E-Paper
Advertisement

మార్కెట్ జీరో.. క్రేజ్ నిల్.. అయినా ఆగేదేలే అంటున్న నితిన్ !

మార్కెట్ జీరో.. క్రేజ్ నిల్.. అయినా ఆగేదేలే అంటున్న నితిన్ !
Advertisement

Nithiin Comeback : ఒకప్పుడు వరుస సక్సెస్ లతో దూసుకుపోయిన నితిన్ కెరీర్ ప్రస్తుతం ఇసీయూలో ఉన్నట్టే కనిపిస్తుంది. అప్పుడెప్పుడో 2020లో భీష్మ తరువాత చెక్ (2021), రంగ్ దే (2021), మాస్ట్రో (2021), మాచర్ల నియోజకవర్గం (2022), ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ (2023), రాబిన్‌హుడ్ (2025), తమ్ముడు (2025) అంటూ అర డజన్ సినిమాలు చేసినా ఒక్కటంటే ఒక్క సక్సెస్ కూడా చూడలేకపోయాడు మరి. ఒక దశలో ఆయన సినిమాలు థియేటర్లకు ఎప్పుడు వచ్చి ఎప్పుడు పోతున్నాయో కూడా తెలీని పరిస్థితి.

కేవలం రెండు కోట్ల ఓపెనింగ్స్ మాత్రమే

Advertisement

మరీ ముఖ్యంగా దిల్ రాజు బ్యానర్ లో వేణు శ్రీరామ్ తెరకెక్కించిన తమ్ముడు సినిమా కేవలం రెండు కోట్ల ఓపెనింగ్స్ మాత్రమే రాబట్టి ట్రేడ్ వర్గాలకి పెద్ద షాకే ఇచ్చింది. ఇక భీష్మ వంటి సూపర్ హిట్ ఇచ్చిన వెంకీ కుడుముల అయినా మరో హిట్ ఇస్తాడనుకుంటే అబ్బే అంత సీన్ లేదంటూ ‘రాబిన్‌హుడ్’ తో ఏకంగా 14 కోట్ల భారీ డిజాస్టర్ అంటగట్టాడు. దీంతో ఇన్ని ప్లాపుల మధ్య నితిన్ కి ఇక అవకాశాలు ఇచ్చేదెవరా అంటూ క్యూరియస్ గా వాచ్ చేశారు అంతా.

అయితే తాజాగా వినిపిస్తున్న టాక్స్ బట్టి సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సోము, నర్రి అనే ఇద్దరు కొత్త యంగ్ డైరెక్టర్స్ ని  పరిచయం చేస్తూ సరికొత్త ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తుంది. అయితే ఈ సినిమాను కేవలం 55 రోజుల్లోనే పూర్తి చేయాలని మేకర్స్ నిర్ణయించడమే కాస్త విచిత్రంగా మారింది. మే 4న పూజతో మొదలయ్యే ఈ సినిమా మే 6 నుంచి సెట్స్ మీదకి వెళ్ళబోతుందట. అంటే ఈ సినిమా కేవలం రెండు మూడు నెలల్లోనే విడుదలకు సిద్ధం అవుతుందన్న మాట.

Advertisement

also read :ఆ డైరెక్టర్ నరకం చూపించాడు.. మళ్లీ ఆ మొహం చూడను – ప్రగతి షాకింగ్ కామెంట్స్

దీంతో అసలే వరుస డిజాస్టర్ లని మూటగట్టుకున్న హీరో, ఇలా కొత్త దర్శకులతో తక్కువ సమయంలో సినిమా పూర్తి చేస్తే క్వాలిటీ  ఎలా ఉంటుందా అన్న అనుమానాలు అప్పుడే మొదలయ్యాయి. ఇక నితిన్ లాంటి హీరోతో 55 రోజుల్లో సినిమా అంటే అసలు ఇది మేకర్స్ వేసిన ప్లానా, లేక సినిమాని ఏదోలా చుట్టేద్దామా అన్న తొందరా అంటూ పెదవి విరిచేస్తున్నారు నెటిజన్లు.

రితికా నాయక్.. గోల్డెన్ లెగ్ కలిసి వస్తుందా ?

ఇక ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’తో మెప్పించి, ‘మిరాయ్’తో మంచి క్రేజ్ తెచ్చుకుని గోల్డెన్ లెగ్ అన్న పేరును సంపాదించిన రితికా నాయక్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించనున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే గీతా ఆర్ట్స్ వంటి పెద్ద బ్యానర్ రితికాతో మూడు సినిమాలకు అగ్రిమెంట్  చేసుకున్నాయట కూడా. మొత్తానికి డబుల్ హ్యాట్రిక్ డిజాస్టర్ మూటగట్టుకున్న నితిన్ ఆశలన్నీ ఈ గోల్డెన్ లెగ్ పైనే పెట్టుకున్నాడన్న మాట. ఇక ‘విరాట పర్వం’తో మంచి పేరు తెచ్చుకున్న సురేష్ బొబ్బిలి ఈ సినిమాకి సంగీతం అందించనున్నాడని టాక్.

చేతిలో సినిమాలు.. ఫలితం ఏంటో?

ఇక ఈ సినిమానే కాకుండా ‘ఆయ్’ అంటూ మొదటి సినిమాతోనే సక్సెస్ చూసిన అంజితో ఒకటి, ఆనంద్ రవి దర్శకత్వంలో మరొక సినిమాను కూడా లైన్లో పెట్టాడట. మరో వైపు తన సొంత బ్యానర్ ‘శ్రేష్ఠ మూవీస్’పై అక్క నికితా రెడ్డి నిర్మాతగా ఇంకో సినిమా ప్లాన్ చేస్తున్నాడట కూడా.

ఏది ఏమైనా మార్కెట్ జీరో ఉన్నా, క్రేజ్ లేకపోయినా కూడా వరుసగా నాలుగు సినిమాలను ప్లాన్ చేయడం మెచ్చుకోవాల్సిన విషయమే. చూడాలి మరి సినిమాల కౌంట్ పై ఉన్న శ్రద్ధ సినిమాల కంటెంట్ పై పెడతాడో లేక మరో త్రిబుల్ హ్యాట్రిక్ డిజాస్టర్స్ కి తెరతీస్తాడో!

also read :మృణాల్ ‘గ్లామర్’ డోస్.. తెలుగులో సీతమ్మ, హిందీలో మాత్రం రచ్చ రంబోలా!

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×