E-Paper
Advertisement

NTR Movies: ఏంటీ …షూటింగ్ మొదలై రిలీజ్ అయ్యేసరికి 32 ఏళ్ళా?

NTR Movies: ఏంటీ …షూటింగ్ మొదలై రిలీజ్ అయ్యేసరికి 32 ఏళ్ళా?
Advertisement

NTR Movies: ఈ రోజుల్లో ఒక సినిమా టీజర్ లేట్ అయితేనే మనం సోషల్ మీడియాలో రచ్చ చేస్తాం. కానీ లెజెండరీ ఎన్టీఆర్ కాలంలో కొన్ని సినిమాలు రిలీజ్ అవ్వడానికి పట్టిన టైమ్ తెలిస్తే మీ మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే! యస్ .. ఒక్కో సినిమా వెనుక ఒక్కో ‘ఎపిక్ ఫెయిల్’ స్టోరీ ఉంది మరి . పాత కాలపు టెక్నాలజీ, ఫైనాన్షియల్ క్రైసిస్ మధ్య ఆ మూడు సినిమాలు థియేటర్లకి రావడానికి ఏకంగా 32 ఏళ్ళు పట్టిందంటే అది మామూలు విషయం కాదు. ఒకసారి ఆ మూడు సినిమాలేంటో చూస్తే..

 లవకుశ (1963).. 5 ఏళ్ళ వనవాసం.. 

Advertisement

1958లో మొదలైన ఈ సినిమా తెలుగులో ఫస్ట్ కలర్ మైథాలజీ మూవీ. కానీ మేకింగ్‌లో ఉన్న అడ్డంకులు అన్నీ ఇన్నీ కావు. షూటింగ్ మధ్యలో ఆగిపోవడం వల్ల అందులో యాక్ట్ చేసిన పిల్లలు (లవకుశులు) పెరిగి పెద్దయ్యారు.ఒకసారి ఇమాజిన్ చేసుకోండి.. ఒక సీన్‌లో చిన్నగా ఉన్న కిడ్స్, నెక్స్ట్ సీన్‌లో సడన్ గా హైట్ పెరిగితే ఎలా ఉంటుంది? కానీ అప్పట్లో సినిమాటోగ్రాఫర్ తన స్కిల్స్‌తో ఆ ‘గ్లిచ్’ని కవర్ చేసేశారు. ఇక చివరకు దర్శకుడు సి.పుల్లయ్య ఆరోగ్యం దెబ్బతినడంతో ఆయన కుమారుడు సినిమాను పూర్తి చేశారు.చివరికి 5 ఏళ్ళ వెయిటింగ్ తర్వాత 1963లో రిలీజై బాక్సాఫీస్ దగ్గర సునామీ సృష్టించింది.కానీ, ఆ ఐదేళ్ల కష్టం నిర్మాతకు నరకం చూపించింది.

ఎర్రకోట వీరుడు (1973).. 18 ఏళ్ళ వెయిటింగ్.. 

Advertisement

ఇది అల్టిమేట్ లెవల్. 1955లో మొదలైన ఈ సినిమా 18 ఏళ్ళ పాటు ల్యాబ్‌లో ‘చిల్’ అయ్యింది. ఎలాగోలా 1973లో రిలీజ్ కి రెడీ చేశారు. అప్పటికి ఎన్టీఆర్ ఇమేజ్ పీక్స్‌లో ఉంది. కానీ చిన్న ప్రాబ్లం.. 18 ఏళ్ళ క్రితం నాటి సినిమా కావడంతో ఎన్టీఆర్ డబ్బింగ్ చెప్పలేదు. వేరే వాళ్ళతో వాయిస్ ఇప్పించారు. థియేటర్లో ఎన్టీఆర్ ఎంట్రీకి విజిల్స్ వేసిన ఫ్యాన్స్, ఆయన వాయిస్ వినగానే ‘ఏంటి ఇది?’ అని షాక్ అయ్యారు. ఆ ఒక్క డబ్బింగ్ మిస్టేక్ వల్ల సినిమా ‘ఫ్లాప్’ లిస్ట్ లోకి వెళ్ళిపోయింది.

ఎవరు దేవుడు (1981).. 9 ఏళ్ళ తర్వాత ‘రాంగ్ టైమింగ్’ 

ఈ సినిమా స్టోరీ మరీ సాడ్. 1972లో ఎన్టీఆర్-జమున జంటగా స్టార్ట్ అయ్యింది. కానీ మేకర్స్ చనిపోవడం, ఫైనాన్స్ లేకపోవడంతో 9 ఏళ్ళు ల్యాబ్‌లోనే ఉండిపోయింది. కానీ 10 రీళ్లు షూటింగ్ అయ్యాక నిర్మాత వాసుదేవ మీనన్ చనిపోవడంతో సినిమా అటకెక్కింది. 5 ఏళ్ల తర్వాత ఆయన కుమారులు ఎన్టీఆర్‌ను వేడుకోవడంతో, ఆయన మళ్ళీ డేట్స్ ఇచ్చారు.చివరకు ఎలాగోలా 1981లో అంటే 9 ఏళ్ల తర్వాత  రిలీజ్ చేసేసరికి సీన్ రివర్స్ అయ్యింది. అప్పటికే ఎన్టీఆర్ ‘అడవి రాముడు’ లాంటి సినిమాలతో ఫుల్ మాస్ మోడ్‌లో ఉన్నారు. ఆడియన్స్ ఆయన నుంచి ఫైట్లు, స్టెప్పులు ఆశిస్తుంటే.. ఆయన సాఫ్ట్ రోల్‌లో కనిపించడంతో సినిమా డిజాస్టర్ అయ్యింది.నిర్మాతలు ఎన్ని ఇబ్బందులు పడినా, హీరోలు ఎంత సహకరించినా ‘టైమింగ్’ కుదరకపోతే సినిమా ఫలితం ఎలా ఉంటుందో ఎన్టీఆర్ నటించిన ఈ మూడు సినిమాలు నిరూపించాయి.అలా  ఈ మూడు సినిమాల నిర్మాణ కాలాన్ని కలిపితే (5+18+9) ఏకంగా 32 ఏళ్లు కావడం విశేషం! ఏది ఏమైనా అప్పట్లో ఎన్టీఆర్  తన నిర్మాతల కోసం దశాబ్దాల తర్వాత కూడా సహకరించడం అంటే అది మామూలు విషయం కాదు. సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా, ఆ ‘కమిట్‌మెంట్’ మాత్రం నెక్స్ట్ లెవల్!

also read :Nithiin: అరడజను ఫ్లాపులైనా అలుపు రావట్లేదా నితిన్?

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×