E-Paper
Advertisement

Netflix Movie: నిరసన సెగ.. ఆ కంటెంట్‌ను లేపేసిన నెట్‌ఫ్లిక్స్!

Netflix Movie: నిరసన సెగ.. ఆ కంటెంట్‌ను లేపేసిన నెట్‌ఫ్లిక్స్!
Advertisement

Netflix Movie: నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్టర్ మనోజ్ బాజ్‌పాయ్ మరియు ప్రముఖ దర్శకుడు నీరజ్ పాండే కాంబినేషన్‌కు చాలా మంచి పేరుంది. వీరిద్దరూ కలిసి నెట్‌ఫ్లిక్స్‌ కోసం రూపొందించిన తాజా చిత్రం ‘ఘుస్కోర్ పండత్’ (Ghooskhor Pandat). ఈ సినిమా విడుదల కాకముందే తీవ్ర వివాదాల్లో చిక్కుకుంది. ముఖ్యంగా ఈ సినిమా టైటిల్ ఒక సామాజిక వర్గాన్ని కించపరిచేలా ఉందంటూ నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా నిరసన వ్యక్తం చేయడంతో నెట్‌ఫ్లిక్స్ సంస్థ అనూహ్య నిర్ణయం తీసుకుంది. హిందీలో ‘ఘుస్కోర్’ అంటే లంచగొండి అని అర్థం. ఒక సామాజిక వర్గాన్ని సూచించే పదాన్ని ‘లంచగొండి’ అనే పదంతో కలిపి టైటిల్‌గా పెట్టడంపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది కేవలం ఒక సినిమా టైటిల్ మాత్రమే కాదు, ఒక వర్గం పట్ల ద్వేషాన్ని పెంచేలా ఉందని నెటిజన్లు మండిపడ్డారు. ఈ వివాదం కాస్తా ముదిరి సోషల్ మీడియాలో #BoycottNetflix అనే ట్రెండ్‌కు దారితీసింది. అంతేకాకుండా, దీనిపై లక్నో, ఢిల్లీ వంటి నగరాల్లో పోలీసు కేసులు కూడా నమోదయ్యాయి.

Also Read- Peddi Movie: ‘పెద్ది’ సెట్స్‌లో రామ్ చరణ్.. సందడి సందడిగా టీమ్.. విషయమిదే!

Advertisement

రంగంలోకి దిగిన కేంద్ర ప్రభుత్వం

ఈ వివాదంపై కేంద్ర సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ కూడా సీరియస్ అయ్యింది. జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) నుంచి నోటీసులు రావడంతో పాటు, సామాజిక సామరస్యానికి భంగం కలిగించేలా ఉన్న ఈ కంటెంట్‌ను వెంటనే తొలగించాలని కేంద్రం నెట్‌ఫ్లిక్స్‌ను ఆదేశించింది. దీంతో అప్రమత్తమైన నెట్‌ఫ్లిక్స్, ఈ సినిమాకు సంబంధించిన టీజర్, పోస్టర్లు, ఇతర ప్రమోషనల్ వీడియోలన్నింటినీ తన ప్లాట్‌ఫారమ్ నుంచి పూర్తిగా తొలగించింది.

Advertisement

Also Read- Vishwaksen: అతని చేతిలో దారుణంగా మోసపోయిన విశ్వక్ సేన్.. అలా ఎలా బోల్తా పడ్డావ్ భయ్యా!

నీరజ్ పాండే, మనోజ్ బాజ్‌పాయ్ క్షమాపణలు

వివాదం పెద్దదవ్వడంతో దర్శకుడు నీరజ్ పాండే మరియు హీరో మనోజ్ బాజ్‌పాయ్ స్పందించారు. ‘‘ఇది కేవలం ఒక కల్పిత కథ అని, ఎవరి మనోభావాలను దెబ్బతీయడం తమ ఉద్దేశం కాదని’’ వారు స్పష్టం చేశారు. సినిమాలో పాత్ర పేరుకు ఉన్న పిలుపునే టైటిల్‌గా పెట్టామని, అంతేకానీ అది ఏ కులానికో, మతానికో సంబంధించింది కాదని వారు వివరణ ఇచ్చారు. అయినప్పటికీ, ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే దానికి బేషరతుగా క్షమాపణలు చెబుతున్నట్లు వారు ప్రకటించారు. ప్రస్తుతానికి ఈ సినిమాకు సంబంధించిన కంటెంట్‌ను నెట్‌ఫ్లిక్స్ హోల్డ్‌లో పెట్టింది. సినిమా టైటిల్‌ను మారుస్తారా లేక కథలో ఏవైనా మార్పులు చేస్తారా అనే దానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఒక గొప్ప నటుడు, మంచి దర్శకుడు ఉన్నప్పటికీ, కేవలం టైటిల్ ఎంపికలో జరిగిన పొరపాటు వల్ల ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఇబ్బందుల్లో పడింది. గతంలో తెలుగులో కూడా ‘వాల్మీకి’ టైటిల్ విషయంలో ఇలాంటి కాంట్రవర్సీనే నడిచిన విషయం తెలిసిందే.

Also Read- Tollywood: అగ్ర హీరోల చిత్రాలు లేక వెలవెలబోతున్న థియేటర్లు.. ఎగ్జిబిటర్లు ఏమంటున్నారంటే?

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×