E-Paper
Advertisement

Nora Fatehi: ఐటమ్ సాంగ్ పై సినిమా వర్కర్లే కేసు వేశారా?.. ఇదేం విడ్డూరం..

Nora Fatehi: ఐటమ్ సాంగ్ పై సినిమా వర్కర్లే కేసు వేశారా?.. ఇదేం విడ్డూరం..
Advertisement

Nora Fatehi: బాలీవుడ్ డ్యాన్సింగ్ క్వీన్ నోరా ఫతేహి నటించిన తాజా సాంగ్ “సర్కే చునర్ తేరీ సర్కే” (Sarke Chunar Teri Sarke) తీవ్ర వివాదంలో చిక్కుకుంది. ఈ పాటలో అశ్లీలత ఎక్కువగా ఉందంటూ ‘ఆల్ ఇండియన్ సినీ వర్కర్స్ అసోసియేషన్’ (AICWA) మండిపడింది. ఈ మేరకు చిత్ర నిర్మాతలు, క్రియేటర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సంచలన ప్రకటన విడుదల చేసింది. న్-ఇండియా చిత్రం ‘KD: ది డెవిల్’ లోని ఈ ప్రత్యేక గీతం విడుదలైనప్పటి నుండి విమర్శలు ఎదుర్కొంటోంది. ఈ పాటలోని సాహిత్యం, నోరా ఫతేహి హావభావాలు ద్వంద్వార్థాలతో (Double Meaning) కూడి ఉన్నాయని, ఇది భారతీయ సంస్కృతిని కించపరిచేలా ఉందని AICWA ఆరోపించింది. యువతపై ఇలాంటి పాటలు ప్రతికూల ప్రభావం చూపుతాయని అసోసియేషన్ ఆందోళన వ్యక్తం చేసింది.

Read also-Comedy Movie OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న మరాఠి హిట్ మూవీ… పొట్ట చెక్కలయ్యే అత్తా కోడళ్ళ కామెడీ… ఎప్పుడు ఎక్కడ స్ట్రీమింగ్ అంటే?

అధికారులకు ఫిర్యాదు

Advertisement

ఈ వివాదంపై స్పందించిన AICWA.. కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్,సెన్సార్ బోర్డ్ (CBFC) చైర్మన్ ప్రసూన్ జోషిలకు లేఖలు రాసింది. ఈ పాటను అన్ని డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల నుండి తక్షణమే తొలగించాలని, అలాగే బాధ్యులైన నిర్మాతలు, క్రియేటర్లపై ఎఫ్.ఐ.ఆర్ (FIR) నమోదు చేయాలని కోరింది. కేవలం సినిమా పబ్లిసిటీ కోసమే ఇలాంటి వివాదాస్పద కంటెంట్‌ను ప్రోత్సహిస్తున్నారని వారు విమర్శించారు.

Read also-Romantic Drama OTT: 24 ఏళ్ల యువకుడితో 40 ఏళ్ల ఆంటీ ప్రేమ… కూతురు ఉన్నా కోరిక తీరక…

స్పందించిన చిత్ర యూనిట్

Advertisement

నిరసనలు మిన్నంటడంతో ‘KD: ది డెవిల్’ చిత్ర బృందం ఇప్పటికే యూట్యూబ్ నుండి ఈ పాట హిందీ మరియు కన్నడ వెర్షన్లను తొలగించింది. ధ్రువ సర్జా హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి ప్రేమ్ దర్శకత్వం వహిస్తున్నారు. కాగా, సినీ ప్రముఖులు కంగనా రనౌత్, గాయకుడు అర్మాన్ మాలిక్ వంటి వారు కూడా ఈ పాటలోని అశ్లీలతను తప్పుబట్టడం గమనార్హం. న్సార్ బోర్డ్ ఈ సినిమాను మరోసారి క్షుణ్ణంగా పరిశీలించాలని, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠిన నిబంధనలు తీసుకురావాలని సినీ వర్గాల నుండి డిమాండ్లు వినిపిస్తున్నాయి.

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×