దయింది అంటూ కొన్ని వార్తలు వ్యాపించాయి. అటు అభిమానులు కూడా గందరగోళానికి గురవడంతో.. అది నిజం కాదని, ప్రస్తుతం షూటింగ్ కొనసాగుతుందని నిర్మాతలు కూడా స్పష్టం చేశారు. పైగా దీనిని నిజం చేస్తూ ఎన్టీఆర్ వర్కౌట్స్ కి సంబంధించిన ఒక ఫోటోని కూడా విడుదల చేశారు.

డ్రాగన్ మూవీ రిలీజ్ డేట్ లాక్..

ముఖ్యంగా ఈరోజు ఉదయం ప్రొడక్షన్ యూనిట్ జిమ్లో వర్కౌట్స్ చేస్తున్న ఎన్టీఆర్ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసింది. కండలు తిరిగిన శరీరంతో ఎన్టీఆర్ కనిపించారు. ఆయన వీపు మాత్రమే కనిపించేలా తీసిన ఫోటో ఇది. ముఖ్యంగా హెర్కులెస్ లా మెలికలు తిరిగిన కండలను ప్రదర్శించాడు ఎన్టీఆర్. ఇకపోతే ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది ఓకే ఎప్పుడు విడుదల చేస్తారు అంటూ అభిమానులు కూడా గత కొంతకాలంగా ప్రశ్నిస్తున్న నేపథ్యంలో తాజాగా మేకర్స్ అన్నింటికీ చెక్ పెట్టింది. ఈ మేరకు ఈ సినిమా విడుదల తేదీని ట్విట్టర్ వేదికగా పంచుకుంది. 2027 జూన్ 11న ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇందుకు సంబంధించిన ఒక పోస్టర్ ను అటు ఎన్టీఆర్ కూడా తన ఎక్స్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. గుబురు గడ్డంతో ఉన్న ఆకారంతో బ్లాక్ షేడ్ లో కనిపించాడు ఎన్టీఆర్. ఈ గెటప్ దాదాపుగా దేవరను పోలి ఉన్నట్టు కనిపిస్తోంది. మొత్తానికైతే ప్రశాంత్ నీళ్ కాంబినేషన్లో ఎన్టీఆర్ చేస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది జూన్లో రాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. టి సిరీస్ సమర్పణలో భూషణ్ కుమార్ నిర్మిస్తున్నారు.

Advertisement

ALSO READ:Rajinikanth: రెమ్యూనరేషన్ విషయంలో రజనీకాంత్ కొత్త పంథా.. అందరికీ ఆదర్శం!

ఎన్టీఆర్ తదుపరి చిత్రాలు..

ఎన్టీఆర్ తదుపరి సినిమాల విషయానికొస్తే.. మరోవైపు కొరటాల శివ దర్శకత్వంలో దేవర 2 లో కూడా ఆయన నటించబోతున్నారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభం కాబోతోంది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా ఈ ఏడాది చివరి నాటికి షూటింగ్ ప్రారంభం కానున్నట్లు సమాచారం . ఏది ఏమైనా ఎన్టీఆర్ ఇప్పుడు వరుస సినిమాలతో మాస్ ఆడియన్స్ ను తన యాక్షన్ పర్ఫామెన్స్ తో అదరగొట్టడానికి సిద్ధం అయ్యారు.

Advertisement

 

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×