E-Paper
Advertisement

Neha Shetty: బంగారం రా మా టిల్లు పాప.. ఓజీలో ఎలా లేపేశారురా

Neha Shetty: బంగారం రా మా టిల్లు పాప.. ఓజీలో ఎలా లేపేశారురా
Advertisement

Neha Shetty: ఈ మధ్యకాలంలో పాన్ ఇండియా సినిమాలు పాటలు కంటే కథకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాయి. కథకు అడ్డు వస్తున్నాయంటే పాటలను కూడా ఎడిటింగ్ లో తప్పించేస్తున్నారు. మిరాయ్ లో ఇలాగే జరిగిన విషయం తెలిసిందే. అందులో ఉన్న రెండు సాంగ్స్ మేకర్స్ ఎడిటింగ్ లో  లేపేశారు. ఆ తర్వాత ఫాన్స్ డిమాండ్ చేయడంతో వైబ్ ఉందిలే సాంగ్ ను మళ్లీ యాడ్ చేశారు. ఇక నిధి అగర్వాల్ చేసిన స్పెషల్ సాంగ్ ఇప్పుడప్పుడే యాడ్ చేసేలా కనిపించడం లేదు.  ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ పై నిధి చాలా అసలు పెట్టుకుంది. అయినా కూడా ఆశలు తీరకుండానే పోయాయి.

ఇప్పుడు మిరాయ్ పరిస్థితి ఓజీకి వచ్చింది. పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఓజీ చిత్రానికి సుజిత్ దర్శకత్వం వహించాడు. ఎన్నో అంచనాల నడుమ నేడు రిలీజ్ అయిన ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా ఫాన్స్ కు ఫుల్ మిల్స్ అందించింది. పవన్ కళ్యాణ్ యాక్షన్ కి ఫ్యాన్స్  ఫిదా అవుతున్నారు. సుజిత్ సంభవం ఇలా ఉంటుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

ఇక ఈ సినిమాలో చాలామంది స్టార్స్ నటించారు. అయితే ఓజీలో నటించిన ఒకే ఒక్క హీరోయిన్ కి మాత్రం అన్యాయం జరిగింది. ఆమె నేహా శెట్టి. డీజే టిల్లు సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయిన నేహా..  ఓజీ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ చేసిందని వార్తలు వచ్చాయి.  ఇక ఒక సమయంలో నేహా శెట్టి తాను కూడా ఓజీలో భాగమయ్యానని, స్పెషల్ సాంగ్ తో పాటు కొన్ని సన్నివేశాల్లో కూడా తను నటించినట్టు చెప్పుకొచ్చింది. దీంతో నేహా స్పెషల్ సాంగ్ పై ఎప్పటినుంచో అభిమానులు అంచనాలు పెంచుకుంటూనే వస్తున్నారు.

అయితే ఈరోజు ఓజీ సినిమాలో నేహా ఎక్కడా కనిపించలేదు. అందుతున్న సమాచారం ప్రకారం నేహా శెట్టి సాంగ్ ఎడిటింగ్ లో లేపేసారని తెలుస్తుంది. మొదట్నుంచి ఓజీ సినిమా మూడు గంటలకు పైనే నిడివి ఉందని దాన్ని ఎంతో పగడ్బందీగా ఎడిటర్ కట్ చేస్తూ రెండు గంటల 54 నిమిషాలకు కుదించారని మేకర్స్ అధికారికంగా చెప్పుకొచ్చారు. ఇక ఆ ఎడిటింగ్ లో నేహా శెట్టి స్పెషల్ సాంగ్ కట్ అయిపోయింది.

Advertisement

మొదటి నుంచి  కూడా ఈ సినిమాలో కామెడీకే స్కోప్ లేనిది ఐటమ్ సాంగ్ ఎలా పెడతారు అనేది సినిమా చూసాక అర్ధమైన విషయం. అందులోనూ ఫ్యాన్స్ ఎక్కువ పవన్ ఎలివేషన్స్ కోసమే సినిమాకు వెళ్తున్నారు అలాంటి టైం లో స్పెషల్ సాంగ్ పెట్టి టైం వేస్ట చేసే పనులు చేయకుండా మేకర్స్ కట్ చేసి మంచి పని చేశారు అని కొందరు చెప్పుకొస్తున్నారు. కానీ, మరి కొంతమంది నేహా శెట్టి స్పెషల్ సాంగ్ సినిమాకు మరింత హైప్ తీసుకొచ్చేదేమో బంగారం లాంటి పాపని ఎలా లేపేశారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇక అందుతున్న సమాచారం ప్రకారం మొదటి వారం రోజులు పవన్ ఫ్యాన్స్ ఎలివేషన్స్ కోసమే చూస్తారు. ఆ తర్వాత నెమ్మదిగా ఈ సినిమాను ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అలాంటి సమయంలో నేహా శెట్టి పాటను పెడితే బావుంటుందని అనుకున్నారట మేకర్స్. అందుకే వచ్చే సోమవారం నుంచి నేహా శెట్టి స్పెషల్ సాంగ్ యాడ్ చేయనున్నట్లు తెలుస్తుంది. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనేది తెలియాలి.

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×