E-Paper
Advertisement

Anaganaga Oka Raju : సంక్రాంతి రేస్ నుంచి రాజుగారు అవుట్, కొత్త రిలీజ్ డేట్ ఇదే

Anaganaga Oka Raju : సంక్రాంతి రేస్ నుంచి రాజుగారు అవుట్, కొత్త రిలీజ్ డేట్ ఇదే
Advertisement

Anaganaga Oka Raju : కొన్ని సినిమాలు మీద ప్రేక్షకులకు విపరీతమైన క్యూరియాసిటీ ఉంటుంది. అటువంటి సినిమాలలో అనగనగా ఒక రాజు సినిమా ఒకటి. నవీన్ పోలిశెట్టి నటించిన ఈ సినిమా ఎప్పుడో విడుదల కావలసి ఉంది. కానీ కొన్ని కారణాల వలన ఇప్పటికీ కూడా వాయిదా పడుతూనే ఉంది. సినిమా విషయంలో చాలా మార్పులు జరిగిపోయాయి. దర్శకుడు మారిపోయాడు. సంగీత దర్శకుడు కూడా మారిపోయాడు.

మొదట ఈ సినిమా అనౌన్స్మెంట్ వచ్చినప్పుడు ఎస్ఎస్ తమన్ ఈ సినిమాకి సంగీతం అందించాలి. కానీ ఈ సినిమాకి సంబంధించి రెండవ టీజర్ విడుదలైనప్పుడు మాత్రం మిక్కీ జే మేయర్ మ్యూజిక్ డైరెక్షన్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. మొత్తానికి ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే.

సంక్రాంతి బరి నుంచి అవుట్ 

Advertisement

సంక్రాంతి కానుకగా ఇప్పటికే చాలా సినిమాలను అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. మొదట మారుతి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న రాజా సాబ్ సినిమా జనవరి 9వ తారీఖున విడుదల కానుంది. ఆ తర్వాత నుంచి వరుస సినిమాలు ఉన్నాయి. అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న మన శంకర్ వరప్రసాద్ సినిమా ఖచ్చితంగా సంక్రాంతికి వచ్చి తీరుతుంది.

జనవరి 14వ తారీఖున అనగనగా ఒక రాజు సినిమా విడుదల కాదు అని విశ్వసినీయ వర్గాల నుంచి సమాచారం వినిపిస్తుంది. సంక్రాంతి కానుకగా ఎక్కువ సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్న కారణంగానే ఈ సినిమాను వాయిదా వేస్తున్నట్లు సమాచారం వినిపిస్తుంది. దాదాపు నాలుగు సినిమాలు సంక్రాంతికి రావడానికి సిద్ధంగా ఉన్నాయి.

రిపబ్లిక్ డే సందర్భంగా 

Advertisement

జనవరి 26వ తారీఖున రిపబ్లిక్ డే ఉన్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా అనగనగా ఒక రాజు సినిమా ని జనవరి 23వ తారీఖున విడుదల చేయబోతున్నట్లు తెలుస్తుంది. అయితే దీని గురించి ఇంకా అధికారక ప్రకటన రాలేదు. నాగ వంశీ ఈ సినిమా రిలీజ్ డేట్ ను అధికారికంగా ప్రకటిస్తారేమో వేచి చూడాలి.

ఇకపోతే నవీన్ పోలిశెట్టి తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఇప్పటికే వరుస హ్యాట్రిక్ హిట్ సినిమాలు ఎంచుకున్నారు. నవీన్ పోలిశెట్టి ఒక సినిమా చేస్తున్నాడు అంటే ఖచ్చితంగా అది బాక్స్ ఆఫీస్ వద్ద సక్సెస్ సాధిస్తుంది అనే నమ్మకం చాలా మందికి వచ్చేసింది. సినిమా కథలు విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళుతుంటాడు నవీన్. అందుకే ఈ సినిమా మీద చాలామందికి ఎక్కువ నమ్మకం.

Also Read: Prabhas : స్పిరిట్ సెట్స్ నుంచి ప్రభాస్ ఫోటో లీక్, ప్రభాస్ ఫ్యాన్స్ కు ఇది సరిపోతుందేమో?

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×