E-Paper
Advertisement

Nayanthara Toxic Look: టాక్సిక్ నుండి నయనతార ఫస్ట్ లుక్.. అటు గ్లామర్ ఇటు యాక్షన్

Nayanthara Toxic Look: టాక్సిక్ నుండి నయనతార ఫస్ట్ లుక్.. అటు గ్లామర్ ఇటు యాక్షన్
Advertisement

Nayanthara Toxic Look:లేడీ సూపర్ స్టార్ గా తనకంటూ భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది నయనతార (Nayanthara) భాషతో సంబంధం లేకుండా వరుస చిత్రాలలో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి 20 ఏళ్లు దాటినా ఇంకా స్టార్ హీరోయిన్గా చలామణి అవుతూ ఎంతోమంది కుర్ర హీరోయిన్స్ కి ఆదర్శంగా నిలుస్తోంది. అంతేకాదు ఇండస్ట్రీలో అత్యధిక పారితోషకం తీసుకుంటున్న హీరోయిన్గా కూడా రికార్డు సృష్టించింది నయనతార. అలాంటి ఈమె ప్రస్తుతం ప్రముఖ కన్నడ స్టార్ హీరో యష్ (Yash ) హీరోగా, ప్రముఖ లేడీ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో వస్తున్న ‘టాక్సిక్’ సినిమాలో కీలకపాత్ర పోషిస్తోంది.

ఈ సినిమాలో హీరోకి సోదరి పాత్రలో నయనతార నటిస్తున్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈరోజు ఈమె ఫస్ట్ లుక్ పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్ ను చూస్తుంటే.. నయనతార తొలిసారి తన కెరీర్ లో ఇలాంటి పాత్ర పోషిస్తుంది అని చెప్పవచ్చు. విషయంలోకి వెళ్తే తాజాగా బ్లాక్ అవుట్ ఫిట్ లో గంగ అనే పాత్రలో నటిస్తున్నట్లు పోస్టర్ ను రిలీజ్ చేశారు. అందులో గ్లామర్ గా కనిపించడమే కాకుండా మరొకవైపు గన్ను పట్టుకొని యాక్షన్ పర్ఫామెన్స్ చేయడానికి కూడా నయనతార సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా గ్లామర్ వలకబోస్తూ ఇలా యాక్షన్ పర్ఫామెన్స్ తో ఈ సినిమాలో ప్రేక్షకులను మెప్పించడానికి సిద్ధమవుతోంది నయనతార అని చెప్పవచ్చు. ప్రస్తుతం నయనతార ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

టాక్సిక్ మూవీ విశేషాలు..

Advertisement

టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్ అనే ట్యాగ్ లైన్ తో రాబోతున్న ఈ చిత్రానికి గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్నారు. గ్యాంగ్ స్టర్ చిత్రంగా రాబోతున్న ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తోంది. నయనతార , తారా సుతారియా , హుమా ఖురేషి, రుక్మిణి వసంత్, సుదీర్ నాయర్ , అక్షయ్ ఒబెరాయ్ వంటి భారీ తారాగణం ఈ సినిమాలో భాగం అయింది. ఈ చిత్రాన్ని వెంకట్ కే నారాయణ , యష్ సంయుక్తంగా కేవీఎన్ ప్రొడక్షన్స్ అలాగే మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ బ్యానర్లపై నిర్మిస్తున్నారు.. యష్ 19 అనే వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి 19వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

క్యారెక్టర్స్ రివీల్ చేసిన మేకర్స్..

ఇకపోతే తాజాగా నయనతార గంగా అనే పాత్రలో నటిస్తున్నట్లు రివీల్ చేసిన మేకర్స్.. గతంలో కియారా అద్వానీ నదియా అనే పాత్రలో నటిస్తున్నట్లు తెలిపారు. అలాగే ఎలిజిబెత్ పాత్రలో హుమా ఖురేషి, డైసీ ఒలీవియా గా రుక్మిణి వసంత్ నటిస్తున్నట్లు స్పష్టం చేశారు. మొత్తానికైతే ఎన్నో అంచనాల మధ్య రాబోతున్న ఈ సినిమా అటు యష్ కి ఇటు హీరోయిన్స్ కి ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.

Advertisement

also read:Bandla Ganesh: నా హృదయం భారంగా మారింది.. బండ్లన్న ఎమోషనల్ పోస్ట్!

సంక్రాంతి బరిలోకి దిగుతున్న నయనతార..

ఇదిలా ఉండగా మరొకవైపు నయనతార సంక్రాంతిని టార్గెట్ గా చేసుకొని ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో చిరంజీవి హీరోగా నటిస్తున్న మన శంకర్ వరప్రసాద్ గారు సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమా 2026 జనవరి 12న సంక్రాంతి సందర్భంగా విడుదల కానుంది.

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×