E-Paper
Advertisement

Niharika Chiranjeevi: నిహారికాకు అదిరిపోయే కథ చెప్పిన చిరంజీవి… ట్విస్టులు మామూలుగా లేవు!

Niharika Chiranjeevi: నిహారికాకు అదిరిపోయే కథ చెప్పిన చిరంజీవి… ట్విస్టులు మామూలుగా లేవు!
Advertisement

Niharika Chiranjeevi: మెగా కాంపౌండ్ నుంచి ఎంతోమంది ఇప్పటికే హీరోలుగాను నిర్మాతలుగా అను కొనసాగుతున్న సంగతి తెలిసిందే .ఇక మెగా వారసులు నిహారిక(Niharika) పింక్ ఎలిఫెంట్ బ్యానర్ ప్రారంభించి సినిమాలను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఎన్నో వెబ్ సిరీస్ లను నిర్మించిన ఈమె కమిటీ కుర్రాళ్ళు అనే సినిమా ద్వారా వెండితెరకు నిర్మాతగా పరిచయమైన మొదటి సినిమాతో ఎంతో మంచి విజయాన్ని అందుకొని రెండో సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.

నిహారికకు చిరంజీవి చెప్పిన కథ ఇదేనా..

ఈమె రాకాసా(Raakaasaa) అనే సినిమా ద్వారా ఏప్రిల్ మూడో తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే యాంకర్ సుమ(Suma)తో కలిసి ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా నిహారిక చిన్నప్పుడు తనకు చిరంజీవి గారు చెప్పిన ఒక కథ గురించి ఈ సందర్భంగా బయటపెట్టారు. మరి చిరంజీవి గారు చిన్నప్పుడు నిహారికకు చెప్పిన ఆ కథ ఏంటి అనే విషయాన్ని వస్తే…

హైదరాబాదులో పడిన బ్రహ్మ రాక్షసి..

Advertisement

చిన్నప్పుడు చిరంజీవి పెదనాన్న తనకు తరచూ ఒక కథ చెప్పేవారని ఆ కథను సుమ కనకాలకు చెప్పారు. చిన్నప్పుడు ఒక ఊర్లో ఒక బ్రహ్మ రాక్షసి ఉండేది. అయితే ఆ బ్రహ్మ రాక్షసికి ప్రతిరోజు ఒక వ్యక్తి భోజనం తీసుకెళ్లేవాడు. ఒకరోజు ఆ బ్రహ్మ రాక్షసి వద్దకు భోజనంలో లేకుండా ఆ వ్యక్తి వెళ్లడంతో ఎందుకు ఫుడ్ తీసుకురాలేదని రాక్షసి అడిగిందట. దీంతో ఆ వ్యక్తి నేను తీసుకురాను అని చెప్పడంతో అయితే నేను నిన్ను తింటానని బ్రహ్మ రాక్షసి భయపెట్టిందట. ఆ వ్యక్తి భయపడకుండా తిను ఎలా తింటావో అని చెప్పడంతో ఆ బ్రహ్మ రాక్షసి నోరు తెరవగానే ఆ వ్యక్తి రాక్షసి నాలుక పట్టుకొని గిర్రుని తిప్పితే ఆ బ్రహ్మ రాక్షసి హైదరాబాద్లో వచ్చి పడిందని చిరంజీవి చెప్పినట్లు గుర్తు చేసుకున్నారు .

Advertisement

ఇక ఆ బ్రహ్మ రాక్షసి హైదరాబాద్లో నాగబాబు ఇంట్లో ఒక ఊయలలో పడింది అంటూ నిహారిక ఊహించని ట్విస్టులతో చిరంజీవి చెప్పిన కథను ఈ సందర్భంగా బయట పెట్టడంతో ఇది కాస్త వైరల్ అవుతుంది. ఇక్కడ చిరంజీవి గారు నిహారికను పరోక్షంగా బ్రహ్మ రాక్షసి అని సంబోధిస్తూ చెప్పారని స్పష్టమవుతుంది. ఇక ఈ వీడియో చూసిన అభిమానులు అసలు చిరంజీవి చెప్పిన కథలో ట్విస్ట్ లు మామూలుగా లేవు అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక రాకాసా సినిమా విషయానికి వస్తే ఈ సినిమా మానస శర్మ దర్శకత్వంలో తెరకెక్కగా సంగీత శోభన్, నయన్ సారిక జంటగా నటించారు. ఇక ఈ సినిమా ఫాంటసీ కామెడీ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ భారీ అంచనాలను పెంచేసాయి. మరి నిహారికకు తన రెండో సినిమా ఎలాంటి సక్సెస్ అందిస్తుందనేది తెలియాల్సి ఉంది.

Also Read: Jr.NTR Pranathi: భార్య ప్రణతి పుట్టినరోజు.. గ్రాండ్ పార్టీ ఇచ్చిన తారక్.. ఫోటోలు వైరల్!

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×