E-Paper
Advertisement

Nidhhi Agerwal: ప్లకార్డులతో ఆశ్చర్యపరిచిన ఫ్యాన్స్.. కాబోయే వరుడిపై నిధి కామెంట్!

Nidhhi Agerwal: ప్లకార్డులతో ఆశ్చర్యపరిచిన ఫ్యాన్స్.. కాబోయే వరుడిపై నిధి కామెంట్!
Advertisement

Nidhhi Agerwal:ఈమధ్య కాలంలో కొంతమంది హీరోయిన్స్ వయసులో ఉండగానే పెళ్లి చేసుకుంటుంటే.. మరికొంతమంది పెళ్లి వయసు దాటిపోయినా వివాహం అనే మాట ఎత్తడం లేదు. కానీ మరి కొంతమంది హీరోయిన్స్ ను పెళ్లి చేసుకోవడానికి అటు అభిమానులు కూడా ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ క్రమంలోనే ఒక అభిమాని ఏకంగా నిధి అగర్వాల్ కి ప్లకార్డులతో పెళ్లి ప్రపోజల్ చేయడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అసలు విషయంలోకి వెళ్తే.. తాజాగా ఈమె నటిస్తున్న చిత్రం ది రాజా సాబ్. ప్రభాస్ హీరోగా, మారుతి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిన్న హైదరాబాద్ వేదికగా ఘనంగా నిర్వహించారు.

ఈ క్రమంలోనే కొంతమంది అభిమానులు ప్లకార్డులు పట్టుకొని..” నిధి పాపను పెళ్లి చేసుకోవాలంటే ఏ వృత్తిలో ఉండాలి? ఎంత ఆస్తి ఉండాలి? ఎలా ఉండాలి?” అనే ప్రశ్నలతో ప్రీ రిలీజ్ ఈవెంట్ కే స్పెషల్ అట్రాక్షన్ తీసుకొచ్చారు. ముఖ్యంగా ఈ ప్లకార్డులు చూసి హీరో ప్రభాస్ కూడా ఆశ్చర్యపోతూ నోరెళ్లబెట్టడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అయితే ఇదే విషయాన్ని యాంకర్ సుమ నిధి వద్ద ప్రస్తావించగా ఆమె మాట్లాడుతూ..” ప్రేమించే మనసు ఉంటే చాలు” అంటూ చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది. ఇకపోతే వేదికపై నిధి అగర్వాల్ మాట్లాడిన తర్వాత “ఆమె చీరలోనే అన్ని నిధులు ఉన్నాయి” అంటూ సుమ అనడంతో ఈవెంట్ మొత్తం విజిల్స్ తో మారుమోగిపోయింది.

Advertisement

నిధి అగర్వాల్ విషయానికి వస్తే.. తెలుగు, తమిళ్ చిత్రాలలో ఎక్కువగా పని చేసే ఈమె.. మిస్ దివా యూనివర్స్ 2014లో పాల్గొనింది. ఆ తర్వాత హిందీ చిత్రం మున్నా మైకేల్ తో తన నటనా రంగ ప్రవేశం చేసింది. ఈ సినిమాతో ఉత్తమ మహిళ అరంగేట్రం విభాగంలో జీ సినీ అవార్డును కూడా అందుకుంది. ఇకపోతే 2018 లో వచ్చిన సవ్యసాచి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈమె 2021లో ఈశ్వరన్ అనే సినిమాతో తమిళ్ సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఉత్తమ మహిళ అరంగేట్రం కోసం సైమా అవార్డుకు కూడా నామినేషన్ దక్కించుకుంది. 2019లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ తో ఊహించని విజయం సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. ఈ ఏడాది పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన హరిహర వీరమల్లు సినిమాలో నటించి ప్రేక్షకులను మెప్పించిన ఈమె.. ప్రస్తుతం ప్రభాస్ తో ది రాజా సాబ్ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదల కాబోతోంది.

నిధి అగర్వాల్ తదుపరి ప్రాజెక్టులు..

ది రాజా సాబ్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటున్న ఈమె.. తన తదుపరి ప్రాజెక్టుల గురించి మాట్లాడుతూ.. ది రాజా సాబ్ సినిమా విడుదలైన తర్వాత నా ప్రాజెక్ట్ ల గురించి వెల్లడిస్తాను. ప్రస్తుతం తెలుగులో మూడు సినిమాలు చేస్తున్నాను. అలాగే తమిళ్ , హిందీలో కూడా సినిమాలు చేస్తున్నాను అంటూ క్లారిటీ ఇచ్చింది.

Advertisement

ALSO READ:Kissik talks Promo: ఈ క్షణం పోయినా చాలు.. అరియానా జీవితంలో ఇంత విషాదమా?

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×