E-Paper
Advertisement

Andhra King Taluka : ఆ ఓటిటి కోసమే ఆంధ్ర కింగ్ తాలుక ఒక రోజు ముందు రిలీజ్, ఈ కల్చర్ మారదా?

Andhra King Taluka : ఆ ఓటిటి కోసమే ఆంధ్ర కింగ్ తాలుక ఒక రోజు ముందు రిలీజ్, ఈ కల్చర్ మారదా?
Advertisement

Andhra King Taluka : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఈ మధ్య కాలంలో చాలా మార్పులు జరిగిపోయాయి. ఒకప్పుడు సినిమా రిలీజ్ డేట్ అనేది నిర్మాతలు మాత్రమే నిర్ణయించేవాళ్లు. ఒక మంచి సినిమా చేయటం ఎంత గొప్ప విషయమో ఆ మంచి సినిమాని మంచి డేటుకు రిలీజ్ చేయడం కూడా అంతే గొప్ప విషయం. ఎందుకంటే సినిమా రిలీజ్ చేసే డేట్ బట్టి కూడా సక్సెస్ డిపెండ్ అయి ఉంటుంది.

ఇప్పటికీ కొంతమంది కొన్ని ఇంటర్వ్యూస్ లో కొన్ని మాటలు చెబుతూ ఉంటారు. మేము చాలా మంచి సినిమా చేశాము కానీ రిలీజ్ డేట్ వలన మా సినిమా పోయింది. మేము మా సినిమా రిలీజ్ చేసినప్పుడు ఆ ఇష్యూ జరుగుతుంది, లేకపోతే ఎలక్షన్స్ జరుగుతున్నాయి. అందువలనే మా సినిమా మీద ఎవరికి ఫోకస్ లేకుండా పోయింది. లేకపోతే మాది చాలా మంచి సినిమా అని కొన్ని మాటలు వినిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు మాత్రం సినిమా రిలీజ్ డేట్ విషయంలో దర్శక నిర్మాతలు ఏ నిర్ణయం తీసుకోలేకపోతున్నారు.

ఓటిటి సంస్థలు నిర్ణయిస్తున్నాయి 

Advertisement

కరోనా తర్వాత చాలామంది థియేటర్ కు రావడం తగ్గించేశారు అనే మాటలు వింటూనే ఉంటాం. ఓటిటిలో సినిమాలు చూడటానికి చాలామంది అలవాటు పడిపోయారు. ఇది కొంత మేరకు పరవాలేదు కానీ సినిమా రిలీజ్ డేట్లను కూడా ఓటీపీ సంస్థలు నిర్ణయిస్తున్నాయి అనేది ఆశ్చర్యకరమైన విషయం.

 

Advertisement

మహేష్ బాబు దర్శకత్వంలో రామ్ పోతినేని నటిస్తున్న ఆంధ్ర కింగ్ తాలూకా అనే సినిమా నవంబర్ 28 నుంచి ఒకరోజు ముందు విడుదలవుతుంది అంటే నవంబర్ 27న ప్రేక్షకులు ముందుకు రానుంది. ఇది చాలామంది అభిమానులకు గుడ్ న్యూస్. కానీ ఈ రిలీజ్ డేట్ విషయంలో నెట్ఫ్లిక్ సంస్థ ఇన్వాల్వ్మెంట్ ఉంది.

 

కేవలం నెట్ఫ్లిక్ సంస్థతో ఉన్న కొన్ని ఒప్పందాల ప్రకారమే ఈ సినిమాను ఒకరోజు ముందుగానే రిలీజ్ చేస్తున్నట్లు రామ్ పోతినేని రీసెంట్గా జరిగిన ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఈ సినిమాకి కంటెంట్ రెడీగా ఉంది కాబట్టి ఒకరోజు ముందు రిలీజ్ చేస్తున్నారు. లేకపోతే నిర్మాతల పరిస్థితి ఏంటి?

ఈ కల్చర్ మారదా? 

ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే చాలామంది ఇంటర్వ్యూస్ లో ఓటిపి వలన డేట్ షిఫ్ట్ చేశాం అంటూ మాట్లాడుతున్నారు. అనుకున్న టైం కి వర్క్ జరగకపోతే, సినిమా పోస్ట్ పోన్ అవ్వడం సహజంగా జరుగుతుంది. కానీ కొన్ని సినిమాలకు సంబంధించి ఓటిటీ డీల్స్ జరిగేటప్పుడు, నిర్మాతలు ఈ టైంకి సినిమా రిలీజ్ చేస్తాం అని ఒప్పందం పెట్టుకుంటారు.

సినిమా కంటెంట్ ఊహించిన స్థాయిలో రాకపోయినా కూడా చెప్పిన డేట్ ప్రకారం సినిమా రిలీజ్ చేయాల్సి వస్తుంది. ఒకవేళ రిలీజ్ చేయకుండా పోస్ట్ పోన్ చేస్తే ఓటిటి వాళ్లతో మాట్లాడుకున్న బడ్జెట్ తగ్గిపోతుంది. మొత్తానికి ఒక సినిమా రిలీజ్ డేట్ అనేది ఓటిటీ నిర్ణయించే స్థాయికి తెలుగు ఫిలిం ఇండస్ట్రీ వెళ్ళిపోయింది. ఈ నిర్ణయాన్ని మార్చే పని తెలుగు ఫిలిం ఇండస్ట్రీ చేస్తుందా లేకపోతే కంటిన్యూ చేస్తుందా అనేది డిస్కషన్ పాయింట్.

Also Read: Bandla Ganesh : ఆ ఇంస్టాగ్రామ్ అకౌంట్ నాది కాదు, క్లారిటీ ఇచ్చిన బండ్ల గణేష్

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×