E-Paper
Advertisement

Mahesh Babu: ఫ్యాన్స్ తేజ సజ్జని కామెంట్ చేశారు, ఇప్పుడు బాబు అదే పని చేస్తున్నాడు

Mahesh Babu: ఫ్యాన్స్ తేజ సజ్జని కామెంట్ చేశారు, ఇప్పుడు బాబు అదే పని చేస్తున్నాడు
Advertisement

Mahesh Babu: చిన్న ఏజ్ లోనే చాలామంది హీరోలతో నటించే తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు తేజ సజ్జ. మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు వంటి హీరోల సినిమాల్లో కూడా నటించాడు తేజ. నందినీ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఓ బేబీ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చాడు తేజ. సమంత నటించిన ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచిగానే సక్సెస్ సాధించింది.

ఆ తర్వాత ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో సినిమాలు చేయడం మొదలుపెట్టాడు తేజ సజ్జ. అయితే తేజ నటించిన సినిమాల్లో హనుమాన్ సినిమా ఎంత పెద్ద సక్సెస్ సాధించిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. చాలా సినిమాల మధ్యలో విడుదలైన ఆ సినిమా ఊహించని విజయాన్ని నమోదు చేసుకుంది. సినిమా విడుదలైనప్పుడు సరిగ్గా థియేటర్స్ కూడా దొరకలేదు.

ఫ్యాన్స్ కామెంట్స్ 

Advertisement

2024 సంక్రాంతి కానుకగా గుంటూరు కారం, సైన్ధవ్, నా సామి రంగ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద విడుదలయ్యాయి. మహేష్ బాబు నాగార్జున వెంకటేష్ వీళ్ళకు ఎంత క్రేజీ ఉందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆ సినిమాలతో పాటు తేజ నటించిన హనుమాన్ విడుదలైంది.

చాలామంది ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు చిన్న పిల్లలు కూడా ఈ సినిమాకు విపరీతంగా ఆదరణ చూపించారు. ఈ సినిమా దాదాపు 100 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది. అలానే మంచి టాక్ రావడంతో థియేటర్స్ కూడా పెరిగాయి.

Advertisement

అప్పట్లో దేవుడు పేరు చెప్పుకొని తేజసజ్జా హిట్టు కొట్టాడు అంటూ చాలామంది మహేష్ బాబు అభిమానులు కామెంట్ చేశారు. మొన్న మిరాయి సినిమా విడుదలైనప్పుడు కూడా అప్పుడు హనుమాన్ ఇప్పుడు రాముడు అంటూ విపరీతమైన కామెంట్స్ వచ్చాయి. ఇప్పుడు అవే కామెంట్స్ మహేష్ బాబు పైన మొదలయ్యాయి.

బాబు అదే పని చేస్తున్నాడు 

అంతమందిని అందరూ ఇష్టపడాలి అని ప్రత్యేకమైన రూల్ లేదు. కొన్ని సందర్భాల్లో యాంటీ ఫ్యాన్స్ కూడా డ్యూటీ ఎక్కుతూ ఉంటారు. మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో చేస్తున్న సినిమాలు రాముడి పాత్రలో కనిపిస్తాడు అని రాజమౌళి చెప్పారు. అయితే గతంలో మహేష్ బాబు అభిమానులు దేవుడిని నమ్ముకొని హిట్లు కొడుతున్నాడు అని తేజ సజ్జ ను కామెంట్ చేశారు. ఇప్పుడు మహేష్ బాబు అదే పని చేస్తున్నాడు అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి.

మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్లో సినిమా చేయాలి అని దాదాపు 15 సంవత్సరాల నుంచి ఎదురు చూశారట నిర్మాత కేఎల్ నారాయణ. ఈ ప్రాజెక్టు మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా ఏ రేంజ్ లో సక్సెస్ సాధిస్తుందో అని చాలామందికి ఒక రకమైన క్యూరియాసిటీ ఉంది. ముఖ్యంగా మహేష్ బాబు రాముడి పాత్ర అంటే ఎలా ఉండబోతుందో అని అందరికీ ఇప్పటికే ఆసక్తి మొదలైపోయింది.

Also Read: GlobeTrotter Event : నెక్స్ట్ టైం షర్టు లేకుండా రమ్మంటారా? బాబు టైమింగ్ అసలు మిస్ అవ్వలేదు

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×