E-Paper
Advertisement

Coolie: ప్రసాద్ ఐమాక్స్ లో పిల్లలపై ఆంక్షలు… షాకింగ్ నిర్ణయం తీసుకున్న మేనేజ్మెంట్

Coolie: ప్రసాద్ ఐమాక్స్ లో పిల్లలపై ఆంక్షలు… షాకింగ్ నిర్ణయం తీసుకున్న మేనేజ్మెంట్
Advertisement

Coolie: ప్రస్తుతం రిలీజ్ కాబోతున్న సినిమాల్లో భారీ అంచనాలు ఉన్న సినిమా కూలీ. లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్ నటించిన ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి. రజనీకాంత్ తో పాటు, ఉపేంద్ర, అమీర్ ఖాన్, నాగార్జున, సౌబిన్ వంటి స్టార్ హీరోలు ఈ సినిమాలో కనిపిస్తున్నారు.

ఇకపోతే దర్శకుడు లోకేష్ కనకరాజ్ కు ఒక సపరేట్ బ్రాండ్ ఉంది. అందుకే రజనీకాంత్ నటించిన ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఒకప్పుడు రజనీకాంత్ నటించిన సినిమాలు తెలుగులో విడుదలైన కూడా ఇంత బజ్ లేదు. కానీ ఈ కాంబినేషన్ వలన ఈ సినిమా మీద హై ఎక్స్పెక్టేషన్స్ మొదలయ్యాయి. ఒక ఆగస్టు 14న కూలీ సినిమా ప్రేక్షకులు ముందుకు రానుంది.

Advertisement

పిల్లలపై ఆంక్షలు 

ఈ సినిమాకి సంబంధించి సెన్సార్ బోర్డు ఏ సర్టిఫికెట్ ఇచ్చింది. అందుకే ఈ సినిమాకు పిల్లలకు ఎంట్రీ లేదు. చాలా చోట్ల పిల్లలకు ఈ సినిమాకు ఎంట్రీ లేదు అని బోర్డులు కూడా పెట్టేశారు. ఇక తాజాగా హైదరాబాద్ ప్రసాద్ ఐమాక్స్ నుంచి కూడా అనౌన్స్మెంట్ వచ్చేసింది. కచ్చితంగా ఈ సినిమా చూడడానికి ఏజ్ సర్టిఫికెట్ ఉండాలి అని తేల్చి చెప్పేసింది మేనేజ్మెంట్. అయితే మామూలుగా సినిమా అంటే ఫ్యామిలీ అంతా కూడా వెళ్లి చూడాలి అని అనుకుంటారు. అని ఇలా ఏ సర్టిఫికెట్ రావడం వలన కొంతమేరకు సినిమా కలెక్షన్లు తగ్గే అవకాశం ఉంది. ఇదే విషయాన్ని సందీప్ రెడ్డి వంగా కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. ఏ సర్టిఫికెట్ రావటం వలన సినిమా కలెక్షన్ల పైన దెబ్బబడే అవకాశం ఉంది.

Advertisement

భారీ అంచనాలు 

ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ కూడా ఆ ఎక్స్పెక్టేషన్ ఇంకా రెట్టింపు చేసింది. అన్నిటిని మించి అనిరుద్ అందించిన మ్యూజిక్ ఈ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. ప్రస్తుతం ఈ సినిమాపై విపరీతమైన రెస్పాన్స్ వస్తుంది. అన్ని వర్కౌట్ అయితే కొంచెం పాజిటివ్ టాక్ వచ్చినా కూడా ఈ సినిమా కలెక్షన్లు నెక్స్ట్ లెవెల్ కి వెళ్లిపోతాయి. ఇక చిత్ర యూనిట్ కూడా ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలతో ఉంది. ఇదివరకే చాలామంది స్టార్స్ ని ఒకే సినిమాలో డీల్ చేసిన అనుభవం కూడా లోకేష్ కి ఉంది. విక్రమ్ సినిమా చాలామందికి కనెక్ట్ అవ్వటానికి పవర్ఫుల్ క్యారెక్టర్స్ కారణం. ప్రస్తుతం అదే విధంగా ఈ సినిమాలో కూడా పవర్ఫుల్ క్యారెక్టర్స్ కనిపిస్తున్నాయి.

Also Read: Coolie : వార్ 2 ను డామినేట్ చేసిన కూలీ, హిట్ టాక్ వస్తే కానీ గట్టెక్కదు

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×