E-Paper
Advertisement

నిన్నుకోరి రీ రిలీజ్..అద్భుతమైన అనుభవం అంటున్న నివేథ థామస్ !

నిన్నుకోరి రీ రిలీజ్..అద్భుతమైన అనుభవం అంటున్న నివేథ థామస్ !
Advertisement

Nivetha Thomas: నివేథ థామస్ పరిచయం అవసరం లేని పేరు. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఒకానొక సమయంలో వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా గడిపిన ఈ ముద్దుగుమ్మ ఇటీవల కాలంలో అవకాశాలను కోల్పోవడంతో పెద్దగా సినిమాలలో కనిపించడం లేదు. ఇలా సినిమాలను పూర్తిగా తగ్గించిన నివేదా థామస్(Nivetha Thomas) తాజాగా సోషల్ మీడియా వేదికగా నిన్ను కోరి(Ninnu Kori) సినిమా రీ రిలీస్ గురించి ఈమె చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. నాని, ఆది పినిశెట్టి, నివేదా థామస్ ప్రధాన పాత్రలలో నటించిన ఈ సినిమా మే 8వ తేదీ రీ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే.

ప్రేక్షకులతో సినిమా చూసిన నివేద..

ఈ విధంగా ఈ సినిమా రీ రిలీజ్ కావడంతో నివేదా థామస్ స్వయంగా పలు థియేటర్లకు వెళ్ళి అభిమానులతో కలిసి ఈ సినిమాని చూస్తూ ఎంజాయ్ చేశారు. ఇలా ప్రేక్షకులతో కలిసి థియేటర్లలో ఈ సినిమా చూస్తూ ఎంజాయ్ చేసిన ఈమె తాజాగా ఈ సినిమా రీ రిలీజ్ అవ్వడం గురించి సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది. ఈ సినిమాను చూస్తూ ప్రేక్షకులు థియేటర్లో ఎంజాయ్ చేస్తున్నటువంటి ఒక చిన్న వీడియో క్లిప్ ఈమె తన అధికారిక సోషల్ మీడియా ఖాతా ద్వారా షేర్ చేస్తూ తన సంతోషాన్ని వ్యక్తపరిచారు.

నా మొదటి రీ రిలీజ్ సినిమా..

Advertisement

ఈ నేపథ్యంలోనే నివేద థామస్ స్పందిస్తూ.. మే 8వ తేదీ చక్కటి శుక్రవారం ఉదయం. నిన్ను కోరి సినిమా నా మొదటి రీ రిలీజ్ అనుభవం. ఈ సినిమాలోని పాటలను పదం పదం మీరు పాడారు, డైలాగులు కూడా చెప్పారు. తరువాత ఏం వస్తుందనే విషయాల గురించి మీకు తెలుసు. ఈ సినిమా చూస్తూ మీకు నచ్చిన పాత్రలను ఉత్సాహపరిచారు. ప్రతి ఏటా ఈ సినిమాకు మీ నుంచి మంచి ఆదరణ పెరుగుతుందని నాకు అర్థం అయిందని నివేదా తెలిపారు. నిన్ను కోరి నేను ఎంతగానో ప్రేమించే సినిమా. ఈ సినిమా పట్ల మీరు చూపిస్తున్న ప్రేమకు ధన్యవాదాలు అంటూ ఈమె సోషల్ మీడియా వేదికగా ఈ సినిమాకు వస్తున్న ఆదరణ గురించి తెలియజేస్తూ చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.

Advertisement

ఇటీవల కాలంలో రీ రిలీజ్ సినిమాలకు ఎంతో మంచి ఆదరణ లభిస్తున్న సంగతి తెలిసిందే. ఇక వేసవిలో స్టార్ హీరోలు నటించిన సినిమాలు ఏవి కూడా విడుదలకు సిద్ధంగా లేని నేపథ్యంలో ఇదివరకే ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ అందుకున్న సినిమాలను చిత్ర నిర్మాతలు తిరిగి విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నాని ప్రధాన పాత్రలో నటించిన నిన్ను కోరి సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి ఆదరణను సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా 2017 వ సంవత్సరంలో ఒక ప్రేమ కథ సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రానికి శివానిర్వాన దర్శకత్వం వహించగా, డివివి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించారు.

Also Read: కొత్త కారు కొన్న డెమోన్..ఆ కోరిక కూడా నెరవేరాలన్న రీతూ!

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×