E-Paper
Advertisement

పుట్టిన రోజున ఫ్యాన్స్‌కు అదిరిపోయే గిఫ్ట్ ఇవ్వబోతున్న గాడ్ ఆఫ్ మాసెస్.. ఆ రోజు పూనకాలే..

పుట్టిన రోజున ఫ్యాన్స్‌కు అదిరిపోయే గిఫ్ట్ ఇవ్వబోతున్న గాడ్ ఆఫ్ మాసెస్.. ఆ రోజు పూనకాలే..
Advertisement

NBK111 Teaser: నటసింహం నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు అంటే నందమూరి అభిమానులకు ఒక పెద్ద పండగ. ప్రతి ఏటా జూన్ 10న వచ్చే బాలయ్య బర్త్‌డే కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఎందుకంటే ఆ రోజున ఆయన నటిస్తున్న కొత్త సినిమాలకు సంబంధించిన క్రేజీ అప్‌డేట్స్ వస్తుంటాయి. ఈ ఏడాది కూడా బాలయ్య పుట్టినరోజు సందర్భంగా టాలీవుడ్‌లో ఒక భారీ సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం బాలకృష్ణ నటిస్తున్న ప్రతిష్టాత్మక 111వ చిత్రం (NBK111) టైటిల్, టీజర్‌ను జూన్ 10న విడుదల చేసేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మాస్ ఎలిమెంట్స్‌తో కూడిన యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై టాలీవుడ్‌లో భారీ అంచనాలు ఉన్నాయి. బాలయ్య మార్క్ డైలాగులు, ఊరమాస్ యాక్షన్ సీక్వెన్స్‌లతో ఈ సినిమా ఉండబోతుందని ఇండస్ట్రీ టాక్.

Read also-Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు మరోసారి దరిద్రం.. ఇంట్లో నిజం చెప్పేసిన బాలు.. రోహిణి మాటతో షాక్..

టీజర్ హంగామా

Advertisement

ఈ చిత్రానికి ఎలాంటి టైటిల్ పెడతారనే దానిపై ఇప్పటికే సోషల్ మీడియాలో రకరకాల పేర్లు ప్రచారంలో ఉన్నాయి. బాలయ్య పవర్‌ఫుల్ ఇమేజ్‌కు సరిపోయేలా ఒక పవర్‌ఫుల్ టైటిల్‌ను మేకర్స్ లాక్ చేసినట్లు సమాచారం. జూన్ 10న ఉదయం ప్రత్యేక సమయానికి టైటిల్‌తో కూడిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేయనున్నారు. టైటిల్‌తో పాటు అదే రోజున సినిమా టీజర్‌ను కూడా వదలాలని మేకర్స్ భావిస్తున్నారు. బాలయ్య పుట్టినరోజు కానుకగా రాబోయే ఈ టీజర్‌లో ఆయన లుక్, డైలాగ్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ నెక్స్ట్ లెవెల్‌లో ఉండబోతున్నాయట. ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించేలా ఈ టీజర్‌ను కట్ చేస్తున్నట్లు ఇన్సైడ్ టాక్.

Read also-Ambati Rayudu: CSK జోలికి వ‌స్తే, ప‌ళ్లు రాల‌గొడ‌తా..గిల్ కు అంబ‌టి వార్నింగ్ !

ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్

Advertisement

ఒకే రోజు టైటిల్, టీజర్ రెండు బ్యాక్ టు బ్యాక్ రాబోతుండటంతో నందమూరి అభిమానుల ఆనందానికి అవధులు లేవు. జూన్ 10న థియేటర్ల వద్ద, సోషల్ మీడియా వేదికగా బాలయ్య బర్త్‌డే సెలబ్రేషన్స్ గట్టిగా ప్లాన్ చేస్తున్నారు. ఈ పుట్టినరోజు అప్‌డేట్‌తో సినిమాపై అంచనాలు మరింత ఆకాశాన్ని తాకడం ఖాయంగా కనిపిస్తోంది. మరి జూన్ 10న రాబోయే ఆ పవర్‌ఫుల్ టైటిల్ ఏంటో, టీజర్ ఎలా ఉండబోతుందో చూడాలి మరి. ఇదిలా ఉండగా కొరటాల శివతో మరో సినిమా పట్టాలెక్కించబోతున్నారు. ఆ సినిమా టైటిల్ ‘కార్పెంటర్’ అని ప్రచారంలో ఉంది.

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×