E-Paper
Advertisement

Nayanthara:చిరు కోసం తన రూల్స్ పక్కన పెట్టేసిన నయన్.. కొంచెం రైట్ టర్నింగ్ ఇచ్చుకోండి అంటూ..

Nayanthara:చిరు కోసం తన రూల్స్ పక్కన పెట్టేసిన నయన్.. కొంచెం రైట్ టర్నింగ్ ఇచ్చుకోండి అంటూ..
Advertisement

Nayanthara: సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్, లేడీ సూపర్ స్టార్ నయనతార(Nayanthara) ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి దాదాపు రెండు దశాబ్దాలు అవుతున్న ఇప్పటికీ వరుస సినిమాలలో నటిస్తూ ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నారు. ఇదివరకు కేవలం సౌత్ ఇండస్ట్రీకి మాత్రమే పరిమితమైన నయనతార ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలతో పాటు పాన్ ఇండియా సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.. ఇక త్వరలోనే ఈమె చిరంజీవితో కలిసి నటించిన మన శంకర వరప్రసాద్ గారు సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా సంక్రాంతి పండుగను పురస్కరించుకొని జనవరి 12వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలోనే చిత్ర బృందం పెద్ద ఎత్తున ప్రమోషన్లను నిర్వహిస్తున్నారు.

విభిన్న రీతిలో మన శంకర వరప్రసాద్ ప్రమోషన్స్

ఇక ఈ సినిమా ప్రమోషన్ల విషయంలో మొదటి నుంచి కూడా అనిల్ రావిపూడి విభిన్న రీతిలో వీడియోలను విడుదల చేస్తూ సినిమాకు కావలసినంత హైప్ ఇస్తున్నారు. ప్రస్తుతం అనిల్ రావిపూడి వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటూ ఉన్నారు. తాజాగా సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోను విడుదల చేశారు. ఈ వీడియోలో భాగంగా నయనతార అనిల్ రావిపూడి వద్దకు వచ్చి ఏంటి అనిల్ రావిపూడి మొదట్లో ప్రమోషన్స్ అన్నావు ఇప్పుడు అసలు పట్టించుకోలేదు అంటూ మాట్లాడటంతో అనిల్ షాక్ అవుతాడు.

Advertisement

సంక్రాంతికి రఫ్ఫాడించేద్దాం

మీరు కేవలం జనవరి 12వ తేదీ సినిమా రిలీజ్ అవుతుందని చెబితే చాలు అంటూ అనిల్ చెప్పగా.. జనవరి 12వ తేదీ మన శంకర వరప్రసాద్ గారు విడుదలవుతుంది ..హలో మాస్టారు కెమెరా కొంచెం కెమెరా రైట్ టర్నింగ్ ఇచ్చుకో.. సంక్రాంతికి రఫ్ఫాడించేద్దాం అంటూ నయనతార, అనిల్ రావిపూడికి సంబంధించిన ఒక వీడియోని విడుదల చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సాధారణంగా నయనతార సినిమాలలో నటించడం వరకు మాత్రమే ఉంటారు తప్ప ప్రమోషన్లకు పూర్తిగా దూరంగా ఉంటారు.

Advertisement

ఈమె ఎలాంటి స్టార్ హీరో సినిమా అయినా కూడా ప్రమోషన్లకు రారు కానీ చిరంజీవి హీరోగా చేస్తున్న ఈ సినిమా కోసం నయనతార తానంతట తానే ప్రమోషన్లను నిర్వహిస్తున్న నేపథ్యంలో మెగా అభిమానులు ఖుషీ అవుతున్నారు. నయనతార లాంటి స్టార్ హీరోయిన్ సినిమా ప్రమోషన్లలో పాల్గొనడంతో ఈ సినిమాకు కావలసినంత బజ్ ఏర్పడిందని చెప్పాలి. ఈ సినిమాలో నయనతార శశిరేఖ అనే పాత్రలో కనిపించబోతున్నారు. ఇక చిరంజీవి నయనతార కాంబినేషన్లో ఇది మూడవ సినిమా కావటం విశేషం. ఇదివరకు ప్రేక్షకుల ముందుకు వచ్చిన వాల్తేరు వీరయ్య సినిమాలో నయనతార చిరంజీవికి చెల్లెలి పాత్రలో కనిపించడం గమనార్హం. ఇక ఈ సినిమా సంక్రాంతి పండుగను పురస్కరించుకొని విడుదల కాబోతున్న నేపథ్యంలో వరుస అప్డేట్స్ విడుదల చేస్తూ సినిమాపై భారీ అంచనాలను పెంచారు.

Also Read: Suriya: పెళ్లిలో సడన్ ఎంట్రీ ఇచ్చిన హీరో సూర్య.. వధువు వెంటనే ఏం చేసిందంటే?

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×