// // Anaganaga Oka Raju Public Talk: అనగనగా ఒక రాజు పబ్లిక్ టాక్ - Staging.BigTvLive -->
E-Paper
Advertisement

Anaganaga Oka Raju Public Talk: అనగనగా ఒక రాజు పబ్లిక్ టాక్.. రాజుగారు హిట్ కొట్టినట్టేనా?

Anaganaga Oka Raju Public Talk: అనగనగా ఒక రాజు పబ్లిక్ టాక్.. రాజుగారు హిట్ కొట్టినట్టేనా?
Advertisement

Anaganaga Oka Raju Public Talk : నవీన్ పోలిశెట్టి హీరోగా సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన తాజా చిత్రం అనగనగా ఒక రాజు(Anaganaga Oka Raju ). డైరెక్టర్ మారి దర్శకత్వంలో ఈ సినిమా మంచి ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ సినిమా నేడు విడుదల కావడంతో ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తుంది. సంక్రాంతి పండుగ సందర్భంగా నవ్వుల సినిమాగా ఈ చిత్రం ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. ఇక ఈ సినిమా కోసం అభిమానులు పెద్ద ఎత్తున థియేటర్లకు తరలి వచ్చారు. సినిమా చూసిన అనంతరం వారి అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.

పాత సినిమాల రెఫరెన్స్..

ఈ నేపథ్యంలోనే కొంతమంది ప్రేక్షకులు ఈ సినిమా గురించి మాట్లాడుతూ సంక్రాంతికి విడుదలైన ఈ సినిమాలను చూస్తుంటే పాత సినిమాలను చూసిన బావన కలుగుతుంది కానీ సినిమా చూడటానికి బాగుంది. ముఖ్యంగా నవీన్ పోలిశెట్టి ఎంటర్టైన్మెంట్ మీనాక్షి చౌదరి యాక్టింగ్ అద్భుతంగా ఉంది అంటూ వారి అభిప్రాయాలను తెలుపుతున్నారు. పండుగకు నవీన్ పోలిశెట్టి సినిమా ఫర్ఫెక్ట్ సినిమా అని ఈ సినిమాలో కామెడీ గాని ,పొలిటికల్ బ్యాక్ డ్రాప్, పాటలు చాలా అద్భుతంగా ఉన్నాయని, నవీన్ పోలిశెట్టి కష్టానికి ఫలితం దక్కింది అంటూ కామెంట్లు చేస్తున్నారు.

నటనతో ఆకట్టుకున్న నవీన్ పోలిశెట్టి..

Advertisement

ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు పాత సినిమాల నుంచి రిఫరెన్స్ తీసుకున్నట్టు అనిపించింది. వాటన్నింటిని పక్కనపెట్టి సినిమాని ఎంజాయ్ చేస్తే మాత్రం ప్రతి ఒక్కరికి నచ్చుతుంది అంటూ ప్రేక్షకులు వారి అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. మొత్తానికి నవీన్ పోలిశెట్టి సంక్రాంతి పండుగ సందర్భంగా స్టార్ హీరోలతో పోటీ పడుతూ ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకున్నారని తెలుస్తోంది. ఇక ఈ సినిమా మొదటి రోజులో భాగంగా ఎంత మొత్తంలో కలెక్షన్లను రాబడతాయి ఏంటి అనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమాలో నవీన్ పోలిశెట్టి మీనాక్షి చౌదరి జంటగా నటించగా, గెటప్ శ్రీను, సత్య, చమ్మక్ చంద్ర, మహేష్, బుల్లి రాజు వంటి తదితరులు నటించి వారి నటనతో కూడా ప్రేక్షకులను మెప్పించారు.

సంక్రాంతి గెలుపు ఎవరిది?

Advertisement

ఇలా కామెడీ, పొలిటికల్ నేపథ్యంలో పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించిందని చెప్పాలి. మరి ఈ సినిమా ద్వారా నిర్మాతలు ఏ స్థాయిలో లాభాలను అందుకుంటారో తెలియాల్సి ఉంది. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మించిన సంగతి తెలిసిందే. ఇటీవల వరుస ప్లాప్ సినిమాలను ఎదుర్కొంటున్న నిర్మాత నాగ వంశీకి నవీన్ పోలిశెట్టి సినిమా కాస్త ఉపశమనం కలిగించిందని తెలుస్తోంది. ఇక పండుగ సందర్భంగా వరుసగా సెలవులు కూడా ఉన్న నేపథ్యంలో సంక్రాంతి సినిమాలకు కలిసి వస్తుందని చెప్పాలి. మరి ఈ సంక్రాంతి బరిలో ఫైనల్ హిట్ ఎవరు కొట్టబోతున్నారో వేచి చూడాలి.

Also Read: Sudha Kongara: వారి వల్లే ఈ పరిస్థితి.. విజయ్ ఫ్యాన్స్ పై సుధా కొంగర షాకింగ్ కామెంట్స్!

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×